ఆ రోజు రానే వచ్చింది --తారక్కను అత్త వారింటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాడు ---భర్త లేకుండా - భారంగా ఇద్దరు చిన్న పిల్లలను వెంట బెట్టుకుని శోక దేవత లా కంటికి మంటికి ధారగా ఏడుస్తూ --వెడుతుంటే అందరు దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు --కన్న తల్లి మా అమ్మమ్మ సుర్యబాయి --పెద్దత్త సావిత్రి అత్త సాంబన్న మామ దుర్గత్త చిన్న మామ సులోచన అత్త ఇద్దరు చిన్నాయిలు ఇంకా చాలా జనం ఆవేదనతో మా అమ్మను మమ్ములను అంటే సీనన్న నన్ను ---సాంబన్న మామను తోడూ ఇచ్చి సాగనంపుతున్నారు లక్షెట్టి పేట నుండి రాగం పేటకు
అపుడు మధ్యాహ్నం ౨ గంటలు కావస్తుంది ఎడ్ల బండిలో మేము బండి వెనుక శోక మూర్తులుగా మారిన పెద మామ తది తరులు ఊరి చివర వరకు వచ్చి వెనక్కివెళ్లి పోయారు ---గంగ దాటుతుంటే మా బాపును అగ్ని సంస్కారం చేసిన గంగ ఒడ్డున ఆ ప్రదేశాన్ని చూసి గుండె పగిలి పోయేలా ఏడవ సాగింది ---
నిన్ను ఇక్కడ విడిచి నీవు లేని నీ ఉర్కి ఎలా వెళ్ళాను -- ! సాంబ శివా ! నేను కూడా ఈ గంగ లో దూకి చేస్తా ఆయనతో బాటే నన్ను ఇక్కడ కాలేసేయ్యి ! నా పిల్లలను నీ చేతులో పెడు తున్నా -- నా నించి కాదురా ౧ బావ లేని ఆ కొంపకు నేను పోలేనురా ! ఇంత విషం తాగి నా పిల్లలకు నాకు ఇక్కడే చచ్చి పోతాం కాని మళ్లీ ఆ రాక్షసుల లంక లో అడుగు పెట్ట డం ఎలారా ?---
మా అమ్మ దుఖానికి అవధి లేదు అంతు లేదు ! సాగి పోతోంది ---మా సీనన్న నేను బాపును కాలేసిన చోటు --మూగగా రోదిస్తూ చూస్తూ --ఏడుస్తున్న అమ్మ తో బాటు మేము ఏడుస్తూ ఉంది పోయాం నాకు ఇప్పటికి ఆ చోటు నాకు జ్ఞాపకం వస్తు ఉంటుంది గంగా స్నానానికి వెళ్తే ఆ హృదయ విదారక మైన దృశ్యం కళ్ళ ముందు !
అయితే ఈ ప్రయాణం ఇలా అప్పటికి అప్పుడు తయారు కావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి ---బాపన్న ఒకసారి ఇక్కడికి రావడం అమ్మను తీసికేల్తానని అనడం నేను ఇక్కడ ఉండ లేనురా ! అని అమ్మ విల పించడం ఒక్క బాపన్నను నమ్మ కుండా పెద మామ రామ చందర్ రావు ను పిలి పించడం --ఆయన మాకు పెద మామక అమ్మకు ధైర్యం చెప్పడం --జరిగాయి
మీకు ఎందుకు భయం ? నేను ఉండగా ఎవ్వరు ఏమి చేయ లేరు ! మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతాను ! నా పిల్లల మీద ప్రమాణం చేసి చెపు తున్నా ! ఈ అమ్మ మీకు ఎట్లా తోబుట్టువో అదే విధంగా నాకు గూడా చెల్లె అనుకోండి ఈ అమ్మ ఈ పిల్లలు నా భాద్యత ౧ పెద పంతులు గాని వాళ్ళ కొడుకులు గాని -- నేనుండగా ఏమి చెయ్యలేరు ఈగ వాళ నివ్వను !మీ ఉప్పు తింటున్న మీ కోసం ఏదైనా చేస్తా ! ఈ బాపయ్య పంతులును కూడా ఎవ్వరు ఏమన కుండ నా జిమ్మేదారు ! సరేనా ఎల్లుండి మంచి రోజు అంటున్నారు గదా ౧ మల్లా పురం స్టేజి కాడికి నేను ఇద్దరు మనుషులతో --బండి ఎడ్లతో వస్తాను అక్కడే బస్సు కోసం చూస్తా ఎ రాత్రైనా సరే మీరు రండ్రి ఆ బస్సు కు ! అని చెప్పాడు
అలా దాట వేసే మాటలు చాలా మంది మాట్లాడుతారు ! కాని ఆ మాట పై నిలబదరు --
కాని రామ చందేర్రావు అలా కాదు --ఆ క్షణం నుండి మమ్మల్ని కంటికి రెప్ప వలె కా పాడాడు ! నిజమైన స్వామీ భక్తి అంటే అతనిదే ! అతని అండ తోనే మా అమ్మ ఆ లంకలోకి రా గలిగింది ౧ ఒక్క బక్క బాపన్న --ఇంకా చిన్నతనం పోనీ వయస్సులో మమ్మల్ని నిభాయించే శక్తి లేదు --అన్యదా శరణం నాస్తి --త్వమేవ శరణం మమ --! అని కేవలం ఆ లక్ష్మి నర సింహ స్వామిని సంపూర్ణం గా నమ్మి -----మా బాపును తలచు కుంటూ --దైవం మీద భారం వేసి ర్రాక్షసుల వలయంలో --అడుగు పెట్ట సాహ సించింది అమ్మ
మా బాపుకు ఆరాధ్య దైవం శ్రీ సీత రామా చంద్రుడు ! అయన ఎంతో ఇష్టంతో కొని తెచ్చిన చాలా పెద వర్ణ చిత్రాలు తాత ఇంటిల్లో వరండాలో ఎదురుగా గోడకి పైన అమర్చాడు
1 భగవద్ గీత --శ్రీ కృష్ణుడు అర్జునుని కి గీత బోధిస్తున్న కమ్మ నీయ చిత్రం విషాద వదనంతో పాండవ మధ్యముడు బాణాలు కింద పద వైచి రథ చక్రం ఇరుసు పై వంగి ఎడం చేతిలో గడువ నుంచి విచారంగా పరం దామున్ని చూస్తున్న
వైనం ఆది మోకాళ్ళ పై వంగి --- ! నిజంగా అలాంటి చిత్రం నాకు ఎక్కడ కనపడలేదు ఆది కాక పాత చిత్రాలు ---ఆ అందమే ఆనందం
2 రామ పట్టాభిషేకం సీత రామ చంద్రుడు లక్ష్మణుడు నిలబడి ఉన్న్తారు వెనుక సింహాసనం --ఇవి చాలా ఉన్నాయి కానీ ఇంత పెద్దది ఎక్కడా లేదు --మా తండ్రి అభిరుచి - ఆ చూపుల్లో ఎంతగా ఆ రామయ్య కొలువై ఉన్నాడో ---లేకపోటీ ఆయన ఆనందరామాయణం రాయడం -- కాదు ! ఆ తండ్రి మా తండ్రిచే రాయించడం --అయ్యాన పై పాటలు కీర్తనలు పాడించడం ---తొక్కుడు హార్మొనీ --అంటే కింద కాళ్ళతో తొక్కుతుంటే పైన సుత్తి పెట్టి ---తన రెండు చేతులతో వాయిస్తుంటే రాముడేందుకు దిగి రాడు !

Comments