Skip to main content

పార్ట్-31

రాగంపేట కు రాకముందు పెద్దమామ దర్పం వైభవం ఠీవి రాజసం అట్టహాసం ఆ రోజుల్లో మరెవరికి లేవు --గూడూరు దొరల్లో ఈయన పేరు పొందిన రారాజు --16 మంది గుమాస్తాలు -వచ్చే పేయ్ వాళ్లకు వండి పెట్టడానికి వంట బ్రాహ్మడు లేదా బ్రాహ్మనమ్మ అప్పసంగా ఇల్లు పట్టుకుని ఉండే వాళ్ళు --4 పాలేర్లు నలుగురు బెస్త పనిమనుషులు ఏమ్బటి లింగయ్య బెస్త రాజయ్య బెస్త పోశి లష్మి వెడ్డి రామి --ఇలా ఇంటి నిండా జనమే --పిల్లలు జయక్క ఉదయమ్మ---వాళ్ళు పుట్టినప్పటి నుండి లగ్గాలయ్యే వరకు ఇక్కడే పెరిగారు --తర్వాత మేము వచ్చాము
ఒకరోజు పొలాల అమావాస్య నాడు యాభై పశువులు ఎడ్లు అందంగా శృంగారించి మేడలో పుల దండలు వేసి కొమ్ములకు పైనా రంగు పూసి ఆ ఊరిలోని పశువులతో కలిపి ఉరవతల
అన్నిటిని ఒకేచోట నిలిపి దప్పుల తో ఆనందంగా వాటి చుట్టూ ఎగిరి --చివరకు అందరు తమతమ ఎడ్ల తో ఉత్సాహంగా వాటిని తరుముతూ --ఎల్లోకి తీసుకొస్తారు --పాలేర్లకు ఈనాములుఇస్తారు తాగినంత తిన్నంత --వారికి అటు పశువులకు దానా --చాలా గొప్పగా ఉండేది మనకు దసరా ఎలాగో ఆనాడు ఎడ్ల పండుగ అలా గొప్పగా చేసే వారు
అయితే ఎర్ర పోచయ్య అనే పెద్ద పాలేరు పై వాడు ఏదో అంతేనో ఏమో --పెదమామకు కోపం వచ్చింది --హంటర్ తీసుకుని వాన్ని కొట్టడం నాకు ఇంకా గుర్తు --అంత హడల్ అతనంటే అందరికి దాదాపు ఉచ్చ పోసుకున్నంత భయ పడేవారు
ఆయనకి ధర్మ పూరి పెండ్యాల బాల కిష్టయ్య గారు చాలా విశ్వాస పాత్రుడైన మిత్రుడు ప్రతి ఆలోచనకు ఆయనను పిలిచి సంప్ర దించే వాడు కొత్తపల్లి కిష్టయ్య పాపయ్యగారు సత్రం నర్సయ్య మండలం విశ్వా నాథ శాస్త్రి --గూడూరు మాధవ రావు వేంకటేశ్వర రావు రామా రావు సూర్యా రావు లు మన బ్రాహ్మణ వాడకు ప్రముఖులు --
రాజయ్య అనే దాసరి ఏక తార పట్టుకుని --మన ఇండ్లలో --భిక్షానికి వస్తుందే వాడు --అతడు బిగ్గరగా తార మీటుతూ వాయిస్తుంటే --అందరికి విన బుధి అయ్యేది -గాంధి తాతలా అతడు నవ్వుతు శ్రావ్యంగా ఎలుగెత్తి పాత పాడుతుంటే నాకు చాలా ఆనందమయ్యేది --
-----మరి ఇంకా వెదకి చూచెదను ---సీతా మానిని దొరకా కుంటేను --
సుర వైరి రావణా సురుని దొరుక బట్టి --గిర గిరా దిమ్పీ ఈ ధర వాని -కుతికేద---
మరి ఇంకా వెదకి చూచెదను --------
బక్కగా పొడవుగా నారదుడిలా ఇలాటి భక్తి గీతాలు పాడే వాడు
ధర్మ పూరి లో చాలా మంచి విద్వాంసులు చక్కగా పురాణాలు చెప్పే పండితులు --ఉంది వారు నాటకాలు వేసి --తులా భారం భామా కలాపం -ఇలాంటి --వాటితో అద్భుతంగా డ్రామాలు వేసి రాగాల్లో పద్యాలతో --కథను రక్తి కట్టించే వారు ---ఇదంతా సినిమాలు రాక ముందు --! కాకర లక్ష్మి కాంత శాస్రి --చంద్ర మౌళి సిద్ధాంతి ----వీరు మనింట్లో భారతం చెపుతుంటే అంతా పరవ సించె వారు -- jv నరసింగ రావు gv పీతాంబార్ రావు అప్పటి రాజ కీయ నాయకులుఇ స్వయంగా వచ్చి వారు చెప్పే పురాణాలు విని పోయే వారు
ఇద్నతా నాబాల్యంలో జరిగిన సంఘటనలు -- అయితే ఇలాంటి వారే నాకు పాటలపై రాగాల పై సంగీతం పై అభిరుచి కలి గిన్చారేమో -నిజమే నాకు చిన్నపాటి నుండి సంగీతం పై చాలా ఆసక్తి మక్కువ --అప్పుడు ఆ ఊరిలో ఒకే ఒక్క రేడియో --ఆది కూడా బస్సు స్టాండ్ వద్ద ఒక హోటల్ లో ఉండేది --ఆది రాత్రి *8 గంటలకు బినాకా గీత మాల --అనే బినాకా టూత్ పేస్టు ప్రచారం కోసం హిందీ పాటలను అమీన్ సాయాని అనే అంకర్ ద్వారా విని పించేవి అక్కడ --అయితే ఎంత రాత్రైన లైట్లు లేకున్నా --ఒంటరిగా వెళ్లి నేను ఒక్కనే గంట సేపు కుర్చుని విని వచ్చే వాణ్ని --అంత ఇష్టం ఉండేది నాకు పాట లంటే -

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...