Skip to main content

Posts

Showing posts from May, 2011

Part - 39

చెప్పుడు మాటలు - అనుభవం లేని తనం -చిన్నాయనల ఆజమాయిషీ అటు వాళ్ళు ఇటు మేము - రెండు వైపులా చూసు కోడానికి బాపన్నకు వయసు చాలడం లేదు -పత్వారిగిరీ అంటే మాటలు కాదు -భద్రయ్య బాపుకు తెలవకుండా ఎ పనీ జరగదు - అప్పుడు ఆయన పెద్ద లీడర్ - పైరవీకారు -వతన్దారీ సంఘానికి ప్రెసి డెంటు -తహసీల్దారును డైరెక్ట్ గా కలిసి తన పైరవీ పనులు -ఇతర పటారీ లా పనులు చేసి మాట తోనే చేసి పెట్టేవాడు పట్వారీ లలో మాలీ పటేల్ లలో పోలీసు పటేల్లలో అందరు అతన్ని కలిసే వాళ్ళు ఇబ్బందులు చెప్పేవాళ్ళు -ఇలా అతనికి ఊరిలోనే కాదు జిల్లా లో మంచి పేరు సంపాదించాడు -పైరవీ చేయడంలో దిట్ట అనీ --హైదరా బాడు కెళ్ళి కూడా పనులు చేసుకోస్తాదన్న పేరు పొందాడు ఇంతపేరు బలము ఉన్న మనిషికి బాపన్న అణకువగా ఉండటం మామూలే కదా -! కాని ఆయన అండ చూసుకొని తాత మిగతా చిన్నాయనలు మా బాపు పేరు మీద ఉన్న 500 ఎకరాల ఆస్తి కౌలు దార్ల పేరు చేశాడు -కొంత అమ్మించాడు కొంత తమ పేరు మీద మార్చు కున్నాడు -ఇప్పుడు మాకున్న ఆస్తి కేవలం 5 ౦ ఎకరాలు మాత్రమె - ఒక సంఘటన మాత్రం పరమ దారుణం గా నా కళ్ళ ముందే జరిగింది - భద్రయ్య బా...