Skip to main content

Posts

Showing posts from December, 2011

Part - 46

మా కథ నడిపించడానికి -మా భారతంలో ధర్మరాజు బాపన్న -సీనన్న భీముడు -ఒకతే తేడ  ! బాపన్నకు కోపం ఎక్కువ  సీనన్నకు కోపమే రాదు లేదు -అంతే-! కుంతీ మాత  కస్టాలు పడ్డది అమ్మ -అన్నీ పోయాయి -ధర్మం న్యాయం జయించాయి ! భారత యుద్ధం ప్రశాంతంగా జరిగింది -అక్కడ యుద్ధం లో పోయారు ప్రతి పక్షయోదులు -ఇక్కడ తర్వాత పోయారు -వెంకటేశ్వర్ రావు తాత ముందుగా పోయారు సివిల్ హాస్పిటల్ లో -పిదప వెంకటమ్మ నాయనమ్మ నాలుగేళ్ళ కు --ఆ  తర్వాత భద్రా రావు -రామ్ నరసింహా రావు నారాయణ్ రావు రాఘవ రావు లు క్రమంగా  నిష్కర మించారు --ఆస్తి తరిగి పోయింది -పంతాలు సమసి పొయ్యాయి -గ్రామంలో క్రమంగా పంతులు గార్ల పట్టు తగ్గి పోయింది ఎన్నో మార్పులు రాజకీయాలు -దొరలూ పట్వారీల చేతుల్లోంచి -జారి పోయింది -సర్పంచ్ గా దేశాయ్ గారు -వెంకట కిషన్ రావు -అతని కుమారుడు దామోదర్ రావు వరుసగా రాగంపేట రాజులుగా చలామణి అయ్యారు -వారు పొయ్యారు -షాహు కార్లు కరీం నగర్కు వలస వెళ్ళారు --పెద్ద మనుషులు మంచి చెడ్డా చెప్పే వ్యవస్థ లేదు ఈనాడు --ఆ రోజుల్లో పంతులు గారు -లేదా   దొర గారు ఎంత చెపితే  అంత -ఊరంతా హడల్ -తల వంచుకుని వెళ్ళే వాళ్ళు ఆనా...

Part - 45

మా కథ రాయ డానికి కారణం  ఆ  నలుగురు -అమ్మ -బాపు  బాపన్న  సీనన్న -వీరంతా కలిసిన  భావాలే నేను -నాలో వీరు నిరంతరం కదలాడుతారు -వారి గురించి రాయడం  నా జన్మకు చరితార్తం గా  భావిస్తాను - మాబాపు ధర్మం -తల్లి దండ్రులను గౌరవించు -వారు ఎంత అన్యాయం చేసినా సరే - అమ్మ అనేది --ఎవరి తోడూ  వాళ్లకు  ఉండాలిరా  అని -ఎన్ని  ఉన్నా తోడూ లేని -నీడ లేని ఆధారం లేని బ్రతుకు శత్రువుకైనా  రావద్దు -అని -మన వెంట  వచ్చేది హరినామామే - అంది -మనం తిన్నదే  మనకు మిగిలేది -అంటూ కడుపు నిండా  తనే స్వయంగా  తన చేతితో కలిపి తిని పించేది -నీవు తిన్నది  లెక్కలకు  రాదురా -మన వెంట వచ్చేది ఒకరికి మన చేతులతో పెట్టేదే ! వెంట వచ్చేది -ఇలా మాకు మా ముగ్గురికి మదటి గురువు దైవం మా  అమ్మ - ! బాపన్న  మాటల్లో చెప్పాలంటే  ---అమ్మ పెంపకంలో మనం పెరిగాం -!ఆదిమున్డలం  అయ్యాం-ఆ  లం ----కొడుకులకు భయపడి -చేతగాని దద్దమ్మలం  అయ్యాం  -బాపు ఉంటె ఆది వేరే తీరుగా ఉండేది -తండ్రికోసం  తండ్రి పోషణ  కరువైన...

Part - 44

అమ్మ చేసున్న పుణ్యమో  సీనన్న సత్య మో -చిన్నవాడిన నోముల ఫలమో -  అందరి కన్నుల పండుగ చేయడానికి నాగరాణి పుట్టింది -పెళ్లి అయ్యిన ఇరవై ఏళ్ళకి --అయితే అంతకు ముందే నేను FAMILY PLANNING  OPERATION  చేసుకున్నాను ఆది వేసేక్టమి -అమ్మకు కోపం వచ్చింది -నేను అన్నాను  ముగ్గురు చాలు కాదే అని ! నీకు సరే సీనన్నకు ఎట్లరా  ! నలుగురు పుడితే  దాంట్లో ఒకన్ని -వానికి పెంపకానికి ఇవ్వచ్చు కదరా ! అంది బాపన్నకు ఆ నలుగురు ఉన్నారు కదా  తను  ఇవ్వచ్చు కదా ! అని నేను అంటే  వాళ్ళు ఇవ్వ్రరట రా ! నువ్వేమో  నాకు చెప్పకుండా ఆపరేషన్ చేసుకొంటివి  -! ఇప్పుడు   వాని గతి ఎట్లరా ! అని బాధ పడింది - వెంటనే నేను సీనన్నను అడిగి నాకు ఇద్దరు బిడ్డలు కదా -న్నీకు ఎవరూ కావాలి -నేను ఇప్పుడే నీ  బిడ్డగా బడిలో పేరు మార్పిస్తాను అన్నాను -చిన్నవాడిన సీనన్న పావని అయితే  చిన్న పిల్ల అమ్మ నాన్న అని  మమ్ములను పిలుస్టది-!అన్నారు వెంటనే నేను స్కూల్ admission  రిజిస్టర్ లో PAVANI  DAUGHTER  OF  SREENIVAS RAO అని మార్పించి అమ్మకు చెప్పాను -అందర...

Part - 43

బాపన్న పెళ్లి వైభవం గా జరిగింది -వెలిచాల గోపాల రావుగారు మంచి పేరుమోసిన ఆస్తిపరుడు  -పైగా ఏడుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు -అందుచేత బాపన్న గర్వంగాను  గౌరవంగాను బ్రతికాడు -పైగా సంతానం చక్కగా అయింది -అయన పురుడు ఖర్చు పెట్టుకోలేదు -రాగం పేట నుండి సమస్త సామాను పోయేది -మొత్తానికి అయన పెట్టినా  -పెట్టకున్నా బాపన్నకు ఒక ధైర్యం  బలం వచ్చింది -చిన్నాయనల  సహకారం లేకున్నా -కుటుంబం నిలపుకోదానికి ఆధారం దొరికింది పైగా పట్వారిగిరి పై వచ్చే ఆదాయం చేతికి వచ్చేది -ఒకరకంగా  తన చిన్నప్పటి కస్టాలు మరపించే సౌఖ్యం  లభించింది -దండి అత్తగారు  బలగం -పిల్లలు -సంఘంలో ఒక  హోదా వచ్చింది - దీనికి భిన్నగా సీనన్న జీవితం -సాదా సీదాగా అయన కన్న తండ్రి గుణాలు పుణికి పుచ్చుకున్నాడు -ఉద్యోగం హోదా వతన్ దారీ -ఏదీ లేదు -పైగా వ్యవసాయంలో వచ్చే ఆదాయం లో  చాలా నష్టాలే -!నిజానికి సంతానం అయితే మాత్రం ఎలా గడిచేదో భగవంతునికే తెలియాలి --!తండ్రిలాగే ఓపిక -మా  అమ్మకు కోపం వచ్చేది అప్పుడప్పుడు ---కాని సీనన్నకు మాత్రం అరవై ఏళ్ళ జీవితంలో కోపం రాలేదు --వాస్తవంగా  అలుగుటయే  ఎ...

Part - 42

సీనన్న అనేవాడు -మీ  అందరికన్నా మేము  రాగంపేటలో తృప్తిగా ఉంటున్నాం  తింటున్నాం  మీకు ఆ హాయి తెలీదు -రాదు  కూడా అని !ఏమున్నా  లేకున్నా -అమ్మ తో బాటు సీనన్న కష్ట పడ్డారు అక్కడ  అయినా  వారు దేనికి వెలితి  పడలేదు -ఇదీ కావాలని  ఎవరిని  అడగలేదు  -ఎవరి ముందు చేయి  చాచ లేదు -అదీ  వారి గొప్ప ధనం -! సీనన్న  పెళ్లి వరకు అటు బాపన్నకు  అర డజను  పిల్లలు  ఇటు అక్కకు సంతానం -   అర డజనే - కాని శ్యామల రాపల్లి  నరసింహారావు తో వర  నిశ్చయం  అయ్యాక -అకస్మాతు గా పరమ పదించింది- అయితే  వీరి  బాల్యం చిన్నతనం  చదువులు - సెలవుల్లో రాగం పేట కు రావడం అమ్మ సీనన్న  బాపన్న ఇద్దరు  వదినలు -అప్పుడే  నాకు రాగంపేటకు బదిలీ  కావడం -అందరం ఒకే చోట ఉండటం - లచ్చి  చేతుల  మీదుగా ఈ  పిల్లల స్నానాలు  ఇంటి చాకిరి - వల్ల  అమ్మకు చాలా  శ్రమ  కావడం -ఇదంతా  చూసి నేను  సీనన్న --గుమాస్తా  కాస  లక్ష్మిరాజమ్  కలిసి  వేరు ...

Part - 41

భక్తి  అంటే ఏమిటో  మన రాగంపేట గత  వైభవాలు తిరిగేసి  చూస్తే  తెలుస్తుంది  --అమ్మ  మా బాపు -ఇంకా క్రిష్ణ శాస్త్రి గారు  చాలు భాగవతులు  అని చెప్ప డానికి  --మన ఇంట్లో శంకరాభరణం  శాస్త్రి ఇంట్లో ధ్వనించి నట్లుగా   ఇంకా నాకు మా  అమ్మ సుప్రభాత గీతాలు వినబడు తున్నాయి -బహుశ  ఇప్పుడు  నిశ్శబ్దం గా  ఉన్న ఆ  దేవాలయంలో అమ్మ  సీనన్న కలిసి ఆలపించే రామనామం -భగవద్ గీత శ్లోకాలు -అండాలు స్తోత్రం -అంబరీష -గజేంద్ర -రుక్మిణి -దశమ స్కంద  భాగవత పద్యాలు ఆ  నాల్గు  గోడల మధ్య మార్మోగుతున్నాయి --వినే చెవులే  ఉంటె ఇంకా వినపడు తూనే ఉంటాయి - అలాగే మా బాపు -తొక్కుడు హార్మోనియం తో   హరే  రామా --కృష్ణా-అని గొంతెత్తి ఆ  ఇల్లు -వాడా వినిపించేలా భక్తితో -బ్రహ్మ ముహూర్తంలో  -పాడటం రాగంపేట గ్రామం చేసుకున్న పుణ్యం --అలాగే నూరు పైగా  పురాణాలు చెప్పి భక్తియుక్తంగా  క్రష్ణా  అంటూ  తన్మయత్వం తో -లీనేమై చెప్పిన  తీరు  నా కళ్ళతో చూశాను -అంత పరవశం చెందుతూ ...