మన జీన్స్ లో వున్నాయి మా తండ్రికున్న లక్షణాలు అదే మర్యాద మంచితనం సహనం శాంతి ధర్మం ఎదురు మాట్లాడ క పోవడం ఓర్పు ఇలాంటి సాత్విక లక్షణాలతో అయన సంతానం మా సంతానం అవే పుణికి పుచుకున్నాము మా బాపన్నకు ఇదే కోపాన్ని తెప్పించేది ఇంత అన్యాయం జరిగిన ఏమి చేయలేని అనలేని నిస్సహాయత అమ్మమ్మపై కోపాన్ని చూపాడు నీ పెంపకంలో పెరిగాం కనక ఏమి చేయలేని వెధవలం అయ్యాము అని. (baapanna gurunchi koddiga: నాకు మాత్రం మా బాపు . నాకు మా బాపు తెలియదు ఎలా ఉంటాడో ఏమేమి చేశాడో అమ్మమ్మ చెప్పగా అందరు అనుకోగా వినడమే ! కానీ మా బాపన్న మాకు మా బాపు లేని లోటు తీర్చాడు అన్నం పెట్టాడు ఆశ్రయం ఇచ్చాడు అభయం ఇచ్చాడు మాకు పెద్ద దిక్కయ్యాడు మా అమ్మకు వైద్యం చేయించాడు పొగిడితే ఆ యు క్షీణం అని కోపించే వాడు అలాఅని నేనుగాని సీనన్నగాని బాపన్నకు ఏనాడైనా ఎదురు చెప్పామా? లేదు! మాలో ఆ కృతజ్ఞత భావం ఉంది తన నలుగురి కొడుకుల కంటే మా పైననే ఎక్కువ శ్రద్ధ శ్రమ చూపాడు ఒక్క మాటలో చెప్పాలంటే మా బాపు ఉంటె మా కోసం ఏమేమి చేసేవాడ...
This blog is about a family lived in the village Ragampet Choppadandi mandal, Karimnagar.