Skip to main content

పార్ట్-34

మాకు కొట్టం లోకి రావడానికి ముందు చాలా భయమేసింది నిజంగా అక్కడ ఎంత కష్టమో --ఎంత ఇబ్బంది పెడతారో ఈ పాళీ వాళ్ళు అని- కాని బాపన్న రామ చందర్ రావుల నీడలో మేము కడుపు నిండా తిన్నాము కాంతి నిండా నిద్ర పోయాము అతని అభయ హస్తం నిజంగా మాకు శ్రీ రామ రక్షా ! మేము చాలా సంతోషంగా ఉన్నాం అంతవరకూ పడ్డ కస్టాలు మరిచాం - అమ్మ తన ఇస్తా దైవాన్ని మాత్రం మరచి పోలేదు పైగా రెట్టింపు కాసాగింది--అక్కడ ఒక తులసి గద్దె చక్కగా ముగ్గులు పూజ పునస్కారాలు -ఉపవాసాలు బ్రాహ్మల సత్కారం పండుగల్లు ----ఇలా పేరుకు కొట్టం కాని మేమ్ము అలా ఎన్నడు అనుకోలేదు --చాలా ఆనందంగా గడిపాం --ఊరి బయట స్వేచ్చగా స్వతంత్రంగా హాయిగా ఉన్నాం --మాకు అంటే నాకు సీనన్నకు చేనులు చేలకలు పేర్లు పొలాలు మనవి ఎక్కడనో ఏవో తెలిసి పోయింది -
--కొత్తంలోంచి ఉల్లోకి పోవడం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు
1 అక్కడే తను భర్తతో ఇంటి నుండి బయటకు తరిమి వెయ బడింది
౨ తెల్లారితే ఎవరో ఒకరు మరదులు ఈ ఇంటికి వస్తారు తినేద్ది తాగేది చూస్తారు వెటకారం మాటలు అంటారు వారికి ఎదురు చెప్పే వారు లేరు
3 బాపూ పోయాక ఉరివారికి తన మొహం చూప దలచు కోలేదు బాద ఆవేదన పాట జ్ఞాపకాలు తరిమాయి
4 ప్రతి దానిలో వారి జోక్యం ఉంటుంది వారి ముందు బాపన్న అస్వతంత్రుడు
5 తను ఇంటి బయటకి రాలేదు--స్వేచ్చగా ఉండ లేదు తిరగలేదు --ఒక నిర్బందంలో జైలులో ఉన్నట్లు ఉంటుంది
6 తోడి కోడళ్ళు రాక ప్పోకలు
7 మేము వారింటికి పోవడం రావడం తప్పదు--
8 వారిఇంట్లో తినడం తాగడం మాటలు -రాక పోకలు మన ఇంటి విషయాలు వారికి తెలిసి పోవడం
----దగ్గర ఉంటె ఆది శత్రువుల్లకు --- తనకంటే బలమైన వారి వద్దకు పోవడం పుల్లి నోట్లో తల దుర్చడమే ! నీటిక్కి దగ్గర -- చుట్టాలకు దూరం ఉండడం మంచిది
మా ఆయువు పట్టు తెలుసుకుందామని ముసలాయన పన్నిన పన్నాగం అని అమ్మకు తెలుసు - అయినా ఒప్పుకుంది -అయిష్టంగానే --
మా కథ అడ్డం తిరిగింది ఇక్కడే ఈ నిర్న్నయంతోనే ఈ మలుపులోనే ---మాకు కుడి భుజం పడి పోయింది తాత పన్నిన వలలో పడి పోయాం అమ్మ ఉహించిన పై అనుమానాలన్నీ నిజమైనాయి మేము ఒక విష వపయంలో చిక్కి పోయాం మా స్వతంత్రం హరించింది -! చాటుగా మాటుగా హాయిగా ఉన్న మేము డేగ కళ్ళల్లో ఇక తప్పించుకో లేని నిస్సహాయ స్తితిలో తపించాము --
ఇల్లు నిర్మాణం భవంతి గోడలపై మ్మాములు పెంకుటిల్లు వెలిసింది మట్టి గోడలపై సిమెంటు పూత లేకుండా ! తాత వాళ్ళ ఇంటి వెనక పెరడులో ! వాళ్ళు తమ బంగాళా ఎక్కి చూస్తే మన ఇంట్లో ఎం జరిగేది కన పడేలా ! ఒక గోడ అయినా అడ్డం లేకుండా అటు ముందు వైపునుండి ఎటు venukka వైపు నుండి అంటే పరదా గోడ కూడా చాటు లేకుండా ఉంది ! వాళ్ళు వెనకాల నుండి మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అన్న మాట -
అమ్మ ఒక షరతు పెట్టింది వాళ్ళ ఇంటికి మన ఇంటికి రాక పోకలు లేకుండా ఒక మనిషి కూడా కన పడకుండా ఉండేలా ఒకా పెద్ద బల్ల మైన గోడ పెడితేనే తను ఉళ్ళో అడుగు పెడతాను ! అంతవరకూ కాలు పెట్టాను నేను వాళ్ళ మొహం చూడ దలచు కోలేదు అని ఖచ్చితంగా నీర్మొహ మాటంగా బాపన్నకు చెప్పింది అమ్మ
ఈ విషయం తాత వాళ్లకు చెప్పాడు ఆటను --వారికి తెలియంది ఇటు పుల్ల అటు పెట్టాడని అమ్మకు రామ చందర్ రావుకు తెల్లుసు --నిజంగానే బాప్పన్నాను వాళ్ళు క్కీలు బొమ్మ చేసి ఆడిస్తున్న మాట నిజమే ! వేరే గతి లేదు దఫ్తరం అంటే పహని కాగితాలు వాళ్ళ బంగళాలో ఉన్నాయి అవి వాళ్ళు బాపన్నకు ఇవ్వరు వారిని కాదని తను ఇంటికి తెచ్చుకోలేదు పులి పండ్ల మద్య నాలుకలా చిక్కాడు తను --మమ్మల్ని చిక్కించాడు
రామ చందర్ రావు అన్నాడు అమ్మతో మరియు బాపంనతో !
బాపూ రావు పంతులు ! ఆ పెద పంతులు మిమ్మల్ని ఉల్లోకి రంమ్మంతున్నది మీమీది ప్రేమ తోని కాదు నన్ను మీనుండి దూరం చేయడానికి అసలు సంగతి గడి ! ఇక్కడ కొట్టం లోకి వచ్చినంత అలకగా - మీరు ఉళ్ళ ఉంటె రాలేను ఎందుకంటే అక్కడ మీ చిన్నాయనలు ఆ తాత ఉంటారు ౧ నేను అన్నదానికి వాళ్ళు వ్యతిరేకం చెప్తారు --! దాన్ని బాప్పయ్య పంతులు కాదన లేదు --ఆది నాకు నచ్చదు--నాకు నచ్చని పని నేను చేయ లేను --నన్ను ఎవరన్న మాటంటే నేను పదను
మీరు వేరు నేను మీలో ఒకన్ని మీ ఉప్పు తింటున్న -- మీరు ఏదైనా మాటంటే నాకేం బాద లేదు --కాని వాళ్ళంటే మాత్రం మీరు పడతారేమో గాని నేను మాటా కాయను మాది వెలమ పుటుక! అవసరమైతే ప్రానాలిస్తం --ఎవరన్నా కాని పని చేస్తే వాని ప్రాణాలు తీస్తాం ---కాని మాట పడం !
----అయన అన్నంత పని అయింది అలాగే జరిగింది కూడా ఇంతవరకు దిన దినా భి వృద్ది జరిగిన ఉత్తర క్షణంలో --రామ చందర్ రావు గారు మాకు దూరం ఆయిన విష ఘడియ రాన్నే వచ్చింది -- పాము పాడగా నీడలో ఉన్న బాపన్న అననే అన్నాడు - ఇక నేను చూసుకుంటా---యవుసం --అని అనగానే ఆయన అన్నాడు ---
---చాలా సంతోషం పంతులు --ఇపుడు మీరు పెద్దోల్లయిండ్రు --! నాకు గూడా శాత గాకుండా అయింది --మునుపు ఏదో చేసిన --ఏదో రెక్కల కష్టం --కాని ఇక నానించి కాదు -ఇన్ని రాజోలు మీరన్న్తా మావోల్లని --అనుకున్న --అట్లనే చేసిన -నన్ను మీరు దూరం గొడుతున్నారు ----మీ సొమ్ము నాకు గిన్తనే బాకీ అనుకుంట --
నాకు గూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు --ఇంత భూమో జాగో పోలమో పంతో ఇగ మాకోసం మేం ---మా గోస మేం పడాలే-- ఎం జేస్తాం -ఈ చిన్న పంతులు కూడా కొంచెం పెద్దోదయ్యాక్ --నా సక్కి నేను చూసు కుందామనుకున్నా -! ---అంటూ అమ్మకు బాపన్నకు దండం పెట్టి నన్ను సీనన్నాను దగ్గరకు తీసుకుని -- చిన్న పంతులు నేను పోతున్న ---నన్ను కొంచెం జ్ఞాపకం పెట్టుకొండ్రి---! అంటూ కళ్ళల్లో నీరు కారుస్తూ అమ్మకు మళ్లీ ఒకసారి దండం పెట్టి --అమ్మా ! నేనిక పోయోస్తా ౧ అని మళ్లీ వెనుకకు తిరిగి చూడ కుండా వెళ్లి పోయాడు --మాకు రసీ రామ రక్షా --ఆయిన రామ చందర్ రావు గారు --
ఇది మేం ఉల్లోకి వచ్చిన నాలుగు నెలలలోపే --- జరిగింది
అడ్డగోడ వద్దన్నాడు తాత --తాత వద్దన్తున్నాడు అన్నాడు బాపన్న --అయితే నేను ఉల్లోకి రాను --నువ్వు తమ్ములు వెళ్లి ఉండండి అంది అమ్మ --బాపన్న కోపానికి వచ్చాడు అమ్మ భయపడలేదు -ఇలా 2 3 నెలలు గడిచ్చాయి --అమ్మ తన పట్టు విడువ లేదు --అడిదానికి ఇంత పట్టా ! ఎం చూసుకొని / అని ఏక సేక్కా లాడాడు భద్రయ్య ఇలా మొదలయ్యింది --ఆదిల్లోనే హంస పాదు ! అన్నట్లుగా ---అన్నీ ఎదరు దెబ్బలే --అడుగడుగునా వాళ్ళ సూటి పోటి మాటలే --౧మొగదు పోయి --ముండ మోసి --ఉరవతల --దిక్కు లేక పడి ఉంటె -ఏదో ఉండనిమ్మని ఇంత జాగా ఓ ఇల్లు ఆకారం చేస్తే ఇంత నీల్గుడా /--అని అనడం నేను విన్నాను -
చాలా బాద అనిపించింది --బాపన్నకు ఇవన్ని మామూలే నాకు ఆది ఆ మాటలు కొత్త - అమ్మ కు చెప్పాను ఏడ్చాను --అమ్మకు దుఃఖం కోపం వచ్చింది --దీనికి కారణ మైన బాపన్న తో మాట బందు పెట్టింది తిండి మానేసింది ---- అప్పుడు గాని అమ్మ మొండితనం మంకు పట్టు బాపన్నకు తెలిసి రాలేదు --
పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని --చిన్న బాపంనకేం తెలుసు తాత వాళ్ళు ఎంత రాక్షసులో --ఎంతగా అమ్మ పై పగ బూని --ఉన్నారో --ఇది ఇవ్వాళ్ళ మామ్మ్మల్ని ఎదిరించేంత ధైర్యం వచ్చిందా -! --- ఆ మాటల్లో ఎంత కక్ష్య ఉందొ --ఆ చూపుల్లో ఎంత ప్రతీకారం ఉందొ బాపన్నకు అనుభవంలో కాని తెలిసి రాలేదు కాని చాలా చాలా ఆలస్యంగా తెలిసింది ----అంతా అయ్యాక --!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...