మా కథ నడిపించడానికి -మా భారతంలో ధర్మరాజు బాపన్న -సీనన్న భీముడు -ఒకతే తేడ ! బాపన్నకు కోపం ఎక్కువ సీనన్నకు కోపమే రాదు లేదు -అంతే-! కుంతీ మాత కస్టాలు పడ్డది అమ్మ -అన్నీ పోయాయి -ధర్మం న్యాయం జయించాయి ! భారత యుద్ధం ప్రశాంతంగా జరిగింది -అక్కడ యుద్ధం లో పోయారు ప్రతి పక్షయోదులు -ఇక్కడ తర్వాత పోయారు -వెంకటేశ్వర్ రావు తాత ముందుగా పోయారు సివిల్ హాస్పిటల్ లో -పిదప వెంకటమ్మ నాయనమ్మ నాలుగేళ్ళ కు --ఆ తర్వాత భద్రా రావు -రామ్ నరసింహా రావు నారాయణ్ రావు రాఘవ రావు లు క్రమంగా నిష్కర మించారు --ఆస్తి తరిగి పోయింది -పంతాలు సమసి పొయ్యాయి -గ్రామంలో క్రమంగా పంతులు గార్ల పట్టు తగ్గి పోయింది ఎన్నో మార్పులు రాజకీయాలు -దొరలూ పట్వారీల చేతుల్లోంచి -జారి పోయింది -సర్పంచ్ గా దేశాయ్ గారు -వెంకట కిషన్ రావు -అతని కుమారుడు దామోదర్ రావు వరుసగా రాగంపేట రాజులుగా చలామణి అయ్యారు -వారు పొయ్యారు -షాహు కార్లు కరీం నగర్కు వలస వెళ్ళారు --పెద్ద మనుషులు మంచి చెడ్డా చెప్పే వ్యవస్థ లేదు ఈనాడు --ఆ రోజుల్లో పంతులు గారు -లేదా దొర గారు ఎంత చెపితే అంత -ఊరంతా హడల్ -తల వంచుకుని వెళ్ళే వాళ్ళు ఆనా...
మా కథ రాయ డానికి కారణం ఆ నలుగురు -అమ్మ -బాపు బాపన్న సీనన్న -వీరంతా కలిసిన భావాలే నేను -నాలో వీరు నిరంతరం కదలాడుతారు -వారి గురించి రాయడం నా జన్మకు చరితార్తం గా భావిస్తాను - మాబాపు ధర్మం -తల్లి దండ్రులను గౌరవించు -వారు ఎంత అన్యాయం చేసినా సరే - అమ్మ అనేది --ఎవరి తోడూ వాళ్లకు ఉండాలిరా అని -ఎన్ని ఉన్నా తోడూ లేని -నీడ లేని ఆధారం లేని బ్రతుకు శత్రువుకైనా రావద్దు -అని -మన వెంట వచ్చేది హరినామామే - అంది -మనం తిన్నదే మనకు మిగిలేది -అంటూ కడుపు నిండా తనే స్వయంగా తన చేతితో కలిపి తిని పించేది -నీవు తిన్నది లెక్కలకు రాదురా -మన వెంట వచ్చేది ఒకరికి మన చేతులతో పెట్టేదే ! వెంట వచ్చేది -ఇలా మాకు మా ముగ్గురికి మదటి గురువు దైవం మా అమ్మ - ! బాపన్న మాటల్లో చెప్పాలంటే ---అమ్మ పెంపకంలో మనం పెరిగాం -!ఆదిమున్డలం అయ్యాం-ఆ లం ----కొడుకులకు భయపడి -చేతగాని దద్దమ్మలం అయ్యాం -బాపు ఉంటె ఆది వేరే తీరుగా ఉండేది -తండ్రికోసం తండ్రి పోషణ కరువైన...