Skip to main content

పార్ట్ 23

ఇప్పుడు బాపన్న చేసే వ్యవహారం అదే పట్వారి గిరి అప్పుడు మా బాపు చేశాడు కాని తనే స్వతంత్రంగా వీళ్ళను ఎదిరించి వీరి ప్రమేయం లేకుండా చేశాడు అయితే ఆది ఒక అంతర్ యుద్ధం బాపుకు ఆ దిక్కు మాలిన వ్యాధి రాక పొతే మా భవిత మరోలా ఉండేది --అద్భుత మైన పరిజ్ఞానం బాపుది--అప్పుడే వెంగయ్య పటేలు రంగ ప్రవేశం చేశాడు బాపు చేసే ప్రతి పనికి మాటకు వెనుక సమర్తించే వాడు --అతనికి చాలా పరపతి ఉంది స్వంత ఉరు బొమ్మారెడ్డి పల్లి అతనికి యాభై మంది గ్రూప్ గ్యాంగ్ ఉంది అతడు కను సైగ చేస్తే చాలు వారు ఎంతటిపని అయినా చేసేది ఆ గ్యాంగ్ --ఈ రకంగా ఊరి పట్టు బాపుకు మాత్రం చాలా అనుకూలంగా ఉండేది
మరో వ్యక్తీ దేశాయి న్యాలకొండ రాం కిషన్ రావు గారు --ఆయనకు ఇప్పుడున్న పెద్ద దడి --ఒక నవాబులా ఉండేది అతని కోట గది 1000 ఎకరం పైన బూములు అతడు ఒక సర్వ భౌముదంటే అతిశ యోక్తికాడు మన కంటే ఎక్కువ ఆస్తి థాటు దర్పం హుందా ఊరిలో అజమాయిషీ --ఉంది గదిలో ఒక 20 మంది మనుషులు పని సేవ చేస్తూ అతన్ని దొరా దొరా ! అంటూ అతని అడుగులకు మడుగులోట్టుతూ అనుక్షణం గదిని అంటి పెట్టుకుని జనం ఉండేవారు తాగినంత తిన్నంత ఉండేది --ఉళ్ళో ఎ ఆఫ్ఫిసర్ తాసిల్దార్ వచ్చినా ఆ గదిలోనే దిగి రోజుల తర బడి మజా చేసే వారు బాపుకు ఆ రాం కిషన్ రావు దొర కి చాలా విశ్వాసం ఉండేది ఈ తండ్రి కొడుకుల కొట్లాట అతనికి నచ్చేదికాదు --ఎన్నోసార్లు బాపుతో అన్నాడు కూడా
---పంతులు ఎందుకీ ముసుగులో గుద్దులాట వాళ్ళు చల్లూరు వాళ్ళు వారి ఉరు ఆర్నకొండ వాళ్ళది ఈ ఉరు కాదు గుంటడు జాగా లేదు --వాళ్ళు ఉంటున్న ఇల్లు నువ్వు నీ స్వంతంగా కట్టు కున్నావ్ --ఏదో కొన్నాలు ఉన్నారు కన్న వాళ్ళు బావుంది కాని నీ ఆస్తికి వాళ్ళ జులుం ఏందీ ఇది నీ ఆస్తి నువ్వు పెంపకం వాళ్ళు కాదు హక్కు దారువు నువ్వు --ఇక్కడ వాళ్ళు ఇట్లా ఉన్నాకొడ్డి ఈ లొల్లి పోదు వాఆల్లకు ఈ ఆశ్ట్ మీద కన్ను పడింది ముసలాయన సామాన్యుడు కాదు దేవాంతకుడు కాలాంతకుడు --దాని కోసం మీ ప్రాణాలు తీసే రకం నీ మంచి కోసం చెపుతున్నా ఒక ఓర లో రెండు కత్తులు ఇమడావ్--వాళ్ళను ఇంట్ల నుండి ఈ ఊరి నుండి వెల్ల గొట్టు నీకు భయం లేదు అండగా నేను నిలబడతా ! -- పంతులు మెత్తగా ఉంటె వ్యవహారం తేలదు-- అన్నాడు
కాని బాపుకు తలిదండ్రులు అంతే తెగ ప్రేమ భక్తి అందరికి బాపు అంతే గురి కాని తండ్రి కొడుకుల మధ్య వైరం చూసీ ఏమి చేయలేని స్తితి లో మిన్న కున్నారు
ఈ దొర గారి కంటే ఇంకా పలుకు బడి ఉన్న మరొక దొర పెద్ద భూస్వామి మొత్తం ఆ ఇలాఖాలోనే --అబ్బో ఆయనా -- అనుకునే కలెక్టర్లు అధికార్లు ఆయన ఏది చెబితే ఆది మారు మాట్లాడకుండా చేసే వారు అతడు --పుస్కురి బుచ్చన్న దొర మన వేవ్గయ్య పటేల్ ఆయనకీ చెప్పాడు ఈ పోరాటం అప్పుడే అతడు ఒక మీటింగ్ పెట్టాడు ఈ ఊరిలోనే దానికి పెదమామను కూడా పిలి లించాడు అయన ఊరి వారంతా వచ్చారు జరిగేది అన్యాయం అన్నారు పెద్ద పంతులు 5 కొడుకులు ఉరు విడిచి వెళ్లి పోవాలని తీర్మానించారు సరే అన్నాడు పెద్ద పంతులు కాని ఇంకా ద్వేషం పాగా బాపు పై పెంచుకున్నాడు --కొడుకులతో కలిసి బయట భాఆర్య బిడ్డలతో కలిసి ఇంట్లో నేరగా యుద్ధం చేయ సాగాడు
ఇక అమ్మకు ఇంటిలో బాపుకు బయటా కస్టాలు సాధింపులు తిట్లు వేధింపులు మొదలైనాయి అప్పుడు వెంగయ్య పటేలు తన విశ్వా రూపం చూపాడు వాళ్లకి తాత మనుషులను తన్నించాడు ఎ మనిషి వారు చెపితే వినకుండా కట్టడి చేసాడు ఈ తమ్ములు అంతా కలిసి పటేలు మీది కోపాన్ని బాపు పై చుపారిఉ అదే ఇంటిలో 2 గుంజలకు కట్టివేసి చేతులతో కొరడాతో కొట్టారు అమ్మ్మను మమ్ములను తిండి పెట్ట కుండా మాడ్చారు --పాపం బాపు ---ఎ చోట తిన్నాడో ఎన్ని పస్తులున్నాడో ! పలు బాధలు పడ్డాడు తన భార్య పడే నరకం తన బిడ్డలా గరీబు తనం చూస్తూ కూడా ఏమి అనలేక గృహ హింసను సహిస్తూ పోయాడు
మరోసారి ఇదే కొట్టంలో ఉన్న ధాన్యం నాగళ్ళు పశుఉవులను ఆర్నకొండ మనుషులతో ఓ రాత్రి దోచుకొని పోతుంటే బాపు అడ్డం పోయాడు అతన్ని అక్కడే కట్టేసి కొట్టి కట్లు విప్పకుండా కొట్టం మొత్తం లూటీ చేసి వెళ్లి పోయారు ఇది తెలిసి మన పటేలు బయట దొరికిన ఆఅర్నకొన్ద మనుషులను తన గంగతో ఆర్నకొండకు వెళ్లి అక్కడే ఉన్న అన్నయ్యను నారాయణను చితక బాదాడు --తర్వాత రోజున ఒకచోట ఒంటరిగా పోతున్న వెంగయ్య పటేలును భద్రయ్య తన మనుషులతో కాపు కాసి కర్రలతో కొట్టించాడు కసితో ఆ దెబ్బలకు వారం రోజులు లేవలేదు ఆయన ---తర్వాత పొలిసు స్తతిఒన్లొ అతడు భాద్రిః పై కేసు పెట్టాడు తుపాకి తీసుకుని కోపంతో బయలు దేరాడు ఈ 5 గురిని కాల్చిపారేస్తానని తను ఏమైనా పరవా లేదని --బాపు అతన్ని ఆపాడు చంపడం తో సమస్య పరిష్కారం కాదు అని
ఇదంతా చూసి పెద్దొర గడి లో ఒకరోజు అన్నాడు --- నేను అనుకున్ననతా అయింది ఆస్తి కోసం వాళ్ళు నీ ప్రాణాలు తీస్తారు పాపం నీ భార్య ఆ ఇంట్లో న ఎన్ని అవస్తలూ పడుతుందో నీ పరిస్తితియే ఇలా ఉంటె ఆడది ఆ లంకలో ఇంతా బాధ పడుందో---అంటూ ఎప్పుడైనా ఈ అఘాయిత్యం జరుగ వచ్చు చాలా జాగ్రట్టాగా ఉండు ! నీ భార్యా పిల్లలతో మా ఇంట్లో వచ్చి ఉండు ! అన్నాడు బ్రాహ్మలకు అమ్మను వెంకతంమ్మ తిండి పెట్టకుండా మాడ్చు తోందని తెలుసు అమ్మ మంచి నీళ్ళు తేవడానికి కున ప్రక్కన బావి వద్దకు వచ్చినప్పుడు తాము తమ బిందెల్లో అమ్మ తినడానికి అన్నం దొంగ చాటుగా తెచ్చే వారు సాను భూతి యె తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్టిట్ మన ఉరివాల్లది
ఒకరోజు మా బాపు కృష్ణా శాస్త్రి ఇంటికి పట్ట పగలు వచ్చాడు అనసూయమ్మ ఎదురుగా ఉంది ఎం కావాలి పంతులు---
కిస్తాన్న ఉన్నాడా?
అయన పుజమీద ఉన్నాడు మీరు కొన్ని మంచి నీళ్ళు తాగండ్రి
ఆమె వైపు తల ఎత్తి చూడలేదు అరుగు పై ఆమె పెట్టిన నీళ్ళ చెంబు తీసుకుని నీళ్ళు త్రాగి చెంబు తన పంచెతో తుడిచి చెంబు బోర్ల వేసి తల వంచుకుని వేరే మాట్లాడ కుండ వెళ్ళాడట బాపు
మనోహరు మీ బాపు మొకం ఎట్లా ఉంటాడో నాకు తెలియదు ఏమి వినయం ఏమి భక్తీ --ఇంతా లొల్లి ఇంట్ల జరుగు తున్నాగాని ఎవరితో నాన్న అయ్యో గిట్ల జరుగు తున్నది ఎం చెయ్యాలి అనీ చెప్పుకోడం ఊఉహ్హున్ !ఎంత శాంతం ఎంత గంభ్హీరం ! నిజమైన కరణం పంతులంటే లచ్చ్చయ్య పంతులే --! మాకు రోజు తెలివయ్యేది మీ బాపు పాడే మేలుకోలుపులతోనే రామా రామా అని ఇంతా హాయిగా పాడే వాడంటే ఇంత బాధల్లో అతడు ఎలా ఆనందంగా ఉంటున్నాడు అని ఆశ్చర్యంగా ఉండేది --ఉరు మీద ఉరు పడ్డా కరణం మీద కాసు పడదు అంతే ఇదేనేమో ! అంది ఆమె మరియు శాస్తి గారు

పోరాటం తీవ్రం అయ్యింది పెద మామ కు ఈ విషయం తెలుస్తోంది క్షణం క్షణం భయం భయం గా గడుస్తోంది
బాపూ ! నన్ను తమ్ములు కొడుతున్నారు ?
నేను కాదు నీ బాపును పైన ఉన్న మీ బాపు వీరయ్య పంతులు తో చెప్పుకో పోయి !
నా మీద ఎందుకింత కోపం మీకు నేనేం చెయ్యాలి
రాగంపేట ఆస్తిని ఆరు పాళ్ళు చెయ్యి నువ్వు
నేనెవర్ని పంచడానికి ఇది నువ్వు ఇచ్చావు నువ్వే పంచు నేను ఎక్కడ శతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను--
నేను రామకోటి రాస్తున్నా ఇటువంటివి రాయ ! నీ పేరున ఉంది నువ్వే రాసి ఇయ్యి
నేను నాది కానిది రాసి ఇస్తే ఎవరూ ఎ దేవుడు ఈ ఉళ్ళో వాళ్ళు మెచ్చారు మీకు ఇచ్చిన మరు క్క్షణం నేను బయట తిరుగ లేను నన్ను ద్రోహి అంటారు అన్నదమ్మ్ములతో కలిస్ ఇక్కడి ఆస్తిని దోచుకున్నారు అని నిందిస్తారు బాపు నేను చేయ లేను నావల్ల కాదు
అయితే అనుభవించు
మాటా మాటా ముదిరింది తమ్ములు ఐదుగురు బాపును పట్టి కోపంతో కొత్త సాగారు రామయ్య భద్రయ్య్లు అర్రలో ఉన్న మా సామానులు సండుగులు అమ్మ చీరలు బయట పడేశారు మళ్లీ బాపును పెద రెక్కు పట్టి ఈడ్చుకు పోతుంటే అమ్మ అడ్డం పోయింది అదే బావి ప్రక్కన బాపు తన అర్రకు అడ్డంగా సామానులు బయట పదేయకందని బ్రతి మాలుటు నిలబడితే అతన్ని గుంజుకోచ్చారు నలుగురు అడ్డం పోయిన అమ్మను నారాయణ అమ్మ తల వెంట్రుకలు పట్టి ఈద్వాడం నాకు ఇంకా జ్ఞాపకం అప్పుడు ఉయం ౧౦ గంటలు కావస్తోంది ఇల్లంతా అలజడి చుట్టూ ఉన్నవారంతా పోగయ్యారు ఘోరం చూస్తున్నారు తాత వెంకతమ్మా తమ్ములు బాపును ఇట్లోంచి బయటకు గెంతి వేశారు అమ్మ ఎదుటు నన్ను ఎత్తుకుని సీనన్నాను రెక్కపట్టుకుని శాశ్వతంగా ఆ రాక్షసుల కబంధ హస్తాల్లోంచి బయట పడ్డాం !
పాండవ వన వాసంలో శకుని మాయా ధ్యుతంలో ఒడి కట్టు బట్టలతో నగరం నుండి వెళ్లి పోయే సంఘటన లా తోచింది
అదే వీధిలో వేప చెట్టుని ఆనుకుని ఒక చిన్న పెకుటిల్లు ఉంది అందులో చిన్నమ్మ ఉంది ఆమె సీతయ్య పంతులు భార్య ఆమె ముసలమ్మే తన కండ్ల ముందు తమ వారసుడు పడే బాధ తను ఇలా కళ్ళారా చుసేడుకేనా తను ఇంకా బతికి ఉన్నది అని ఏడ్చింది పెద్ద పంతులును దుషించిది నలుగురి ముందు అమ్మా బాపు మమ్ములను లతన ఇంటిలోకి తీసు కెళ్ళింది ఇదంతా ప్రత్యక్ష సాక్షులుగా ఆ ఊరి వారు చూడడం తప్ప ఆ దుర్మార్గులకు ఎదురు మాట్లాడే ధైర్యం లేక మా స్తితికి వగచి వెళ్లి పోయారు అదే బాపుకు అనారోగ్యానికి మొదలు -మనో వేదనతో మానసికంగా పడి మందిలో తలెత్తుకోలేక కుమిలీ పోయాడు ఎన్ని రోజులయానా బాపుతో మాట్లాడటానికి ఎవరూ రాలేదు బయట నుంచి ఇటు కనీసం చూడ కుండా వెళ్లి పోయే వారు కనీసం తోబుట్టువుల్లు మన్న్గమ్మ బుచ్చమ్మలు కూడా అన్నాను చూడ రాలేదు ఎంత కటినులో మనుషులు కాదు పాషాణాలు
రోజు రోజుఉకు బాపు స్తితి క్షీణించింది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...