బాపన్న మమ్మల్ని చూడటానికి వచ్చాదనీ చెప్పాను ! బండి ఎడ్లు లేకుండా తోడూ మనిషి రాకుండా ఆ రోజుల్లో అలా ఒంటరిగా రావడం చాలా సాహసం సుమా ! ఆది ఎలా వచ్చాడంటే గంగ ప్రవాహం ఈది దాటి వచ్చాడు రాత్రి కోటి లింగాలలో పడుకున్నాడట ! తెల్లారి ఓడ మీద కొంత దూరం దాటి తర్వాత ఈడు కుంటూ ఈవలి ఒడ్డుకు చేరాడట ! ఇదంతా నాకు బాపన్న ఒకసారి చెప్పాడు ! నువ్వు అలిగితే నీకు చిల్లి పైసా ఇచ్చిన ! ఇక నీ ఏడుపు కోపం పోయింది --నీకు జ్ఞాపకం లేదు వారీ ! అని నవ్వుతు జోక్ చేసేవాడు !--ఆటను లక్షేట్టిపెటలో ఉన్నపుడు మామాలతో కలిసి ఆడుకున్న ఆటల్లో ఈత నేర్చుకోడం అతనికి ఈ విధంగా లాభించిది కదా !
ఆపాటికే మూడు వంతుల భూములను అమ్మేశారు భద్రయ్య & party బాపన్నను ఆయుధంగా వాడుకుని --ఇక్కడి ఎడ్లు నాగళ్ళు ధాన్యం అంతా ఆర్నకొండకు తరలించారు చాటుగా నేటుగా !
అమ్మ బాపన్న సీనన్న ఉన్నపుడు మా కథ రాసి ఉంటె సజీవంగా ఉండేది ! కథలో ప్రాణం బలం జీవం ఉండేది ! కాని ఇలాంటి పరిస్తితి వస్తుందని అకస్మాత్తుగా మిన్ను విరిగి మీద పడుతుందని నేను ఉహించలేదు --ఎవ్వరం కూడా కలలో నయానా అనుకోలేదు !
బాపన్న తో కలిసి ఇదంతా రాద్దామనుకున్నాను కాని ఎందుకో నా మనస్సు ఎంత -- అమ్మ సీనన్నల పేరెత్తితేనే దుఃఖం పొంగుకోచ్చేది ! ఎం చేయను ఇప్పటికి ఆ గుణం పోలేదు --ఈ గుణాన్ని భగవంతుని గుణ గాణానికి ఉపయోగించమని అతన్ని వేడు కొంటున్నాను
మన రేవెల్లి వంశజులు జగిత్యాలలో ఉన్నారు ---మన హేమన్న సడ్డకుడు -- చిరంజీవరావు మరి అతని అన్న మారుతి రావు ( అమెరికా రాజన్న మామ --గంగ తండ్రి )
అతని తమ్మునితో కలిసి ముగ్గురు అన్న దమ్ములు మన రేవెల్లి వంశస్తులే !వాళ్ళే నాకు చెప్పారు మనం ఆంద్ర ప్రాంతం రేపల్లె వాళ్ళ మని తాతలు వలస వచ్చారని
నేను headmaster గా పని చేసిన పర్లపల్లీ గ్రామం దగ్గరే పొలం పల్లి --మల్లాపురం అనే రెండు గ్రామాలు మా తాతలవి అక్కడివాళ్లు వారు నిజానికి వారు 3 అన్నదమ్ములు
1 చల్లూరు రంగా రావు 2 రామా రావు 3 వెంకటేశ్వేర్రావు
ఈ వెంకటేశ్వేర్రవును ఆర్నకొండ కు పెంపకం ఇచ్చారు అయన అన్నలు --అర్నకొండలో గిరిజాబాయమ్మ అనే ఆమెకు వారసులు లేక పొతే ఇతను ఇక్కడికి పెంపకం అంటే ఆస్తికి వారసునిగా వచ్చాడు
అయితే ఆ రంగా రావుకు ఒక కూతురు ఉంది రామారావుకు సంతానం అసలే లేదు
అప్పుడు తమ్ముని అంటే ఇదే వెంకటేశ్వేర్రావు 3 వ కొడుకు వీర భాద్దేర్ రావును రామ రావుకు పెంపకం తెచ్చుకున్నాడు రామా రావు పొలం పల్లి గ్రామానికి వతందారు గొప్ప భూ స్వామీ అయన అప్పుడు !
ఇక్కడ తన పెద్ద కొడుకును లక్ష్మి నరసింహారావును రాగం పేటకు పెంపకం ఇచ్చి ఈ గ్రామ ఆస్తులు వతన్లు చే జిక్కించు కున్నాడు మన వాడు వీర వెంకతెతెశ్వేర్రావు .
ఇంకా వుంది
ఇంకా వుంది
Comments