Skip to main content

పార్ట్ 14

పెదమామ ఏడ్చాడు తన అక్కా దీన స్తితిని చూస్తూ ..ఆవేదనతో ---
నేను బావను దక్కిన్చుకుందామనే ఆరాటంలో మిమ్మల్ని రాగంపేట నుండి తీసు కోచాను -ఈ రోజున లచ్చన్న బావ బతికితే నాకు ఎంత బలం ౧ ఎంత ధైర్యం గా ఉండేది నలుగురిలో శెభాష్ అనిపించు కునేవాన్ని --ఇంత కాలం నేను పులిలా బతికాను బావ పోయాడు కోరలు తీసిన పామునయ్యాను ఎంత ఐశ్వర్య ముంటే ఎం లాభం బలగం ఉంటె ఎం లాభం --అక్కా నీకు బావకు నీ పిల్లలకు అన్యాయం చేశానే --ఆయనను తన తలి దండ్రులకు తమ్ములకు దూరం చేశాను రోగం నయం కాలేదు పైగా మనో వేదనతో ఇంకా అవస్త పడ్డాడు బహు బాధ పడ్డాడు శారీరకంగా మానసికంగా తన వాళ్లకు దూరం అయినందుకు ---!అక్కడ వైద్యం చక్కి లేదని ఇక్కడకు తీసు కోచ్చనే గాని ఇలా జరుగు తున్డను కోలేదు --రాగయ్య వచ్చి విషం ఇప్పించి చంపించాడు డాక్టర్ను కట్టుకొని ---మహా కిరాతకులు ఈ రాగంపేట వాళ్ళు --
అక్కడనే ఉంటె ఆ తండ్రీ కొడుకులు -కొట్లాడుకున్నా కొట్టుకున్నా వాళ్ళు వాళ్ళు రక్త సంబందులు ఒక్కటి అయినా ఏమైనా ఇదే అక్కడ పోయినట్లయితే నాకు ఈ అప్రతిష్ట వచ్చేది కాదు వాళ్ళను వేరు చేసిన ! బద్నాం అయినా -నా రెక్కల కష్టం గంగ పాలిందే ---అక్కా ! అంటూ వలవలా ఏడ్చాడు ! ఆటను అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి !
అక్కా మీది ఎనలేని ప్రేమ అతన్ని ముందు వెనుక ఆలోచన లేకుండా చ్చ్చేసింది --!అంటే కాదు పెద బావ అంటే అతనికి
దేవుడు మా బాపు గీసిన గీటు దాటలేదు అతని మాటకు ఎదురు చెప్పలేదు
నిజంగా తను పెద బావ పోయినందుకు సోదరుడుగా తన కర్తవ్యమ్ నిర్వర్తించాడు అపూర్వ సోదరుడు మా పెద మామ తన వారు దీన దుస్తితిలో ఉన్నపుడు ఆడుకున్న ఆపద్బాంధ వుడు అయన
అందుకే మా అమ్మ మేన పిల్లను చేసుకోవాలని పట్టుబట్టింది నా విషయంలో ---కష్టాల్లో ఉన్నపుడు వారు మనకు ఎంతో మేలు చేశారు --ఆ సహాయానికి మన చర్మం తో వారికి చెప్పులు కుట్టించి ఇచ్చినా ఆ ఋణం తీరదురా---!అని చెప్పడమే కాదు --మేన పిల్లను చేసుకుంటివా --సరే సరి ! లేదా --ఈ ఇంట్లోంచి బయటకు నడు ---!అని కచ్చితంగా చెప్పింది
వేరే సంబంధం తెచ్చిన భద్రయ్య పంతులు ను పడి మందిలో ఉండగా అపరి మితమైన కోపంతో నానా దుర్భాష లాడింది -
నిజంగా వారి ముందు దుమ్మెత్తి పోసింది - బాపన్న ఉన్నాడు ఎవ్వరు కిమ్మనలేదు నోరెత్తితే ఒట్టు ! ఎదురు మాట్లాడ కుండా బయటకు వెళ్లి పోయారు సంబండంతో వచ్చిన వాళ్ళతో సహా ! అంత కోపం మా అమ్మ లో ఎప్పుడు చూడ లేదు --!
మామల బలం తగ్గించాలని భద్రయ్య పంతులు ప్లాన్ ! అయితే అమ్మ ముందర బెడిసి కొట్టింది ---!
అలా తమ్ముల పట్ల తన కృతజ్ఞత ప్రకటించు కుంది మా అమ్మ --కళ్ళార అన్నీ చూస్తున్నాను కాబట్టి నేను సరే అన్నాను
అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు --బ్రాహ్మణ పల్లి బావ కూడా ఒక సంబంధం పట్టుకొచ్చాడు అమ్మ నిర్ణయం విని మారు మాట్లాడ కుండా వెళ్లి పోయాడు
అమ్మ గుండెల్లో ఎంత బాధ నిమ్పుకుందో ! శోక దేవతలా నిద్ర ఆహారాలు మాని రాత్రి పవలు అనకుండా విచారిస్తూ కన్నీటి ధారగా రోదిస్తూ ఇంటి వెనకాల చీకటిలో కూర్చుంది పోయేది బిక్కు బిక్కు మంటూ అమ్మ దగ్గర నేను సీనన్న కూర్చుంది అమ్మను చూస్తూ ఎం చేయాలో అర్థం కాక ఎందుకు అలా ఉందొ తెలీని అజ్ఞానంతో తిరుగు తుందే వాళ్ళం
బాపన్న అమ్మ దగ్గరకు వస్తే --ఎం చెప్పాలి ఏమని చెప్పాలి దొంగ చాటుగా పెద మామకు తెలీకుండా కన పడకుండా రావాలి చూడాలి వెళ్ళాలి ! ఎందుకు వచ్చినట్టు --ఎందుకు వెళ్తున్నట్టు ?అగల్ల పై ఈదుతూ తిరిగి అటు కోటి లింగాల వేపు వెళ్తుండగా ప్రవాహం జోరులో కిందకు కొట్టు కు పోయాడట అప్పుడు ఒక పడవ వాడు అటుగా వెళ్తూ అరె --పిల్లవాడు కొట్టుకు పోతున్నాడని తను ఈదుతూ వచ్చి బాపన్నను ఆవలి ఒడ్డుకు చేర్చాదట --ఇదంతా ఒక సందర్భం లో బాపన్న చెప్పుకొచ్చాడు --! ఆనాడు ఆ పడవ వాడు నన్ను చూసి ఒడ్డుకు గుంజక పొతే వారీ ! నేను కూడా గంగ లో కలిసి పోయే వాన్నే ౧ అయితే ఒక్కటే తేడా ౧ మా బాపేమో గంగకు ఆవలి ఒడ్డుకు నేనేమో ఈవలి ఒడ్డుకు కృష్ణార్పణం ! అయి పోయే వాళ్ళం --
గంగమ్మ తల్లి భయం ఒక్కటేనా --! అపుదంతా అడవే తోవలో పగలు తోడేళ్ళు నక్కలు కొంచెం చీకటి అయిందా గుడ్డేలుగులు మందలకు మందలు స్వేచ్చగా తిరుగుతూ కన బడేవి మనిషి కన బడితే మీద పడి రక్కి చంపెసేవి వాటి భయానికి రాత్రి ప్రయాణం చేయలేదు ఎవరూ ద్య్ర్యం చ్చేసి ! దీపాల కాగడాల వెలుగులో చప్పుడు చేస్తూ బందేడ్లకు ముందు ఒకరు చాకలి వెనక ఒక మంగలి మనిషి లేదా పాలేరు తోడూ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇదంతా ఒక ఎత్తు దొంగలు దయ్యాలు కామిని భూతాలు కొరివి దయ్యాలు --ఇలాంటి భయాలతో తోవలో చీకటి అయిందా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వెళ్ళేవాళ్ళం పెద్ద పులులు జిత్త పులులు కూడా ఇలా దంబరు రోడ్డులు అప్పుడు లేవు ఒక్క ఇండ్లలోనే దీపాలు ! అంటే తప్ప బయట కన్ను పొడుచుకున్న వెలుతురూ కానరాడు చక్కని చందా మామ వెన్నెల కాంతి తప్ప ---!
మా బాపు చనిపోయాక మా బాపంనే కాదు మా బాపు 5 తమ్ములుకాని కన్న తలి దండ్రికాని పాలేరు మనిషి కానీ తోబుట్టువులు గానీ ఎవ్వరు మండలిన్చుటకు గాని చూసి పోవాలని గానీ లక్షెట్టి పేటకు రాలేదు ఒక్క రాగయ్య తప్ప
ఎ తమ్ముడైతే పెద్దన్నకు విషం ఇప్పించి ఈ బాధ లనుండి విముక్తున్ని చేశాడో ఆ తమ్ముడే అన్న చని పోయాక పదో దినం నాడు వచ్చి ఒక దొంగ ఏడ్పు ఏడ్చి ---అయ్యో లచ్చన్న మమ్మల్ని విడిచి వెళ్లి పోయినవా ---౧ ! అనుకుంటూ అదే రోజున వేరే మాట లేకుండా వెంటనే తిరిగి వెళ్లి పోయాడు ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా ---ఇదీ సోదర ప్రేమ అంటే ఇలా ఉండాలి ఇలాంటి వారిని ఆదర్శం గా తీసుకోవాలా---౧నర రూప రాక్షసులు కాదా ! వీరి కంటే ఆ జంతువులూ నయం !
animals ఇన్ ప్రిసన్ అని మాకు tenthclaass లో ఒక పాతం ఉండేది
పండిట్ నెహ్రు స్వాతంత్ర్య సమరంలో =--ఆ సమయంలో డెహ్రదున్ జైల్లో ఉన్నాడట తన స్వీయ చరిత్రలో రాశాడు
ఒకరోజున జైలు గోడ పై నుండి పక కోతి పిల్ల జైళ్ళు ఆవరణ లో పడి పోయిందట ఇక పైకి ఎక్కలేక పోగా మిగిలిన కోతు
లన్ని ఒకటై లోనికి దుంకి పిల్ల కోతి కి గట్టి కాపలా కాస్తూ ఈ ఖైదీ లేవ్వరిని దగ్గరకు రాకుండా హుంకరిస్తూ బెదిరిచి ఆ పిల్ల కోతి ని లేవ నెత్తు కొని పోయాయట -- ! ఐక మత్యం అంటే ఏమిటో వానిని చూసి మనం మానవులం జ్ఞానం చదువు ఉన్నవాళ్ళం నేర్చుకో వాలని ---ఆ సంఘటన తమకు స్పూర్తిని బలాన్ని కలుగ జేసిందని అయన తన autobiography లో రాశారు ---- అందుకే అంటారు ఎన్ని ఉన్నా దైవ బలం లేక పొతే ఎవరూ ఏమి చేయ లేరని ---!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...