Skip to main content

పార్ట్-20

మా అమ్మ లాటి అమ్మ లేదు ఈ జగం లో ! అని పృథ్వీ లోని ప్రతి ప్రాణి అను కుంటుంది --అదే అమ్మ గొప్పదనం ౧ శాస్త్రాల్లో పురాణాల్లో ఆమెకే పెద్ద పీట--అమ్మ దనంలోని లలోని కమ్మ దనాన్ని అను భ వించడానికి సాక్షాత్తు దేవ దేవునికే కోరిక కలిగి గర్భా నరకం 9 నెలలు ---కౌసల్యా దేవకీ తల్లులకు ఆ ఆనందం కలిగించడానికి తను పుత్రుడిగా జన్మించి తల్లి పాలు గ్రోలుతూ ఇటు యశోదా తనయుడిగా అటు దెవకీ నందనుడిగా ప్రసిద్ది పొందాడు మాత్రు వాత్సల్య మేమిటో స్వయం గా చవి చూచాడు ఆ పరమాత్ముడు
తన బిడ్డల కోసం సర్వస్వాన్ని ధార పోసే త్యాగ గుణం ఈ జగత్తులో అమ్మ కు తప్ప మరెవ్వరికి కాన రాదు --మాత్రు దేవో భవ---తర్వాతనే పితృ దేవో భవ ---!ఆ భగవంతుడు తనకు బదులుగా అమ్మను సృజించా డెమో ఈ ప్రాణి కోటికి !
దైవత్వం మానవుడిలో తల్లి రూపంలో ఉంది అనడానికి ఆమె త్యాగ గుణమే అమ్మ మూలా ధనం !
మా అమ్మ తన భర్త పోయినా బ్రతికి ఉందంటే కేవలం మా కోసమే ! లేక పొతే తను ఎ నుయ్యో గొయ్యో చూసుకునేది ఈ దుర్భర మైన రోగాలు కస్టాలు అవమానాలు పరుల పంచన సిగ్గుతో తల వంచుకొని జీవచ్చ వంలా బ్రతుకు ఈద్వడం ---చేసేది కాదు --మా అమ్మ నే కాదు --ఎ అమ్మ కూడా ఇలాగే తన బిడ్డలకోసం ఎ త్యాగాన్ని అయినా చేస్తుంది ఎంత ఇబ్బంది నైన భరిస్తుంది
అమ్మ గురించి చెప్పాలంటే నాకే కాదు ఎవరికైనా మాటలు చాలవు పాటలు సరి పోవు చేతలు పనికి రావు ---ఆ కృష్ణుడే అన్నాడు --రేపల్లెలో ఉన్న ౧౪ సంవత్స రాలు తల్లి దండ్రుల సేవ కు నేను నోచుకోలేదు ---నేనెంత దుర ద్రుష్ట వంతున్ని ! అన్నాడట ---తల్లి సేవకు తన బ్రతుకంతా సేవించినా ఈ జన్మ సరిపోదు కదా ! అన్నాడట ----తన తలి దన్ద్రూ లైన దేవకీ వసు దేవు లను కంసుని చేర నున్నది విడి పించిన ఉత్తర క్షణంలో అన్న మాటలవి
---తన కడుపు కట్టుకుని తన పిల్లల పొట్ట నింపడం --మనిషి కే కాదు --పులి నక్క ఆవు కోతి కాకి --ఇలా అన్ని ప్రాణుల్లో తల్లి స్వభావం ఆమె సహజ మైన ప్రేమ గుణం --ఇమిడ్చాడు ఆ జగ దీశ్వ రుడు
అందుకే అంతటి త్యాగాముర్తికి కొడుకులు కూతుళ్ళు ఏమిచ్చి తీర్చు కుంటే ఆ మాత్రు ఋణం తీరు తుంది -అమ్మా ! నీకు నమస్కారం --! అంజలి ఘటించి మోకరిల్లడం తప్ప ౧
మేము గుజరాత్ యాత్ర చేసిన సందర్భం లో చివరికి మాత్రు గయ వెళ్లాం --! పితృ గయలో తండ్రికి పిండ ప్రదానం కేవం కొడుకులే చేస్తారు --కాని ఇక్కడ విశేషం ఏమిటంటే కుమార్తెలు కూడా కుమారుల లాగానే తన తల్లికి తర్పణం విడవ వచ్చు పిండ ప్రదానం చేయ వచ్చు తనను కడుపార కన్న తల్లి ఋణం తీర్చుకొన వచ్చును --ఆ క్షేత్రం తల్లి గొప్పదనాన్ని చెబుతోంది -
-------------చాలా ఘోరమైన తపస్సు చేసి మహా విష్ణువును తమకు కొడుకుగా పుట్టాలని ఆ రకంగా తనకు ఆ మహాద్ భాగ్యం అనుగ్రహించమని శ్రీ మన్నారాయనున్ని వేడు కొందట ఆమె ! ఆమె కుమారుడిగా ౯ నెలలు మాత్రు గర్భంలో ఉంది ఆమెకు కొడుకుగా పుట్టి ఆమెను ధన్యురాలిగా చేశాడు -- అందుకు ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది అవి ఆమె పేరున బిందు సరో వరం గా ప్రసిద్ది గాంచింది -అక్కడే పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞా పాటించి తల్లి రేణుకా దేవి తల నరుకుతాడు . తండ్రి ని ప్రార్తించి ఈ పాపానికి ప్రాయచ్చిత్తంగా వేల ఏండ్లు తప మాచ రించి తిరిగి తల్లిని బ్రతికించు కుంటాడు తల్లి పోయాక ఇక్కడే తల్లికి చక్కగా పిండ ప్రదానం చేస్తాడు
ఇలాంటి పురాణ గాఢ లెన్నో ఉన్నా తల్లి ప్రేమ మహిమ ను సూచించే విధంగా ఇక్కడ పండితులు విధి విధానాలను చక్కగా చేయిస్తారు --- ఐశ్వర్యం పదవి బంధు వులు ఆస్తులు మణులు మాణిక్యాలు అపారమైన సంపదా భవనాలు కోట్ల ధనం ---ఇలా మనిషికి కావాల్సినవి ఎన్ని ఉన్నా --
--
------ అందరికి ఇల వేలుపు అమ్మ ఒక్కతే----
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు --ఆ తల్లి ఋణం తీర్చుకున్న బ్రతుకే బ్రతుకు !అమ్మ !
అమ్మ అన్నది ఒక కమ్మని మాట ఆది ---ఎన్నెన్నో తెలియని మమతల మూట
అమ్మంటే అంతులేని సొమ్మురా -- ఆది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా ---అమ్మ ఒడిలోనే స్వ్వర్గమే ఉందిరా ---ఉందిరా ! అమ్మ !
దేవుడే లేదను మనిషున్నాడు ---అమ్మే లేదను వాడు అసలే లేడు
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది--? --- అమ్మ అనురాగం ఇక నుండి నీది నాది ! అమ్మ !
ఈ పాట అమృత మయం-- అమరం అనురాగం ఉట్టిపడే అమ్మ పాట ఏదైనా ఆనంద కరం
అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరునికి లాలి పాట పాడుతాడు --- జో అచ్యుతానంద జో జో ముకుందా !
రారా పరమానంద రామ గోవిందా !జో జో జో-----
అంగజుని గన్న మా అన్న ఇటు రారా --బంగారు గిన్నెలో పాలు పోసేరా ------
దొంగ నీవని సతులు పోగు చున్నారా ---ముంగిట నాడరా మోహనా కారా ! జో ! జో !
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి --కావరమ్ము న నున్న కంసు బడ గొట్టి ---
నీవు మధురా పురము నెల చేపట్టి ---ఠీవి తో నేలినా దేవకీ పట్టి ! జో ! జో !
అంగుగా తాళ్ళ పా కన్నయ్య చాలా ---శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ -- మంగళము తిరుమల మదన గోపాలా ! జో !జో జో !

అన్ని బంధాలకు అతీత మైంది ఈ అమ్మ బంధం కడుపు తీపి ---కడుపు తెంచుకుని పుట్టడం కన్న ప్రేవు కన్న కడుపు
తల్లి ఋణం ---మా అమ్మ అన్న మాటలు నా చెవుల్లో ఎప్పటికీ ధ్వనిస్తూనే ఉంటాయి ---
నా ఆయుష్షు కూడా పోసుకుని నీవు నిండు నూరేళ్ళు బ్రత కాలిరా ---! నీది పునర్జన్మ రా --
అంతు నా చాటి పై గుప్పెడు కొబ్బరి నూనె పోసి కొంచెం అమరు తాంజనం వేసి ఆది ఇంకే వరకు నెమ్మదిగా రాస్తూ తన ఒడిలో నన్ను తన తోడ పై నా తల నుంచి ---ఆపదామప హర్తారం -- దాతారం సర్వ సంపదం
లోకా భి రామం --శ్రీ రామం --భూయో భూయో --నమా మ్యహం --ఇలా ఎంత సేపు రాసేదో --
అమ్మా ౧ నీకు చేయి నోస్త లేదా ౧ ---అంటే వారీ ---నీదు పునర్జన్మరా ! ఆ దేవుని దయ వల్ల మళ్లీ బతికావు
-------అంది---!-అమ్మ ౧మల్లి అదే అమ్మ కడుపులోనే కొడుకుకుగా పుట్టాలని అనిపిస్తోంది
దయ కారుణ్యం అనురాగం మూర్తీ భావించిన ప్రేమ మూర్తి అమ్మ ---!
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా ---ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ --ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
తను వేయి తేళ్ళు కుడితే ఎంత బాధ నో పురిటి నొప్పుల్లో అంత బాధ పడుతుంది ఒక బిడ్డకు జన్మ ఇవ్వడానికి ---తనకు పునర్జన్మ అవుతుంది ----ఆది అందుకే దానిని ప్రసూతి వైరాగ్యం అంటారు
ఇదీ ప్రతి అమ్మ కథ ---మా అమ్మ కథ లో కూడా ఇది అంతర్ భాగమే

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...