దురదృష్టం ఏమంటే --నేను రాస్తున్న --మా కథ చదవడానికి - నాతోపాటు ఆనందం అనుభవం --కన్నీళ్లు కడగండ్లు -ఎన్నో రకాల తీపి చెడు సంఘటనలు భయంకర మైన దృశ్యాలు --వారి మాటలు చేతలు కృత్యాలు --ఇలా నాతొ పంచుకోడానికి -- మా కథ లో ముఖ్య పాత్ర దారులు ఇప్పుడు నాతొ లేరు ! --ఈ కథ ఎవరి కోసం? పోయి నోల్లు అందరు మంచోళ్ళు ---! ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు--! పాడుతా తీయగా చల్లగా --! ఇలా నాలో నేనే నెమరేసుకునే తీయని జ్ఞాపకాలు మధుర స్మృతులు --ఎన్నటికి చెరగని ముద్రలు --అండ మైన అనురాగ భావాలు --ఆనాటి చేదు తలపులు --ఇవన్ని కలబోస్తే ఉగాది నాటి ఐదు రకాల పచ్చడి తిన్నట్లు గా ఉంటుందికదా --!నేటి భవిత పాత అనుభవాల పునాది పైనే కట్ట బడి ఉంటుంది సుమా --! చరిత్ర లేని వాడు --దానిని మరిచిన నాడు --మనిషి పుట్టుకకు అర్థం ఉండదేమో --! మా అమ్మ --మా బాపన్న మా సీనన్న --ఇప్పుడు నాతొ లేరు భౌతికంగా --కాని నా మనసులో నేను ఉన్నన్నాళ్ళు నాతొ బాటు నాలో సజీవంగా ఉంటారు --ఎందుకంటే నేను అనబడే నా చరిత్రకు నా సౌఖ్యాలక...
This blog is about a family lived in the village Ragampet Choppadandi mandal, Karimnagar.