Skip to main content

పార్ట్-28

చిత్రంగా మా కథ ఇక్కడ మలుపు తిరిగింది --ఉహించని తీర్పు తాత గారు ఇచ్చారు -అందరు ఆశ్చర్య పోయారు కొట్టంలో కొచ్చి రెండేళ్లయ్యాక--
మమ్మల్ని ఉల్లోకోచ్చి ఉండమని --కొట్టంలో ఉంటె అతనికి అవమానంగా ఉందని - తిండి పోత లేదని నిద్ర పడత లేదని --! బాపంనతో ఒక రోజు అన్నాడట --అయితే ఈ మార్పుకు మాటలకు చాలా కారణా లున్నాయి
1 రామచందర్ రావు గారి దయ వల్ల పట్టినంత పంటా ఇంటినిండా --వడ్లు కందులు పెసల్లు జొన్నలు మక్కలు ప్రతి పంటా పండి -గుమ్ములన్ని ధాన్యంతో నిండి పోయాయి పంటలు -పుష్కలంగా పండాయి వర్షాలు సమృద్దిగా కురిశాయి --దేనికి కొరత లేదు --- పాలేర్లు పశువులు నాగళ్ళు -పని మనుషులు ఉళ్ళో నుంచి రైతులు షావుకార్లు ఇక్కడికి రావడం అమ్మ పేరు ఉళ్ళో మంచిగా వినపడటం --దానికి తగట్టుగా -అమ్మ అందరికి అనునయంగా మాట్లాడటం --ఏర్కల వాళ్లకు బట్టా బాతా అన్నం పలహారాలు ఇస్తుండటం బ్రాహ్మలకు పండగలకు పబ్బాలకు పిలవడం పూజలు దానాలు చేసుకున్తున్డటం -- ఇవన్ని వెంకటమ్మ వేంకటేశ్వర రావు లా చెవుల విన పడుతున్నాయి ఆది సహించ లేక పోతున్నారు వారు --తమ చెప్పు చేతిలో బండ కింది కప్పలా --అణగి మణగి ఉన్న పెద్ద కోడలు తమ కళ్ళ ముందే తమకు పోటిగా రాజ్య మేలడం ఓర్వలేక పోతున్నారు
2 బెస్త పోశి చేసిన దుశ్చర్య ఆనోటా ఈ నోటా అందరి చెవిన పడింది -ముసలోడు ఇంత దారుణం చేయిన్చిండా ? రేపు ఇంతకన్నా తెగిస్తాడు తన కళ్ళ ముందు పచ్చగా ఉండుడు చూసి -కళ్ళళ్ళ నిప్పులు పోసు కుంటున్నాడు -రాసేదేమో శ్రీరామ కోటి --చేసేదేమో రావణ పనులు ----! అనుకోడం వాళ్లకి వినపడింది
అమ్మ మీద ఈగ వాలినా పెద్ద మామ ఉర్కోడని --వారికి తెలుసు --మునుపటి పెద మామ కాదు --ఇప్పుడు అరి వీర భయంకరుడు --అన్నీ విధాల అన్ని ran గాల్లో ఆరితేరి పోయాడు అయన
మాకు చొప్పదండి లో చదువుకు కష్ట మైతున్నాడని అమ్మ చెప్పి పంపితే ఒక కచ్చరం ఎడ్లు పంపించాడు అప్పటికప్పుడు
ఆది కష్టంగా ఉందంటే ఒక సైకిల్ కొని పంపాడు
ఇలా పిట్ట కాలితో చెపితే చాలు రెక్కలు కట్టుకుని వాల్టాడని -వారికి తెలుసు -- ఇప్పుడు అమ్మ బలం బాపన్న బలం వల్ల ఊరివారి సహకారం వల్ల సానుభూతి ఇంకా పెరిగి పోతుండటం వల్ల --అసూయా ఇంకా పెరిగి పోతోంది
నిజంగానే ఒకవేళ అమ్మకుగాని మాకుగాని పామో తేలో ఏదైనా ఎలుగు వల్లనో - ప్రమాదం జరిగితే ఆది ఆ నేరం ఆ పాపం తమకు చుట్టుకుంటుందని --ఆది ఉల్లోవాళ్ళకు--కోపాన్ని తమ పట్ల అసహ్యాన్ని కలిగించి వారు చీత్కారిస్తారని అనుకున్నారు
3 కొట్టంలో దూరం గా ఉంటె వాళ్లకి మా సమాచారం వెంటాడి వెంట తెలియడం కష్టంగా ఉంటోంది --ఇదే దగ్గరగా ఉంటె చాలా సులువుగా తెలిసి పోతుంది తిన్నది తాగింది
4 ఇది తమ దయా గుణంగా తమ కు మంచి పేరును తెస్తుంది కూడా -- ఆహా ! పెద్ద పంతులు --ఎంత మంచి వాడు -! దిక్కు లేని వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నాడు --అన్న ప్రజా సానుభూతి లభిస్తుంది --
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు -- వాస్తవంగానే ఆయన ప్లాన్ విజయ వంట మైంది ఆయన అనుకున్నట్లుగానే మాకే తెలియకుండా అయన పన్నిన వలలో మాకు తెలియ కుండానే పడి పోయాం --ఉల్లోకి పోవడానికి బాపంనచేత శ్రీకారం చుట్టించాడు పెద్దాయన చిన్నాయనలంతా కలిసి - ముహూర్తం స్తల సేకరణ --ఇంటి నిర్మాణానికి ఏయే భూములు అమ్మాలో ఎవరికీ అమ్మాలో ఎంత వస్తుందో -- ఇలా అన్ని జరిగి పోతున్నాయి
5 అన్నింటికన్నా చాలా ముఖ్య మైన దురాలోచన --రామ చందర్ రావు ఆధిపత్యాన్ని వాళ్ళు సహించ లేక పోతున్నారు అతన్ని తొలగిస్తే బాపన్న ఒంటరి వాడి గా మిగిలి పోతాడు తమ చేతి కిందికి వస్తాడు -- క్రికెట్ ఆటలో బలమైన వికెట్ సచిన్ టెండూల్కర్ ను పడగొడితే చాలు విజయం మన స్వంత మౌతుంది
వాళ్లకు అంతా కలిసి వచ్చింది వస్తోంది కూడా - అమ్మ అనుకున్నట్లుగానే పులి నోట్లో తల పెట్టి నట్లు అయింది మా పని --అదీ వాళ్ళల ఇంటికి దగ్గర కట్టుకోడం మేము చేసిన పెద్ద తప్పు --ఆది తర్వాత మాకు ముప్పుగా పరిణ మించింది --
అమ్మ ఎం చేయాలి ? బాపన్న ఎం చేయాలి ? ఎన్నాళ్ళు ఇలా ఉరవతల వాళ్లకు భయ పడుకుంటు బ్రతకాలి ?

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...