Skip to main content

పార్ట్-22

మరపు రాని మరొక వ్యక్తీ పెద పాలేరుగా పిలువబడే మనిషి కుటికెల ఎల్లయ్య --కులానికి హరిజనుడే అయినా గొప్ప గుణం మంచి తనం మేమంటే ప్రాణం ఇచ్చి మమ్మల్ని 24 గంటలు కంటికి రెప్పలా కావాలి కాశాడు అతడు భుజం పై గొంగడి చేతిలో పెద్ద కర్ర నాల్ల మీసం తో మాకు అంగ రక్షకుడుగా ఉన్నాడు 6 నాగళ్ల శాత --ఒక ఆవు 2 బార్లు ఉన్నాయి పాలకు పాడి కి కొదువ లేదు వర్షాలు పడేవి పుష్కలంగా పంటలు పండేవి ఈదుల మిట్ట వడ్లు పొయ్య దానికి గుమ్ములు చాలా లేదు రామ చందర్ రావు గారు కొట్టంలో అన్ని వసతులు చేశాడు ఒక చేద బావి రెండు గదులు వంట గిన్నెలు --దేనికి ఇబ్బంది లేకుండా చేశాడు -దేవుడిలా ఆదుకున్నాడు అమ్మ వంట వండేది ఏడుస్తూనే --అతడు అమ్మ్మను సముదాయించే వాడు --లచ్చయ్య పంతులుకు మంచి పేరుంది మీకు ఎంత అన్యాయం జరిగిందో లోకం చూస్తున్నది మీ ఉసురు ఉరికే పోదు వాళ్ళను నాశనం చేస్తది --ఈ కస్టాలు ఎల్లకాలం ఉంటాయా మనకేం తక్కువ --మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది --పిల్ల గండ్ల గురిచి రంది వద్దు మేం ఉన్నాం --! ఇలా అమ్మ్మకు మనో ద్య్ర్యం కలిగించాడు ఆయన
--పేరుకు కొట్టమే అయినా ఒక ఇల్లులా తయారు చేశాడు ఎదురుగా పశువుల పాక కట్టించ్స్సస్స్సాడు అందులో గుమ్ములు ఎడ్లు బార్లు ఉండేవి గడ్డి కుప్పలు వ్యవసాయపు సామాన్లు ఉండేవి ఎప్పుడు నలుగురు పాలేర్లు రాత్రి పడుకునే వారు
మాకు తినటానికి ఇంటి నుండి తిను బండారాలు తెచ్చాడు ఒక్కో రోజు అమ్మ తినేదికాడు ఆ జ్ఞాపకాలతో తలచుకుంటూ రా త్రంతా నిద్ర పోకుండా గడిపేది
కొట్టం చుట్టూ చేన్లు చేలకలు చింత చెట్లు అంతా అడవిలా ఉండేది అటు ఎ ఉరికి తోవ లేదు అన్ని పంట చేనులే --అయితే రాత్రి అయ్యిందంటే విపరీత మైన భయం అయ్యేది ఎలుగు బంట్లు నక్కలు కొందేంగాలు స్వేచ్చగా తిరిగేవి ఇక పాములైతే రాత్రీ పగలు కనపడేవి కొట్టం లోకి వచ్చేవి -- ఒకసారి నేను ఎదురుగా దొడ్లోకి వెళ్ళాను ఉదయం పుట --బుస్సు మని శబ్దం --పైన పడగా విప్పి నాగ సర్పం --ఆడుతోంది --అమ్మా అని కీక పెడుతూ బయటకు ఉరికాను --అమ్మ వచ్చి దండం పెట్టింది నాగరాజా ! ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి పో ! అంటూ ---అంతే ఆది తన దారిన తను పోయింది
పెద్ద పంతులు రాయ బారం పంపాడు ---దిక్కు లేని వాళ్ళ తిరుగ కొట్టంలో ఉండు దెందుకు ? ఇంత పెద్ద ఇల్లు కట్టుక పోతామా వాళ్ళ హిస్సాలో వాళ్ళను వండుకుంట తినుకుంట ఉండమను --మేం వద్దన్నమా --ఉరవతల అడివిలో ఉంది మమ్ము లను బద్నాం చేద్దామనా --నలుగు చూస్తే ఏమనుకుంటారు -- అంటూ ---
అమ్మ ఈ విషయానికి అగ్గి మీద గుగ్గిల మైంది --కోపంతో --చెప్పి పంపింది --ఇది నా మొగుడు కట్టించిన ఇల్లు ఆది క్కోత్తమే కావచ్చు --ఏది ఏమైనా ఎవరి పంచలో బతికే ఖర్మ నాకు పట్టలేదు చావా నైనా చస్తాను కాని వాళ్ళ మొకం ఈ జన్మలో చూడను --! అంత ఆత్మాభిమానం అమ్మది అదే మాట మెడ నిల బదిన్దికుడా అభిమానమే అమ్మ ధనం ఎవరిని దేనికి చేయి చాచి అడగ లేదు తను -- బ్రాహ్మలు వచ్చారు బాపుకు అమ్మకు ఆత్మీయులు వారు అన్సుయంమ్మ సుర్యమ్మా మంగమ్మ కిస్ట శాస్రి మెత్రామయ్య సాంబయ్య పుల్లయ్య లచ్చయ్య గార్లు అమ్మను ఓదార్చారు అనునయించారు --అమ్మ గుణం శీలం మంచితనం తెలిసిన వాళ్ళు వారు
తరుచు వచ్చి ఇక్కడి మంచి చెడ్డా విచారిచే వారు
బాపన్న అసల్దార్ పట్వారి -- అప్పుడు 16 ఏళ్ళు --5 ఉల్ల పట్వారి గిరి --భద్రయ్య పంతులు అజమాయీశే --చిన్నతనం కనుక తాసీలు పట్టాలు పహనీలు వసూళ్ళు పట్టాదారులు ఇవన్ని తెలీవు కనుక గుమాస్తాలు ఉన్నా పెత్తనం పెద్ద పంతులుడే ---
మా బాపు పేరు లక్ష్మి నరసింహా రావు తను ఆకాలంలో మెట్రిక్ పాస్ అయ్యాడు --నిజానికి ఆ పట్టాతో గవర్న మెంటు ఉద్యోగం దొరికేది కాని పత్వారిగానే ఉళ్ళో ఉంది పోయాడు బాపు పోయాక అదే సర్టి ఫికేట్ తో నే --లక్ష్మి అన్న పదం తీసేసి రాం అన్న పదం రాశారు ఇంకేం ---రాం నరసింహా రావుకు ప్రభుత్వ నౌకరీ దొరికి పోయింది
అన్నయ్య నారాయణ ఆర్నకొండ వ్యవహారం చూసే వాళ్ళు రోజు బండి కట్టుకుని అప్ డౌన్ చేసే వాళ్ళు
ఇక రాగం పేట పట్వారిగిరి తమ గుప్పిట్లో పెట్టుకుని బాపన్నను నిమిత్త మాత్రునిగా ఉంచేవారు --ఆ పరిస్తితిలో ఎవరైనా ఎవరున్నా వేరే గతి దారీ లేదు మరి --పెద్ద పంతుల్కు తెలియనిది ఏమి జరిఇగేది కాదు --సమావేశాలు రైతులు రావడం పోవడం దస్త్రం పహనీలు రాయడం సుంకర్లు పని చేయడం ఇవన్ని వారి కను సన్నలలో జరిగేవి --బాపన్నకు వ్యవసాయం పనులు అంటకుండా రామచాన్న్దర్ రావు చూసుకునే వాడు పంటా ఫలితం తనే చూస్తూ అమ్మ కు చెబుతూ వారికి పోటీగా తనే స్వయంగా నిర్వ హించేవాడు పాలేర్లు అయన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు ఇలా ద్వంద్వ పరిపాలన సాగింది కొన్నాళ్ళు --సాంబన్న మామ మమ్మల్ని కొట్టంలో దిగ విడిచి తెల్ల్లారే వాపస్ వెళ్లి పోయాడు మళ్లీ ఎవరుకుడా ఇటువేపు తిరిగి చూడలేదు ---బాపన్న పెండ్లి రోజు వరకు
మా కు దగ్గర బం దువులు ఎరుకల వాళ్ళే --రామ చందర్ రావు ఇద్దరు ఆడాళ్ళని అమ్మకు తోడుగా ఉంచాడు -ఎ రాత్రి అయినా అవసరం పడితే అమ్మ వాళ్ళనే పిలిచేది -గుహుడు సీతా రాములకు తోడ్పడి నట్లుగా --ప్రతి రోజు ప్రతి క్షణం అమ్మ అప్ర మట్టంగా ఉండేది రాత్రి సరిగ్గా నిద్ర పోయేది కాదు --ఎ వచ్చినా తలుపు తీసేది కాదు --ఓ రోజు అమ్మ ఉహించినట్లుగానే ---తాత వాళ్ళింట్లో పని చేసే బెస్త పోశి--ముని మాపు రాత్రి వచ్చింది చీకటి పడుతోంది మనిషి సరిగ్గా కనపడ టం లేదు --ఆ సమయంలో దగ్గర ఎవరూ లేరు ఇంకా పాలేర్లు రాలేదు గొడ్లు రాలేదు ఒకదీపం వెలుతురులో అమ్మ ఒక్కతే చాప పై పడుకుని ఉన్నది బాపన్న రాత్రి 8 అయితేనే గాని ఇంటికి తిండికి రాదు తాత వాళ్ళింట్లోనే పొద్దు గడుపుతుందే వాడు --ఇక అక్క్కడ ఉన్న్నది నేను సీనన్న మాత్రమె --! చీకటి అయిన దంటే కాలు బయట పెట్ట కుండా కదలకుండా పడుకునే వాళ్ళం --కొట్టం గేటుకు దడి -- అంతే కర్రలతో కట్టిన తడక ఉంది లోపల మేమున్న అర్రకు తలుపు ఉంది కాని ఇంకా దగ్గర వెయ లేదు ఆది దడి తీసింది నిశ్శబ్దం గా ---కాని ఆ చప్పుడు కు అమ్మ లేచి కూర్చుంది --ఎవర్రా ! అంటూ అటు చూసే సరికి ఎదురుగా పోశెమ్మ రావడం చూసి దాన్ని అమ్మ గుర్తు పట్టింది --తాత ఇంటి మనిషి మహా పాపాత్మురాలు వెంకటమ్మ నమ్మిన బంటు ! అని తనకు దాని గురించి బాగా తెలుసు --ఇప్ప్పుదేందుకు వచ్చిందో కూడా తెలుసు --వెంటనే అమ్మ గట్టిగా కేకలు పెట్టింది --అరేయ్ ఎల్లయ్యా ! మల్లయ్యా ! ఆ దుడ్డు గట్టె తేరా అని -- ఈ బెస్త ముండ వచ్చిందిరా -- ఎరుకల బాలయ్యా ఓ నర్సి అంటూ తన శక్తి కొద్దీ పెద్ద గా కేకలు పెడుతూ తలుపు భ్దాలున ముసి గొళ్ళెం పెట్టింది --
అమ్మ కేకలు విని ఏదో జరిందని ఎరుకలోల్లు వచ్చారు --జరిగింది విని బాధ పడ్డారు --అమ్మ ఒక్కదానివి ఉన్నపుడు తలుపు పెట్టుకో -చీకటి కాగానే నువ్వు నీ పిల్లలు లోపల ఉండి తలుపు గోల్ల్లెం పెట్టుకొంద్రి --ఇవ్వాళ్ళ గండం గడిచింది ఆ ముండ మళ్లీ రాదిక్క !
అమ్మ వేదనకు అంతే లేదు మా బాపును ఇదే కొట్టంలో ఆ తమ్ములే కట్టేసి దినుసు ఎడ్లు కర్రా టేకుది బండ్లలో నింపుకుని పోయిన పాపాత్ములు --! ఆడదాన్ని వీరా పిల్లలు మేమొక లెక్కా ?
రామచందేర్రావు వచ్చాడు విషయం తెలిసి ఆ రోజు నుండి నమ్మ్మక మైన మనుషు లను ఇద్దర్ని నియమించాడు --తను కూడా ఏమరుపాటు చెండా కుండా గట్టి నిఘా వేశాడు ---ఆది బాపన్న ప్రవర్తనలో గట్టి మార్పు తెచ్చింది మనిషి ఆలోచనలో పడ్డాడు
ఎవరిని నమ్ముకుని తను వారికి ఉడిగం చాకిరి చేస్తున్నాడో వారే తన తల్లిని చంపడానికి మనిషని పంపడం చాలా బాదేసింది
నిజంగానే ఆది అమ్మ్మను గొంతు పిసికి పొతే ---ఏమయ్యేది ఎవరినీ అనేది దీనికి రుజువేది ? తను ఎవరి కోసం ఈ వతన్లు వ్యవహారం చేస్తున్నాడు --ఇన్ని రోజులు వాల్ల్లను గుడ్డిగా నమ్మిన బాపన్న ఈ సంఘటన తో కళ్ళు తెరిచాడు --తన పెర్రణ పట్వారిగిరి ఆస్తి ఉండి కనుక తన జోలికి రావడం ల్లేదు లేకప్పోతే అంతటి బాపు ముందు తనెంత ? ఒక రకంగా పాపమం పశ్చాత్తాప పడ్డాడు
తర్వాత చీకటి ప్పడక ముందే ఇల్లు అనంటే కొట్టం చేరుకునే వాడు ఎన్నట పని ఉన్నా గాని --!ఇపుడు వాళ్ళ స్వరుప్పం తెలిసి తనకు గూడా భయం పట్టుకుంది --వీళ్ళు ఆస్తి కోసం ఎంత కైఇనా తెగిస్తారని ---ఆనాటినుండి మమ్మల్ని అమ్మను కనిపెట్టాడు

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...