నా PUC చదువు మళ్ళీ కరీంనగర్ లో ప్రారంభం -మంగమ్మ ఇంట్లో ఉనికి -అప్పటికి బాపన్నకు స్వయం శక్తి -కలుగ లేదు -ఇంకా చిన్నాయనల నిర్ణయం పైనే నడుస్తున్నది అతని పట్వారిగిరి వ్యవహారం -వారికి చెప్ప కుండ ఎ పని జరిగేది కాదు -ఇప్పుడు నా విషయంలో కూడా అంతే - సీనన్న వ్యవసాయానికి అంకితం అయ్యాడు -ఇలా నాకోసం వాళ్ళు ఇద్దరి త్యాగంవల్లనే నేను చదువు కోన గలిగాను -నేను మంచి మార్కులతో పాస్ అయితే వారికి ఆనందం కన్న తండ్రి వలె నన్ను ప్రేమగా చూశారు -ఎన్నడు నన్ను పల్లెత్తు మాట అనలేదు నేను చక్కగా చదువు కొడం వారిని ఆనంద పరచింది ఎంత కస్తానికైనా ఒర్చుకున్నారు -ఇప్పటికి నాకు అదే బాధ -నేను చదువు -ఉద్యోగం అని నాలుగు డబ్బులు సంపాదిన్చుకోడం వాళ్ళు గ్రామంలో రైతుల్లా మామూలు జీవితం గడపడం -వాళ్ళు దోతి కట్టుకుని తెల్ల అంగీల్లో ఉంటె నేను ఖరీద్ అయినా షర్టు పాన్తుల్లో దర్జాగా ఉండటం -వాళ్ళ త్యాగం తో నేను వారికి దూరంగా సుఖంగా ఉండటం -వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకో లేక పోవడం -వారిని ఎంత ఆడుకోవాలో అంతగా చూసుకో లేక పోవడం ఇప్పటికి బాధ గానే ఉంటోంది -ఏమైనా నాకంటే చాలా ఎక్కువ కష్టపడ్డారు అమ్మతో సహా -నా జీతము జ...
This blog is about a family lived in the village Ragampet Choppadandi mandal, Karimnagar.