Skip to main content

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు --
ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇలా ఇంటి ఆకారం మార్చాడు -- ఒక బిల్డింగు కు అయ్యేంత ఖర్చు అయ్యింది ఈ ఇంటికి --!ఇరవై నాలుగు ఇంచుల గోడలు --౧౨ ఫీట్ల ఎత్తు ఆరు గజాల లోటు పునాదులు - రాత్రిం బవల్లు పని -వేరే ఎ పని లేకుండా ఇదొక్కటే పనిగా బాపన్న దీక్షగా కంకణం కట్టుకుని మరీ కట్టించాడు అయితే నీడకు ప్రక్కన హాయిగా చూస్తూ కూర్చోకుండా తాను స్వయంగా శ్రమించే వాడు పారా గడ్డపార తట్టా --ఇలా ఏదో ఒకటి అతని చేతిలో ఆడుతుండటం---నాకు ఇంకా లీలగా జ్ఞాపకం --ఎందుకంటే ఆ ఏడాది పొడవునా బడికి ఎగ్గోత్తో అప్పుడప్పుడు మాత్రమే చొప్పదందికి పోతూ --ఎక్కువగా బాపన్నను అంటి పెట్టుకునే ఉండే వాణ్ని --నేను చాలా చిన్న కనుక నన్ను బాపన్న కాని మరెవ్వరైనా గార్వం చేసే వారె గాని బెదిరించడం అడిరించడం భయ పెట్టడం నన్ను ఎవరూ చేసే వారు కారు--పైగా నేను ప్రతి దినం ఉదయం అన్నం కొట్టంలో తిని అమ్మ ఇచ్చిన ఛాయా --అన్నం పప్పు శాకం ఇవన్ని మూట కట్టి -సంచిలో వేసుకుని జాగ్రత్తగా ఉల్లోకి ఎవర్నీ తగులకుండా తెచ్చి బాపన్నకు ఇచ్చే వాణ్ని --ఇల్లు నిర్మాణంలో ఉండగా ఇపుడు ఉన్న బావికి ఉత్తర దిక్కున ఒక చిన్న ఇల్లు ఒకే అర్ర గలది ఉండేది -దానిలో ఒక గుడు తట్టా పార వగైరా సామానులు ఉండేవి --అందులోనే ఒక నులక మంచం ఒక మంచి నీళ్ళ కుండ గ్లాసు చేద్దరు జంబుఖానా ఒక దుడ్డు -- పంచె దోతి--ఇలా బాపన్నకు అవసరమున్న ప్రతి ఒక్కటి ఆ చిన్న రూమ్లో ఉండేది ---కాని ఆ అర్ర చల్లగా ఉంది హాయిగా అనిపించేది --బాపన్న టీ వేడి చేసుకుని తాగే వాడు నాకు కొంత పోసేవాడు --
మధ్యాహ్నం పని వాళ్ళు ఎండా పుట పని మానేసి ఇంటికి తిండికి పొతే --అప్పుడు బాపన్న బావినీల్లతో కాళ్ళు మొహం కడిగి --తిని పడుకునే వాడు నాకు నిద్ర పట్టేది కాదు ఆడుకునే వాణ్ని ఒక్కన్నే అదే అర్రలో --!
మాకు ఒక ఆపత్ర మిత్రుడు ఉన్నాడు అతడే ---రాజి కుక్క ! ఆది కూడా మాతో బాటే తింటూ --ఎగురుతూ అక్కడే పడుకుంటు మేము ముగ్గురం ఆ అర్ర లో కలిసి మెలిసి ఉండే వాళ్ళం -ఆది మాకు చక్కగా కావాలి కాసేది --ఎవరు వచ్చినా అదిరి పోయేలా మొరిగేది - తను చూసిన వాల్లోస్తే మటుకు --ఏమి అనకుండా దగ్గరకు వెళ్లి విశ్వాసంగా నాకుతూ ఉండేది --ఆది ఎవ్వరిని కరవడంగాని గాయం చేయడం కాని ఇంత వరకు ఆది చేయలేదు - బాపన్నకు చాలా సన్నిహితంగా ఉండేది ఆ రాజి కుక్క --ఆది చిన్న పిల్ల గా ఉండగానే ఆది తల్లి దగ్గర పుట్టిన తత్క్షణమే --బాపన్న దాని పై మొజి పడ్డాడు దాని శరీరం కారు చీకటి వలె నల్లగా ఉండి--- దాని నొసటి పై తెల్లగా సన్నగా --ఎవరో పెట్టినట్లుగా బొల్లి నామం ఉండేది --దాంతో ఆది భలే ఆకర్షణగా కనబడేది -- బాపన్న తను తినే తిండి లో --పప్పు శాకం అన్నం --అన్నింటినీ దానికి పంచేవాడు --దానిని కుక్కలా అతడు ఎప్పుడు చూడ లేదు దాన్ని ఒక మనిషిగా ఒక మంచి స్నేహితుడిగా ఆత్మీయుడిగా చూశాడు --రాజి అని దానికి పేరు పెట్టింది బాపన్ననే --మరి ! ఎ పూర్వ జన్మ రుణాను బంధమో ఆది కూడా బాపన్నను చూస్తే చాలు తను దగ్గరికి వచ్చేసి మీద పడుతూ కుంయ్ మంటూ గారాలు పోతూ-- గమ్మత్తుగా మెలికలు తిరుగుతూ -నమ్మకంగా ఉండేది --
నాకు ఇంకా గుర్తు అటుగా పగటి వేళ మా అర్ర లోకి ఒక పాము వచ్చింది బహుశా గదిలో చల్లగా పడుకో వదానికేనేమో --! రాజి కుక్క ఒక్కసారిగా భౌ --భౌ మనేసరికి ఆది వెళ్లి పోయింది వెనక్కి ---!
అక్కడే గుమాస్తా లక్ష్మీరాజం మాలి పటేలు రాం నరసింహ రెడ్డి పొలిసు పటేల్ మాధవ రెడ్డి ఇంకా రైతులు ఎంత మందో వచ్చిన --రాజి కుక్క చిత్రంగా చూతు కూర్చుండేది --బాపన్న దగ్గరనే --౧ఇలా దాని అనుబంధం మాతో ముఖ్యంగా బాపంనతో పదేళ్ళు సాగింది --ఆఖరికి దీని ఆకారం తేజస్సు గంభీరం నమ్మకం -చూసి ఎవరో --ఆరవ లేక మందు పెట్టి చంపారు --ఆది బాధతో మూల్గుతూ --బాపన్న వద్దకు వచ్చి బాపన్న వొడిలో పడుకుని అతన్నే చూస్తూ కళ్ళు మూయడం బాపన్నకు మాకు మా అమ్మకు సీనన్నకు కళ్ళకు నీళ్ళు తెప్పించాయి ఎటు చూసినా ఎటు పోయినా అదే కన బడేది --కళ్ళల్లో కలలో దాని దీనమైన చూపు తోచేది -- బాపన్నైతే వారం రోజులు అన్నం సరిగ్గా తిన లేదు
అబ్బ ! ఆది యాడికి వస్తే -- చ్చ ! వశ పడదిరా ! ----ఒక దగ్గరి బందువు --పోయి నట్టు అనిపిస్తున్నదిరా --౧ అని బాధ పడుతూ వాపోయే వాడు --!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...