రాగంపేట కు వెళ్ళే ముందు ముగ్గురు ముఖ్య మైన వ్యక్తుల పరిచయం చాలా అవసరం
1 అమరవాది రామ చందర్ రావు చిట్యాల పల్లి
2 బొమ్మారెడ్డిపల్లి వెంగయ్య పటేలు
3 కాస లక్ష్మి రాజం రాగంపేట
అందరికంటే ప్రథముడు మనకు పూజ్యుడు విశ్వాస పాత్రుడు వెలమ దొర --శ్రీ రామా చందర్ రావు గారు అతనికి మనం మన జీవితాంతం రుణ పడి ఉంటాము శ్రీ రామునికి ఆంజనేయుడు ఎలా నమ్మిన బంటో అలా మనకి బాపన్నకి ముఖ్యంగా అమ్మకు అంత ఆత్మా బందువు అయ్యాడు -- మా బాపు తను పోతూ మాకు ఇచ్చిన వరం రక్షక కవచం ఆయన
పుట్టడం వెలమ పుట్టుకే అయినా మనకు మాత్రం చాలా దగ్గరి వాడయ్యాడు ---ఒక తోబుట్టువు కంటే ఎక్కువగా మా అమ్మ కు ఆప్యాయంగా చూశాడు --అమ్మా బాపు మేము లక్షెట్టి పేటకు పోయే సమయంలో మా బాపు ఈయనను రామచందేర్రావు ను వ్యవసాయం కొరకు సేర్ దారుగా నియమించాడు --బాపు గతించినా ఆయన బాపుకు ఇచ్చిన మాట తప్పకుండ మొత్తం జాయిదాడును కాపాడాడు పంటలను చిన్నాయనల బారి నుండి రక్షించి కొట్టంలో పెద్ద పెద్ద గుమ్ములలో నిలువ బెట్టాడు మన అదృష్టమా ఆయన రెక్కల కష్టం మనకు బాకీ ఉంది మనకు బాపన్న ఎదిగే వరకు అంటే పెళ్లి అయ్యేవరకు బాడీ గార్డు లా ఉన్నాడు ఉళ్ళో ఇల్లు కట్టి ఉళ్ళో కొచ్చే వరకు మనకు మన ఆస్తికి కాపలాదారుగా ఉన్నాడు ఆయన --మేము చేతులెత్తి నమస్కరించే వ్యక్తీ రామ చందర్ రావు
వెంగయ్య పటేలు ---ఈయనను చిన్న పిల్లలు చూస్తే ఉచ్చ పోసుకునేంత భీకరం గా ఉండేవాడు చేతిలో ఎప్పుడు అటు ఇటు తిప్పుతూ తుపాకి ---ముతినిండా బుర్ర మీసాలు ౬ అడుగుల ఎత్తు మాంచి ధృడ కాయుడు కంచు కంఠం తాండ్ర పాపా రాయుడులా అగుపించేవాడు ఆయన అతన్ని మాకు మనకి అంగ రక్షకుడుగా పెట్టాడు మా బాపు .బాపు ప్రాణానికి తన ప్రాణం ఫణంగా పెట్టి రాత్రి పగలు ఆయనను కాపాడాడు ఈ పటేలు
లక్ష్మి రాజం -- రాగం పేటకు గుమాస్తాగా ఉన్నాడు పహనీలు రాయడం తాసీలు జమ సుంకర్లను రైతులను భూమి కొలతలను పైసల పట్టి తయారు ఇలా తోడ్పడే వాడు బాపన్నకు

Comments