Skip to main content

పార్ట్-29

మా కథ అంటే -- నా చదువు సీనన్న చదువు మొదలైనాయి మాకు ఎ బడిలో కూడా శ్రీకారం చుట్టలేదు ఎవరూ --ఇంతవరకు ఎ బడికి పోలేదు కూడా నాకు పదేళ్ళు సీనన్నకు 12
మాకు పక్కన గౌండ్లోల్ల పిల్లగాడు చొప్పదండి బడిలో చదువు కోసం --అక్కడే ఉంది వండు కుంటూ 7 తరగతి చదువు కొంటున్నాడు --మా అమ్మ వాణ్ణి పిలిచి వాణి తండ్రికి చెప్పి --మా పిల్లలు కూడా నీ రూం ప్రక్కనే రూం తీసుకుని నీ దగ్గర ఉంది చోప్పదండిలో ఉంటారు చదువు కుంటారు అని అడిగింది
సరే ! మంచిది కానియ్యి ---అంటూ వారి ప్రక్కన రూం లోనే ఉంటూ మేము ఇద్దరం వండుకుంటూ --చోప్పదండిలో నేను 5 సీనన్న 7 తరగతుల్లో నేరుగా ప్రభుత్వ పాట్ట శాలలో చేరాం ఆరోజు బాపన్న వచ్చి మమ్మల్ని చేర్పించాడు --అయితే అప్పుడు వయసును బట్టి మాత్రమె ఆయా తరగతుల్లో ప్రవేశానికి అనుమతి ఉండేది --
నిజానికి మాకు ఆ చదువుల్లో ఇద్దరకి శ్రద్ధ ఉండేది కాదు పైగా అక్షరాలూ కూడా పలకరాని చదువలేని దశలో ఉన్నాం మేమిద్దరం --అప్పుడు --అందుచేత చదువు రాక చదువ లేక - ప్రతి రెండు రోజులకు రాగంపేటకు పారి పోయే వాళ్ళం --అంటే ఎప్పుడు బడికి చుట్టి అవుతుందా --! ఎప్పుడు ఇంటికి చేరుతామా --అమ్మను చూస్తామా --! అని రోజు కళ్ళలో అమ్మను నింపుకుని ఆలస్యమౌతే కన్నీటి దారాలతో అంగీలు తడుపుకొని గూటికి చేరే పక్షుల్లా మేం దౌడు తీసే వాళ్ళం -- --అమ్మ కట్టి ఇచ్చిన అన్నం శాకం ఆ రోజు మర్నాడు ఉంచుకోని --వంట జోలికి పోకుండా -తింటూ ఉంటూ పొద్దు గడిపే వాళ్ళం -
అయితే నాకంటే 2 ఏళ్ళు సీనన్న పెద్ద కనుక నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే వాడు --తన చదువు తిండి తరగతి ధ్యాస - అన్ని వదలి --నాకోసం నాకు ఒక అంగ రక్షకుడుగా ఉండేవాడు --ఓ రోజు నా తరగతిలో నా పై ఎవరో పోట్లాటకు దిగుటే తటాలున సీనన్న ప్రత్యక్ష మయ్యాడు - వాడు ఆది చూసి వెనుకకు జారు కున్నాడు --పుట్టినప్పటినుండి మా సీనన్న సహజంగా బల వంతుడు ---ధృడ కాయుడు --ఎవరికీ భయపడని -మనో దైర్యం ఆత్మా స్థైర్యం కలిగిన వాడు --అసలు భయమంటే ఏమిటో కూడా -తెలియని వాడంటే మనం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు - దేవుడు అతన్ని అన్నగా నాకోసమే నా చదువు కొరకే నన్ను ఒక ఉచ్చ స్తితిలో విద్యా వంతున్ని చేయడానికా అన్నట్లు గా --నా కోసమే --నా కోసమే నడచి నడచి --నడచీ ! --
నాకన్నా నిరుపేదా--ఆ మహారాజు --పాపం అదుగో --!
అసలే ఆనాడు చూపు --ఆ పై ఈ కన్నీళ్లు --!
తీరా దయ చేసిన నీ రూపు తోచ దయ్యయ్యో --!
ఎలాగో -- సీనన్నా--?
ఏదీ --! ఏదీ --! ఆ నీల మోహనము --౧ నీ మంగళ రూపము --?
నేను నాలుగు అక్షరం ముక్కలు నేర్చానంటే సీనన్నే కారణం --నాకు విద్యా భిక్ష పెట్టిన మొదటి గురువు అతడే మా సీనన్ననే --ఇందులో ఏ దాపరికం లేదు --అతిశయోక్తి అంత కన్నా కాదు ---
సాయంత్రం అయిందంటే చాలు --చుట్టి కొట్టడానికి చేప్రాసి సుట్టే తీశాదంటే చాలు అటునుండి అటే సంచి మెడకు వేసుకొని - ఎవరో తరుము తున్నట్లుగా ఇంటి వేపు ఒకటే పరుగో --! పరుగు--!
నా వెనుక సీనన్న పెద్ద పెద్ద అంగాలు వేస్తూ వచ్చే వాడు --పరుగులాంటి నడక -ఆయన నడక కు నా పరుగు అందేది కాదు --! నేను ఉరికి ఉరికీ తొందరగా అలిసి పొయ్యే వాణ్ని --ఎందుకంటే పొద్దు పోతున్నదనే భయం --చొప్పదండి నుండి రాగంపేటకు 8 కిలో మీటర్లు --చలి కాలం అయితే పొద్దే ఉండేది కాదు --తాత ఇంటి ముందునుండి పోయే వాళ్ళం కాదు --వచ్చే వాళ్ళం కాదు --అసలు వాళ్ళకు కన పడే వాళ్ళం కాదు --ఆ తోవ కు పివద్దని -మాకు మా అమ్మ చెప్పింది --
రాగంపేట ఉల్లోకి వచ్చేదాకా ఎవరో తరిమినట్టుగా వచ్చి --తర్వాత అడ్డతోవలో మాదాది వాళ్ళ సందులోంచి చాకలి వాడకు టెలి శాలోల్ల వాడగుండా ఏర్కలి ఇండ్లల్ల పడ్డాక కొట్టం కనపడితే మాకు ముఖ్యంగా నాకు దైర్యం వచ్చేది --
వంట రాదు --వండ లేము -అసలు అమ్మను విడిచి అక్క్కడ గడుప లేము --అని అమ్మకు నిర్ధారణ చేసుకొంది--
మరెలా ? తమ్ముడు రాములుకు మనిషితోటి కబురు చేసింది పిల్లల గండ్ల చదువుకు కష్ట మౌతున్నది బండెడ్లు పంపమని -! వెంటనే ఉన్న ఫలంగా పెద మామ పంపనే పంపాడు --మళ్లీ మా చదువుల వేట --ఏ సారి బందేడ్ల పై మా వెంట మనిషి ఒక్కొక్క రోజు అక్కడే చొప్పదందిలోనే ఉండాల్సి వచ్చేది పరీక్షలకనీ --
సెలవు రోజుల్లో నేను సీనన్న -- కలిసి బాపన్న వెంబడి చేన్ల దిక్కు వెళ్ళే వాళ్ళం --రామ చందర్ రావు నన్ను తన భుజాల మీద ఎక్కించుకుని చిన్న పంతులు ---ఊహూ ౧ అంటూ నన్ను చూస్తూ తెగ సంబర పడి పోయేవాడు
ఎందుకో తెలీదు కాని అప్పుడప్పుడు నన్ను చూస్తూ కన్నీళ్లు పెట్టు కునే వాడు - ఇలా మా కోసం ఇన్ని కన్నీళ్లు కార్చే -హృదయం ఉంది కనకే మేం అడవిలో ఉన్నా --ఎ అపాయము జరుగ లేదు -వాస్తవానికి కొట్టంలో ఉన్నాం అని పేరుకే కాని నేను సీనన్న కలిసి ఆనందంగా ఉన్నాం ---ఆడుకున్నా పాడుకున్నా మమ్మల్ని అడిఇగే వారు లేరు --పాలేళ్ళు పని మనుషులు --అక్క్కడి ఎరుక్కలి వాళ్ళు --మమ్మల్ని ఆదరంగా ఆప్యాయంగా అభిమానంగా చూసే వాళ్ళు .

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...