Skip to main content

Posts

Showing posts from April, 2011

Part - 38

మా బాపన్న పెళ్లి నిరాడంబరంగా జరిగింది -తాత వాళ్ళ ఆధ్వర్యం కనుక పెద్ద మామ వాళ్ళు రాలేదు --సాంబన్న మామ ఒక్కడు వచ్చాడేమో -? అసలే వెలిచాల గోపాల్ రావు -చాలా పొడుపు మనిషి -ఈ ఒక్క విషయంలో మాత్రం అతనికి అతడే సాటి -పైగా ఆయనకు ఏడుగురు కూతుళ్ళు -అల్లా అని ఆయనేం ఆస్తి పాస్తులు ల్లేక పోలేదు -గరిష కుర్తి వెలిశాల -కలుపుకుని ఆయనంత శ్రీమంతుడు మన ఇళ్లల్లో ఎవరూ కనబడరు --ఈ పొదుపరి తనంతో -మంచి డాబు దర్పం ఠీవి -కన బరిఇచే వాడు. ఒకసారి బాపన్న -ఈ గోపాలరావు మామ -అనుకోకుండా కరీంనగర్ లోని గీతా భవన్ హోటల్ లో ఒకరికొకరు -ఎదురెదురుగా -కుర్చీల్లో తారస పడ్డారు -ఇక టీ -తిఫ్ఫిన్లకు ఆర్డర్ చేశారు -అంతా అయ్యాక ఎవరి బిల్లు వారు ఇచ్చేశారు -పిల్లను ఇచ్చిన మామ -అల్లుని బిల్లు అల్లునిచేతనే కట్టించాడు --ఎక్కడైనా అల్లుడే కాని --హోటల్లో మాత్రం కాదు --అంత గొప్పగా పొడుపు నియమాన్ని పాటించే వారు -మరెవరు ఉండక పోవచ్చు -ఒక్క మన గోపాల్ రావు మామ తప్ప -! నిజానికి -ఇది వాళ్ళు ఎవరైనా చదివితే అపార్దం చేసుకోవచ్చు --కాని ఇంత పేరు సంపాదించింది -వారు ఈ ఒక్క విషయంలో అని మాత్రం చెప్పవచ్చు --ఆయన ...

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...