Skip to main content

పార్ట్-35

దురదృష్టం ఏమంటే --నేను రాస్తున్న --మా కథ చదవడానికి - నాతోపాటు ఆనందం అనుభవం --కన్నీళ్లు కడగండ్లు -ఎన్నో రకాల తీపి చెడు సంఘటనలు భయంకర మైన దృశ్యాలు --వారి మాటలు చేతలు కృత్యాలు --ఇలా నాతొ పంచుకోడానికి -- మా కథ లో ముఖ్య పాత్ర దారులు ఇప్పుడు నాతొ లేరు ! --ఈ కథ ఎవరి కోసం?
పోయి నోల్లు అందరు మంచోళ్ళు ---!
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు--!
పాడుతా తీయగా చల్లగా --!
ఇలా నాలో నేనే నెమరేసుకునే తీయని జ్ఞాపకాలు మధుర స్మృతులు --ఎన్నటికి చెరగని ముద్రలు --అండ మైన అనురాగ భావాలు --ఆనాటి చేదు తలపులు --ఇవన్ని కలబోస్తే ఉగాది నాటి ఐదు రకాల పచ్చడి తిన్నట్లు గా ఉంటుందికదా --!నేటి భవిత పాత అనుభవాల పునాది పైనే కట్ట బడి ఉంటుంది సుమా --! చరిత్ర లేని వాడు --దానిని మరిచిన నాడు --మనిషి పుట్టుకకు అర్థం ఉండదేమో --!
మా అమ్మ --మా బాపన్న మా సీనన్న --ఇప్పుడు నాతొ లేరు భౌతికంగా --కాని నా మనసులో నేను ఉన్నన్నాళ్ళు నాతొ బాటు నాలో సజీవంగా ఉంటారు --ఎందుకంటే నేను అనబడే నా చరిత్రకు నా సౌఖ్యాలకు --నా ప్రగతికి --వాళ్ళ స్పూర్తి యె కారణం --వాళ్ళను మరచిన నాడు-- నేను ఉన్నా లేనట్లే సుమా ! వారి ఆయువును నాకు నాకోసం ధార పోసి వాళ్ళు నిష్క్రమించారు
నిజానికి వాళ్ళు నాకంటే చాలా శ్రమించారు - నాకంటే చాలా కష్ట పడ్డారు -- దెబ్బలు తిన్నారు -మాటలు అనరానివి --పడ్డారు! చేదు అనుభవాలు తాము దిగ మింగి - నాకు - మాకు --ఆనందం పంచారు ! ఆ ఆనందం ఆ నలుగురితోనే ఉంది నాతొ కలుపుకొని -- కాని నేను ఒక్కన్నే వారు లేకుండా ! ఇది ఏమి ఆనందం ? నా వాళ్ళు లేకుండా ---నా అనే వాళ్ళు లేకుండా ?
కష్టం వాళ్ళ వంతు ! ---సుఖం నా --మా వంతు ! అయ్యింది
వాళ్ళు ఉండగా ఈ కథ రాస్తే ఒక పండగ లా అనిపించేది - వాళ్ళతో ఈ గాధ - నా బాధ - ను పంచుకొంటే నా జన్మ ధన్యం అయ్యేది --నాకు చాలా తృప్తిగా ఉండేది -- !
అయినా వాళ్ళ ప్రతి రూపాలు ఉన్నాయిగా ! ఈ ఆనందం - ఆ అనుభవం పంచుకోడానికి! -- నాకు ఇది చాలు --!
ఇది మా ఆత్మ కథ దీనిని నేను రాయడంలో నాకు స్పూర్తిగా నిలచిన ఆ మువ్వురికి రుణ పడి ఉంటాను --దీని వల్ల వారి ఆత్మలు మనశ్శాంతి పొందుతాయని నేను భావిస్తాను
నాచే ఈ చిన్న ఆత్మ కథను రూపొందించడానికి ప్రేరణ ను కలి గించి - ఒక రూపాన్ని ఆపాదించిన ఆ దేవ దేవునికి శత కోటి ప్రణామాలు ! ఇది వారికే అంకితం! ఇది వారి స్వంతం కూడా --!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...