Skip to main content

పార్ట్-30

ఉళ్ళో ఇంటి పని ప్రారంభ మైంది -- పునాదులు తవ్వుతున్నారు-- అటు మా చదువు కుంటూ బడుతోంది --బడికి పోవడం కంటే ఇంటి వద్ద ఉళ్ళో అందరు పని చేస్తోంటే బాపన్న దగ్గర కూర్చొని ఆక్కడే అదే మట్టితో ఆడుకుంటూ పొద్దు పోయేదాకా అక్కడే గడిపే వాన్ని --సీనన్న కొట్టంలోనే అమ్మతో గడిపే వాడు నును వస్తేనే సీనన్న కు బడి లేక పొతే లేదు --ఇది గమనించి అమ్మ పెదమామకు చెప్పి ఒక సైకిల్ కొని తెప్పించింది --
ఇక సైకిల్ ప్రయాణం మొదట్లో సంబరమే --అనిపించింది --ఉదయం స్నానం తిండి చద్ది మూటా--అయ్యాక నన్ను హేండిల్ ముందు కూర్చో పెట్టుకుని సీనన్న సైకిల్ తొక్కుతూ చొప్పదండి వరకు తీసుకెళ్ళి --తిరిగి చుట్టి అయ్యాక మళ్లీ నన్ను కూర్చో బెట్టుకుని రావాలి --అయితే మాకు తోడుగా తీగల అంజయ్య అని మాతో బాటు వస్స్తూ చదువు కుంటూ మామ్మ్ల్ని విడవకుండా ఉండేవాడు అతనికి మా అమ్మ మమ్ములను చుస్తున్దాలని ఎప్పుడు కని పెట్టాలని అతనికి అప్ప చెప్పింది --అమ్మ మీది గురితో మాకు అంగ రాక్షకుడిలా ఎటు పొతే అటు వచ్చే వాడు అతనితో చక్కగా ఆడుకునే వాళ్ళం
---ఆ రోజు చాలా చెడ్డ రోజు --ఎవరి మొహం చూసామో ----అనుకోని సంఘటన జరిగింది -ఎప్పటిలానే సీనన్న సైకిల్ రడీ చేశాడు --ఇద్దరి సంచులు పట్టుకుని ముందు కూర్చున్నాను అమ్మ చూస్తుండగానే --యమ స్ప్రర్డుగా తొక్కుకుంటూ తీసుకెళ్ళాడు సీనన్న --ఉరు దాటింది ఊరి పొలిమేర చివర దొరగారి గడి గోదా ప్రక్క తోవన పోతూ --అక్కడ ఉన్న పెద్ద పెద్ద బండలను తప్పిస్తూ వండురుగా ఉండటం వల్ల తోక్కకున్నా జోరుగా పోతోంది మా సైకిల్ --మూలా పై సైకిల్ హేండిల్ తిప్పుతుంటే దానికి నేను పట్టుకున్న సంచి అడ్డం పడి --బాలెన్స్ అవుట్ అయింది --బాధకు తగిలి దానిని తప్పించ లేక నేను సీనన్న సైకిల్ తో బాటు అదే బండలపై మట్టిలో శాంతంగా పడి పోయాం --సీనన్నకు గాయాలు కాలేదు కాని దెబ్బలు తాకాయి దూరంగా తను పడ్డాడు --సైకిల్ ను విడిచి పెట్టి -! నేనేమో సైకిల్ కింద పడ్డాను --అయితే నాకు బండ దెబ్బ కాని కాలో చెయ్యో విరగడం కాని జరుగ లేదు కాని సైకిల్ హేండిల్ ఎడమ వైపుది ---నా కుడి తొడలో బలంగా లోతుగా ఒక కత్తిలా చొచ్చుకు పోయింది ---ఇంకేం సీనన్న నన్ను చూసి నా గాయం చూసి అందులో తోడ నుండి బోట బొటా కారుతున్న్న నెత్తురు చూసి అచేతనుదయ్యాడు
ఉదయమే తొమ్మిది గంటల ప్రాంతమే కనుక ఆది పెద్ద రాదారి కనుక ఎవరో ఇద్దరు గమనించారు వచ్చి --ఇంకా నా తోదలోనే ఉన్న సైకిల్ హేండిల్ ను మెల్లగా బయటకు తీసి - బాధతో ఏడుస్తున్న నన్ను అటు సీనన్నాను ఆ సైకిల్ ను తీసి తుడిచారు మాకు దైర్యం చెప్పారు --
ఇంతలో తమ్మల కాంతి-- వెంగయ్య పటేలు చెల్లెలు అటుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూసింది ఆమె చెల్లె తమ్మల లక్ష్మి నన్ను అమాంతం తన భుజాన ఎత్తుకుంది --కాంతి ఏమో అటు సీనన్న ను రెక్క పట్టుకుని నడిపిస్తూ మా సంచులను తీసుకుని వచ్చింది - ఇలా మమ్మల్ని కొట్టం లోకి వాళ్ళు తీసుకోచ్చారో లేదో అమ్మ దూరం నుంచే చూసి --పరుగు పరుగున ఏడ్చుకుంటూ వచ్చి బోరుమని ఏడ్చింది --అందరు అమ్మను సముదాయించారు నాతోడకు ఏది ఆకు పసరు ముద్దా నూరి కట్టారు --నన్ను పడుకో బెట్టారు --పసర్లు కాషాయాలు తప్ప అప్పుడు మరే వైద్యము ఉండేది కాదు --ఎ జబ్బుకైనా ఎ గాయానికైనా --ఎ రోగాని కైనా -
నా అవస్త కంటే సీనన్న పడే అవస్త నాకు చాలా దుఖాన్ని కలి గించింది నా గాయం తగ్గే దాకా తను మౌనం గా ఉంది పోయాడు --అమ్మతో కూడా మాట లేదు --
నీదెం తప్పు లేదు సీనన్నా ! నేనే నువ్వు హేండిల్ తిప్పు తుంటే --ఈ సంచీ ని హేండిల్ కు తగుల కుండా తీసి దూరంగా ఉంచ లేదు నేను --నాదే పొరపాటు నీదెం లేదు --! అన్న తాను చెయ్యంగనే తమ్మునికి ఇలా జరిగిందని భావన బాద --అంతగా మమ కారం నాపై పెంచు కున్నాడు మా సీనన్న నా పై --
--ఇలా బడికి పోయీ పోకుండా వాన కాలపు చదువు చదివాం మేమిద్దరం --అదే నేను సీనన్న కలిసి ఉన్న రోజులు అవే నాకు దేవుడు మిగిల్చిన తీయని జ్ఞాపకాలు సీనన్నతో--మళ్లీ మేం ఎక్కడా కలిసి ఉండ లేదు చదువు కోసం --విధి మా ఇద్దరినీ వేరు చేసింది విడ దీసింది - నాకు మాత్రమె చదువు అంత గట్టి సీనన్నాను నాతొ కలిసి ఉండ కుండా నాటక మాడింది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...