ఇక బుచ్చమ్మ విషయం ---భర్త మధుసూదనరావు కన్నాపురం యలబాక వైపు --5 అన్నదమ్ములు యితడు పెద్ద --కాని భార్య విషయంలో చిన్న --ఆమె కాపురానికి పోయింది చాలా తక్కువ అని చెప్పాలి ఆమె కూడా రూపవతి కాని ఎప్పుడు తల్లిగారింట్లో ఉండటం ఇతరులు పచ్చగా ఉంటె ఆరవ లేకుండా ఉండే గుణం తల్లి దగ్గర పుణికిపుచ్చుకున్నది .. అయన కూడా ఇక్కడే భార్య తో బాటు ఉంది పోయే వాడు ఫలితం తల్లికి ఎడమ కుడి భుజాల్లా వీరు తయారయ్యారు కోడళ్ళను కాలికింది చెప్పులా కాల రాయడంలో తల్లికి సంపూర్ణంగా సహకరించారు
కలవారి కోడలు కావడం వీరి కంటే అన్నింటిలోను అమ్మ తల్లిగారు గొప్పవారు కావడం బంగారం సొమ్ములు పట్టు బట్టలు అదిరి పోయేలా పెట్టడం ఇదంతా అమ్మ వైభవంగా తలచి ఓర్వలేక హీనాటి హీనంగా అమ్మను చూశారు రాగం పేట జాయిదాదును అడ్డం పెట్టుకుని బాపుకున్నతోబుట్టువుల పై మమకారం తలి దండ్రుల పై గల భయం భక్తిని అడ్డు పెట్టుకుని సూటి పోటి మాటలతో అమ్మను చాలా వేదించారు ---అన్నం పెట్టక తిండికి సరి ఐన బట్టలేక పిల్లలకు తనకు సరిపోక చాలా అవస్తలు పడింది నాకు ఒకసారి పోచమ్మ జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలి పోయే నల్లని మచ్చలతో బాధ పడితే అమ్మ ---పాపం మబ్బులనే లేచి స్నానం చేసి తడి బట్టలతో పండి వాగు తోవలో గల పోచమ్మ గుడి వద్దకు వెళ్లి వారం రోజులు దీక్షగా ప్రదక్షణాలు చేసింది--! అప్పుడు మందులా మాకులా ! దేవుంకి దండం పెట్టుకోడం తప్ప చేయ గలిగింది ఏమి లేదు --
వంజరి శివయ్య అనే భూత వైద్యుడు ఉన్నాడు కాని పెద్ద పంతులు అనుమతి అయితే గాని నాది చూడదు చేయి పట్టాడు
కుంభ వర్షాలు కురిసేవి పండి వాగు పొర్లుతూ పారేది అంతగా కరువు ఉండేది కాదు అక్కడ గంగా ప్రవాహం కూడా అలాగే బ్రహ్మాండంగా ప్రవహిన్ చేది అలాంటప్పుడు రాగంపేటకు అత్యవసర పరిస్తీతిలొ అయితే చాలా కష్టం గా ఉండేది --అసలు రాక పోకలే తక్కువ గా ఉన్నరోజుల్లో --ఎవరైనా లక్షెట్టి పేట నుండి కచ్చ్లం కట్టుకొని వస్తే ఇక్కడ వీళ్ళు అమ్మను పుట్టింటికి పంపించేవాళ్లు కాదు పైగా బండి ఎడ్లు లాక్కుని వచ్చిన మనిషిని బాగా కొట్టి తన్ని వెళ్లగొట్టే వారు అందుకే రాగంపేట కు పోవాలని ఎవరిని అడిగినా ఆ మనిషి అమ్మ బాబోయ్ ! రాగంప్యాటకా నేను పోను అంటే నేను పోనని వాళ్ళు కణాలు దోత్తేలు బండెడ్లు గుంజుకుతారు అన్నం బెట్టరు
బత్తెం ఇయ్యరు వంగ వెట్టి గుద్ది గుద్ది సావ గొట్టి ఎల్ల గోడ్తారు ! నీ బాంచెను ! ఆ ఉరికి పొమ్మని మాత్రం అడగ కుంద్రి దొరా ! అంటూ రాగం పేటకు పోవుదంటే ఉచ్చ పోసుకునేట్లు చేశారు రామయ్య భద్రయ్య నారయ్య అన్నయ్య రాగయ్య లు
ఒకసారి ఆనందమ్మ చిన్నాయిని పంపించారట రాగంపేటకు ఆమెనే చెప్పింది ---ఇలా ---
వారి వారం రోజులున్న ! రేపు అని మాపు అని ఇగ పంపిస్తాం ఆగ పంపిస్తాం అని తియ్యగా మాట్లాడుడు ! పంపుడు లేదు నానించి కాలేదురా ! ఏడుపు వచ్చింది దొట్ ! తారక్క రాక పొతే ---నన్నన్న పంపిచ్నుద్రి ! ఇగా వారీ నాకు దుఃఖం ఆగలేదు ౧ ఇగ మీ బాపు బావా ఎం సంగతి అంటే ముసి ముసి నవ్వు నవ్వుకుంట ---ఒకటే మాట రేపు పొద్దున్నే పొండ్రి ! అనే వాడు ఎక్కువ మాట లేదు తన పనేందో తన పుజేందో జపమేందో ---ఇగ ఆవల పద్దదంటే ఓ రాత్రికి వచ్చేతోదో మల్ల స్నానం సంద్యా వందనం ముక్కు పట్టుకుని కూర్చుంటే తెగేది గాదు బలిశేది గాదు ! అబ్బో ఇ౧ ఆయనను చూస్తేనే భయమయ్యేది ---ఇంతింత రెట్టాలు అంతెత్తు ఆజానుబాహువు వారి చుస్తే కళ్ళు చాలవు పో ! దిష్టి తగుల్తాదేమో అనిపిస్తది ! అని కాళ్ళ నీళ్ళు తీసుకున్నది చిన్నాయి
సరే ౧ తెల్లారింది తారక్క నెలరోజుల పచ్చి బాలెంత ! బాపుగాడు పుట్టిండు --! --అయిపాయే ౧ కచ్చలం బొమ్మరెడ్డిపల్లె దాటి ధర్మారం గుట్టల కాడికి రాంగానే --బండికి అడ్డం నిలబడ్డారు అన్నయ్య రాగయ్య లు ! వాళ్ళు కాలేదు వాపసు రమ్మని -- వారి నిజంగా చెప్తున్నా ౧ వారు రాక్షసులురా ! మనుషులి కాదు గింత కనికరం లేదు ౧ నేనుండలే వారి ! మాలల ఇగా జన్మలో పోలేదు !
తారక్క బహు కష్ట పడ్డది నా కళ్ళతో చూసిన ! దాని కి పెట్టె తిండి ! పశువుకు కూడా మనం పెట్టం ---అసొంటి అత్త మామ ఆ మరదులు ఆడుబిడ్డలు ౧ అందరు దయ్యాలు ౧ ఒక్కరన్న మంచిగా తేలలేదు అదెట్లా కన్నదో దాని కళ్ళు గుట్ట ! దానికి ఇద్దరు బిడ్డలు ఆది వాళ్లకు ఇట్లానే చేస్తుందా ! తారక్క దేవుడు నీకు ఎం రాత రాసిందే పాడు ర్రాత !నిన్ను చూస్తుంటే కడుపు అంత దేవుతున్నదే ! నేనేం చేతూ దేవుడా ! అని ఏడ్చుకుంట ఎవరికీ చెప్పకుండా ఈవల బద్దరా ! ఎం చేతాం ౧ దాని రాత అట్లా ఉన్నది ! దేవుడు దానికి అన్ని ఇచ్చిండు సంతానం మంచి తెలివిగల మొగడు ----ఎం లాభం అనుభవించే రాత లేదు ౧ నరకం అనుభావిన్చిన్దిరా ఆ ఇంట్ల
ఇప్పటికి అదంతా తలచుకుంటే దుఃఖం ఆగదు--౧ ఎక్కడి తల రాత అడిగి తెచ్చుకుందో ౧ నేను చూడలేక పోయినా !
అనదమ్మ చిన్నాయి ఆ విషయాలు చెపుతుంటే తను కోలుకోడానికి కొంత సమయం పట్టేది తిరిగి మామూలు మనిషి కావాలంటే
సశేషం ---

Comments