Skip to main content

పార్ట్ 15

శకుని ద్యూతం ఫలించింది ఒకే దెబ్బకు రెండు పిట్టలు 1 ద్రౌప్పడి పరాభవం 2 పాండవుల అరణ్య అజ్ఞాత వాసాలు
రావణ మాయ గెలిచింది 1 సీత ను లంకకు ఎత్తు కేల్లడం 2 రామున్ని కష్టాల పాలు చేయడం
అలాగే పెద్ద పంతులు దురాశ జయించింది -- ౧ -మా బాపు రాగం పేటలో స్తానికంగా లేక పోవడం శాశ్వతంగా తొలగి పోవడం
౨ ఆస్తి అంతా తన చేతి కిందికి రావడం ---మా బాపు బతికితే ఇది అంత సులభ మయ్యేదికాడు కదా! పైగా బాపు పోవడం అసల్దారు పేరు బాపన్న పేర కావడం వారికి రొట్టె విరిగి నేతిలో పద్దత్తైయ్యింది మేము రాగంపేటకు రావాలనుకునే సందర్భంలో పరిస్తితులు వారికి చాలా అనుకూలంగా మారాయి --
అందరికి ౫ గురు అన్నదమ్ములకు లగ్నాలు అయ్యాయి నారాయణ రావు కు 2 పెండ్లిళ్ళు అయినాయి పెళ్ళాలు చని పోయారు 3 వాడి పెండ్యాల శంకేర్రావు మరదలు ---రాఘవ రావుకు ఒక బిడ్డ ఉమా ఒక కొడుకు శంకర్ ---కాని శంకర్ కు కంతి పుట్టింది మెడ పై --ఆది కాన్సర్ గా పరిణ మించింది --ఖర్చుల కోసం డబ్బు లడిగితే తల్లి దండ్రి లేవన్నారు నా పాలు నా కివ్వమని రాగయ్య వారితో గొడవ పడ్డాడు ప్రాదేయ పడ్డాడు కాని వారి మనసు కరగ లేదు హైదరా బాద్ కు వెళ్లి వైద్యం చేయించుకోడానికి చాలా ఖర్చు కావాలి --ఎన్నో ఇబ్బందులు పడ్డారు కొడుకును దక్కించుకోవడం కోసం --ఆపరేషన్ కూడా చేయించారు కాని ఆది తగ్గటానికి బదులు ఇంకా రెచ్చింది
ఉన్న ఇంట్లోంచి బయటకొచ్చి వేరే కాపరం పెట్టాడు వేప చెట్టు వద్ద ఉన్న గూన ఇంటిలో --చాలా కస్టాలు పడ్డాడు కాని శంకర్ను దక్కించుకోలేక పోయాడు రుక్కమ్మ చిన్నాయి ఆ రోజునుండి అత్తా మామాలతో మాట్లాడటం మానేసింది
ఆమె అనేది తారక్క ఉసురు కొట్టింది అని --మా బాపు తమ్ముడు రాఘవులుతో అనే వాడట --రాఘవ్ ! నువ్వయానా నాతొ కలిసి
కలిసి ఉండరా -- అని ప్రాదేయ పడ్డాడట కాని అతడు వినలేదు రుక్కామ్మ చిన్నాయి ఎన్నో సార్లు అంది తారక్కను బాగా కోడరికం చే సింది వెంకటమ్మ ఆది మనిషి కాదు రాక్షసి ఆ మహా తల్లి ఎట్లా పుట్టిందో గాని దాని కడుపు నిండా విషమే ...అంటూ తన అక్కసు నంతా వెల్ల గక్కేది---! ఎ వదిన అయితే చిన్న తనంలో స్నానం పోసి అంగే లాగులు తొడిగి అన్నం కన్న తల్లిలా తినిపించిందో --ఆ వదినపైనే చేయి వేసి అమ్మ రెండు రెక్కలు పట్టి బయటకు ఈడ్చి వేశారు దుశ్శాసనుని తమ్ములు ఈ అన్నయ్య రాగయ్య నారాయణ రామయ్య భద్రయ్య లు అన్న ముందర ఆయన్ను కట్టి వేసి ! సిగ వెంట్రుకలు పట్టాడు నారాయణ --ఎంత ఘోర మైన దృశ్యం ఆది
ఈ నరకాన్నే ఊరంతా చూశారు ప్రక్కన ఉన్న బ్రాహ్మలు అయ్యో పాపం నోటిలో నాలుక లేని బ్రాహ్మడు లచ్చయ్య పంతులుకు ఎంత కష్టం వచ్చింది అని వాపోయారు అపర కీచకుల ముందు వీరేవ్వరు భయంతో నోరు మెదపక పోయారు
sv రంగా రావు డైలాగు జ్ఞాపకం వస్తోంది విరాటుని కొలువులో ద్రౌపదిని వెంటాడుతూ ఆ సభ లో ఇలా అంటాడు --నన్నేదిరించే వాడు ఈ సభలోనే కాదు ఎక్కడా లేడు--ఇక ఈ రాజా --నా చేతులో కీలు బొమ్మ ---!
మంగమ్మ పెండ్లి జరిగింది మొగుడు మోతే రామ్ కిషన్ రావు ---పెండ్లి అయినా సం వ్త్సరంలోపలనే స్వర్గస్తు దయ్యాడు హేమన్న కు తండ్రి తెలిదు ఎలా ఉంటాడో కూడా ఎరుగడు --మంగమ్మ అత్తవారింటిలో ఉంది 8 నెలలే మళ్ళీ ఇక మోతే లో అడుగు పర్ట్ట లేదు అత్త మొహంచూడ లేదు ఆమె ఇక్కడే తల్లి గారింతిలోనే శాశ్వతంగా ఉంది పోయింది ఆమె జాయిడాడు ఆస్తి అంతా ఆమె అత్త మొతెలో ఉంటూచూసుకునేది అయితే పెత్తనమంతా అక్కడ మళ్లీ వీళ్ళదే --పోతూ వాసు ఉండే వాళ్ళు అక్కడ బోలెడంత ఆస్తి బంగారం రత్తమ్మ హేమన్న నాయనమ్మ మొతెలో ఉంటూ మొత్తం ఆస్తి కాపాడింది ఒక్కటే ఆడది ఒంటరిగా ఆ ఊరిలో ఉంటూ కొడుకు పోయినా కోడలు రాకున్నా ---! ఐశ్వర్యం గల ది కనుక ఇక్కడ మంగమ్మకు సకల రాజ పుజితంగా గౌరవం గారాబం తనకి తన కొడుక్కి జరిపారు అందరికివారంటే పంచ ప్రాణాలు కనుక మన బాపన్నను హేమన్నకు తోడుగా ఉంచి హేమన్న ఆటకు అన్నిటికి కాపలాగా హేమన్న ఎటు పొతే అటు పంపుతూ బాపన్న పై లేని పోనీ గారాబం ఒలక బోస్తు రామయ్య భద్రయ్య మంగమ్మలు బాపన్నను మాయ మాటలతో తమ వేపు తిప్పుకున్నారు అతడిని పూర్తిగా మార్చేశారు --వారిని వడిచి ఎక్కడికి వెళ్ళే వాడు కాదు - వారే తమ ఆత్మీయులు అన్నంత దగ్గరయ్యాడు వాళ్లకు --మందు పెట్టారా అన్నంతగా మార్చారు అతన్ని --ఈ రకం గా బాపన్న బాపుకు చాలా దూరమయ్యాడు --
మెత్తగా తీయగా మాట్లాడటం మంగమ్మ బుచ్చమ్మ వెంకటమ్మ లకు వెన్న తో పెట్టిన విద్య--1 నయంగా నక్కజిత్తూ ఉపయోగిస్తూ వెనుక గోతులు తవ్వడం వారిసహజ స్వభావం
ఇక బుచ్చమ్మ కథ --ఈమే పెళ్లి కుదిర్చింది మా బాపే !

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...