Skip to main content

పార్ట్-27

నేను బ్రతకాలని కాబోలు ---మా అమ్మ సీనన్న ఇపుడు బాపన్న తమ కు మిగిలిన ఆయుష్షును నాకు ధారవోసి వాళ్ళు తమ విలువైన జీవితాన్ని చాలించారు --నాకు బాపును గూర్చి విన్నదే కాని చూడలేదు కావున ఆ విన్నదే రాయగలను ఆది కొంత మాత్రమె మనెను ధారణా చేసి నాకు జ్ఞాపక మున్నంత వరకే --! కాని మా బాపన్న గురించి అలా కాదు అతడొక సజీవ సంచలన చిత్రం కాదు నిజమైన సాకార కళల రూపం --
అతని మాటలు ఇంకా నా చెవిలో గుంగురు మంతునే ఉంటాయి ---
వారీ ! నాకు ఎవరి నైనా ఒప్పించి మెప్పించడం చాట కాదురా ---వాడు విన్నా విన కున్నా గట్టిగ నాలుగు దులుపేయడం తప్ప --!
నీకు చిన్నప్పుడు లాగు కూడా లేకుండా ఉంటె కనపడ్డవు -- ఒక చిల్లి పైసా నీకు ఇచ్చిన --అపుడు నీటు ఎంత సంతోషం కలిగిందో --నాకు ఇంకా యాదికున్నదిరా --!
నా తమ్ముడు msc distinction తో పాసయ్యాడని మా పట్వారి సంఘంలో చెప్తుంటే నా కంటే వాళ్ళకే ఎక్కువ సంతోష పడ్డర్రా ---!
కొట్టంల మనం ఉండంగా--నిన్ను ఎద్దు కుమ్మ వచ్చింది --నేను అప్పుడే వచ్చిన నువ్వు ఏడుస్తున్నావ్ --భయపడుకుంట --ఇరికి వచ్చి నిన్ను ఎత్తుకుని దాన్ని కట్టేతోని -ఒక్కదెబ్బ కొట్టిన --నన్ను నువ్వు గట్టిగ కావలించుకుని దిగలే నీకు భయం జోచ్చింది --మరి కొట్టంల రాత్రి పంటే నువ్వు --పాములస్తాయని --నాదగ్గరనే పడుకునే తోనివి
----ఒకసారి ఎందుకో బాగా ధూం చేసినవ నాకు తిక్క కోపం వచ్చి --ఒక్క దెబ్బ గొట్టిన --తర్వాత అరె ! వట్టిగా గొట్టిన గదా --అనిపించి ఎత్తుకున్న ---ఆ లగాయతు మల్ల నీ మీద చెయ్యి వెయ లేదు--రా!
సీనాడు నా దగ్గరికి ఎక్కువ రాకపోవు --ఎక్కువ వాడు అమ్మ దగ్గరనే పండేది ! అప్పటినుంచి వాడు అమ్మ కుచి --నిముషం అమ్మను విడిచి పెట్టి ఒక్క క్షణం ఉండలేదు వాడు --చిన్నప్పటి నుండి అంతే ! నీయవ్వ --చదువైన విడిచి పెట్టుకున్నాడు గాని అమ్మను విడువలే
ఈ అమ్మ గంతేరా --పొలం పెళ్ళికి పెంపకం సీనన్ని ఇస్తే ఎట్లా ఉంటాదే అని మాట వరసకు అన్న --! గంతేరా --ఇగ లేచింది పెద్ద పులి తీరుగ --
నీ పెమ్పకాలు పాడుగాను --ఆ వెంకటయ్య పంతులు నా బోడిగా కోసిండు --తన కొడుకును ఈ ఉరికి పెమ్పకమని ఇచ్చి ---ఇగ చాలు పెంపకం లేదు గిమ్పకం లేదు --మాలల ఎవడన్న నా ఇంటికి వచ్చి ఆ భద్రిగాడు గాని రామిగాడు గాని -అంటె--- వాని మీద నూరు దోసిళ్ళ మన్ను బోస్ట --ఏమనుకున్నారో --!
గంట ప్రేమరా వాడంటే -- దాన్ని ఏడికాడికి గోస్తే సీనడే కన పడుతడు రా --- పక్కల పక్కల నవ్వడం కళ్ళ ముందు ఒక సినిమా రీలులా కదా లాడుతున్ తుంది --
ఇలాటివి ఎన్నో ! ఎన్నెన్నో --ఒకటా రెండా ! ఈ జీవతం సరి పోదు --
బాపన్న బ్రతుకు తాత పొయ్యే వరకు అడ కట్టేరలో పోక చెక్కలా ఉండేది --అటు తాతలకు చిన్నాయనలకు వాళ్ళే బద్ధ శత్రువులుగా ఎంచే అమ్మకు --మధ్య ఎటు చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నలిగి పోయాడనే చెప్పాలి --కన్న తల్లి కనక వారి మీది కోపం కసి తన నిస్సహాయతను అమ్మ మీద చూపేవాడు --నలుగు రోజులు కలిసి ఉంటె వారు వీరౌతారని --తన బాల్యం నుండి తాత చిన్నాయనల లాలన పాలనలో పెరిగాడు --కాబట్టి బాపన్నకు వాళ్ళ గుణాలే ఎక్కువగా ఒంట బట్టాయి --
నిరాడంబరత --దొడ్డు బట్టా --ఇస్త్రీ లేని పాత అంగీలు --పాత దోతీలు ఏదో తింటే చాలు అనిపించే ముక్త సరి తిండి -తనమీద కాని తన కోసం గాని విలువైనది ఏది ఉంచుకోని--ఎవరిని కోరని మనస్తత్వం ఏర్పడింది --!
కాని ఎ అలవాటైనా --దురలవాటు కాకుండా ఉంటె బావుంటుంది --తాత శ్రీ వెంకటేశ్వరరావు గారు తన మనవాడి నెట్టి మీద తన రెండు చేతులు పెట్టుతూ --తానూ తాగే బీడీ లను తన తర్వాత కూడా తన మనవడు తాగేంత ఏర్పాటు చేసి వెళ్ళాడు --ఎంత దుర్భర పరిస్తితుల నైన ఎదురొడ్డి గెలిచినా బాపన్న ఈ బీడీ అనే జాడ్యాన్ని దూరం చేసుకోలేక పోయాడు రామయ్య అన్నయ్య పంతుళ్ళు బాపు గాదు బీడీ తాగితే ఏమైతది --ఏమి గాదు మేము తాగుతలేమా --! అరేయ్ -బాపన్నా --ఇగోరా గణేష్ బీడిల కట్ట -- దిక్కు మాలన గంట బీడిలు రుచి లేవు --పాచి లేవు --గణేష్ బీడీ చిన్నగా ఉంటది భలే కంమ్మగా మంచిగా గమ్మత్తుగా ఉంటది --ఇగ దర కూడా తక్కువే చారాన ! గుండా రాములు దుకాన్ల మత్తుగా దొరుకుతాయి --!
అన్నయ్య బాపు బాపన్నకు గురువు తానూ తాగుతూ బాపంనతో తాగించేవాడు --బీడీలు బడల్లు ఇవ్వడం బాధలు తీసుకోవడం వారిద్దరి మధ్య బాగా నడిచేది --మొత్తానికి ఆది చాలా ఒంట బట్టింది అన్నం తినకున్నా పరవా లేదు కాని --బీడీ కాల్చకుండా --ఆది దగ్గర లేకుండా ఒక్క క్షణ మైనా ఉండే వాడు కాదు --! ధర్మ రాజు ధర్మ మూర్తి అజాత శత్రువు -సత్య వాది అలుగుటయే ఎరున్గనివాడు-- ఒక్క జూదం తో చెడ్డ పేరు తెచ్చు కున్నట్టుగా --మా బాపన్నకు అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లయ్యింది
--అమ్మ ఎన్నో సార్లు అన్నది --ప్రాధేయ పడ్డది ---కడుపులో తల పెట్టింది --ఓట్లు పెట్టుకున్నది --నా మీద ఒట్టే -అన్నది --బాపూ వద్దురా బీడీలు బంజేయి రా నా మాట వినురా --బంగారమంటి శేరీరం --దిక్కు మాలల బీడీల వాసన కంపుతోని -పాడు చేసు కోకురా -ఇది బందు పెట్టి ఇంకేదన్నా అలవాటు చేసుకో ఇది తప్ప --!
శివుని ఆజ్ఞా లేనిది చీమైనా కుట్టదట --అలానే స్వరుపకు పెళ్లి ఐ --బిడ్డ పుట్టి --దానికి మాటలు వచ్చి -తాత బీడీలు మాన్పించాలని దానికి బుద్ది పుట్టి --
ఏయ్ --! బాపూ రావు --! బీడీలు బందు చేస్తావా --లేదా ! అని గద్దించే వరకు మా బాపన్న ధూమ పానం చేస్తూనే ఉన్నాడు --దేనికైనా సమయం రావాలి --ఆది !
అప్పుడు వచ్చింది కాని చాలా చాలా ఆలస్యంగా వచ్చింది --ఈ శుభా తరుణం ఒక పదేళ్ళ ముందే వచ్చి ఉంటె ఎంత బావుండేదో --! మా బాపన్న ఇంకా నిండు నూరేళ్ళు బ్రతికేవాడు --ముని మనుమలను కూడా చూసే వాడు - మాకు గురు తుల్యుడై దీవించే వాడు -ఇంకా రాగంపెటతో అనుబంధం గట్టిగా ఏర్పడేది --మా అందరికి అండగా ఉండీ --వెన్ను దట్టి ప్రోత్స హించి --ఎప్పుడు గల గలా నవ్వుతు నవ్విస్తూ --చిన్న వారిలో చిన్నగా పెద్ద వారిలో పెద్దగా --మమ్మల్ని అందరిని ఆదరించి అనునయించే ఆహాయ హస్తం --వెన్నంటి ఉండేది కదా !
గారాల తిట్లు దూరాలు అయినాయి ఎన్నో ఉహలు ఉసులూ--గాలిలో కలిసి పోయాయి --అలా ఆత్మీయంగా కోపగించి దగ్గరకు తీసే --ఆ వైభ్హవం ఏది ? ఎక్కడ / మళ్లీ వస్తుందా ? లంగ గాడిది! అన్ని నఖరాలే -- బడ బడ ఒర్రుతాడు పోతాడు --- వానికి తెలువది -ఓడు చెప్తే వినడు --! దయరా నిన్ను కాదురా బుద్ది తక్కువై అన్నరా--! ఇంకా ఇంకా ఉండే గాధ ! మా బాపన్న బాధ -!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...