Skip to main content

పార్ట్-25

ముళ్ళ బాటలో నీవు నడిచావు --పుల బాట లో మమ్ము నడిపావు --
ఓ నాన్నా ! నీ మనసే వెన్నా --అమృతం కన్నా --ఆది ఎంతో మిన్నా --ఓ నాన్నా----
పల్లెత్తు మాట కూడా అనరాని దుర్భాషలు --మా బావ భాషలో చెప్పాలంటే ఎక్కాలు దండకాలు ఇవేమీ బాపు తలి దండ్రులను కాని తమ్ములను కాని అన్నట్లు ఎవరూ చెప్పలేదు అమ్మ కూడా --ఆయన కెంత ఓపికో ఎన్ని తిట్లు తిట్టినా తల్లి అరచినా తండ్రి కోపించినా తమ్ములు నోటికొచ్చినట్లు అన్నా కిమ్మనకుండా ఉండే వాడట లేదా అక్కడ నుండి వెళ్ళే వాడట --
బాపు మంచంలో పడ్డాడు అంతే యుద్ధం సమాప్తి --అయింది --లేచి నిలబడే ఓపిక కూడా లేకున్దేంట నీరసం వచ్చిందట తాత వాళ్ళు చేడిది చేయించారని అంటారు - మనో వ్యాధికి మందు లేదని --ఆటను మరి కోలు కోలేదు దొరగారు వచ్చి చూసి ఇక్కడ ఉంటె లాభం లేదు పట్నంలో ఎవరైనా డాక్టర్కు చుయించాలి అన్నాడు రాం చందర్ రావునుడి బాపు మాట తీసుకున్నాడు తన స్తితి ఎలా ఉన్నా ఈ పిల్లాలు ఎదిగే వరకు తమను ఈ ఆస్తిని కాపాడాలని --- వెంగయ్య పటేలు బాపు బలం లేక పోవడంతో మునుపటిలా హుషారుగా లేడు ఎక్కడి వారక్కడనే విషాదంగా ఉన్నారు తోడుగా ఉన్న చిన్నమ్మ కూడా కన్ను మూసింది బాపు దుస్తితి చూసి ---ఈ విధంగా రేవెల్లి ధ్వజాలు ఒక్కటొక్కటిగా పడిపోఎసరికి బాపు అమ్మ కలవార పడ్డారు ఒకరిపై ఆధార పడే స్తితి దాపురించింది ---ఇలా ఆరు నెలల పైగా ఆ చిన్న ఇంటిలో తన వాళ్ళ ప్రక్కన మాటా చూపు లేకుండా వారి సానుభుతికైనా నోచుకోకుండా దుర్భర మానసిక వేదన అనుభ వించాడు బాపు --అధికారం ఆస్తి అందరు ఉందికూడా ఆవేదన పాలయ్యాడు
తన భార్య పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు తను పొతే వీరి గతేమిటి ?
అప్పుడే అక్కడి వైద్యుడు శివయ్య వచ్చి చెప్పాడు --పంతులు ఇక్కడ ఉంటె నువ్వు బతకవూ ఎటైనా వెళ్ళిపో ! నీకు చేడిది చేయించాడు మీ బాపు --?
అమ్మ అపుడు లక్షెట్టిపేట కుమనిషిని పంపించింది --హుటా హుతిని పెదమామ వచ్చాడు రడీగా --ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసు అన్నట్లుగా---
అంతే రాగంపేట తో బాపుకు రుణానుబంధం తెరిపోయింది అక్కడితో దురదృష్టం అతన్ని ఇంకా తరుమికోడుతోంది మరి
ఒకే ఒక మంచి పని బాపు చేత ఆ భగవంతుడు చేయించాడు ఆది కమలక్క పెండ్లి --సామరస్యంగా ఉన్నప్పుడే ఆ లగ్నం జరిగింది బాపే తానూ స్వయంగా బ్రాహ్మణ పల్లి వెళ్లి రత్నం బావను చూసి అతని తెలుపు telivi taragani ఆస్తి patwaari పని anni చూసి మెచ్చి --పెళ్లి చుపులుకుడా కానిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బాపు
తగి నంత కట్నం పెట్టుబోతలు లాంచనాలుదేనిలో రాజీ పద కుండ స లక్షణంగా అక్కా వివాహం జారి పించాడు బాపు
అప్పుడు అక్కా వయసు ఎనిమిది కూడా లేవు పదేళ్ళకే అత్తారింట్లో అడుగు పెట్టింది అప్పుడు మాత్రం ఈ లొల్లి మొదలైంది అక్కకు కట్టుకోడానికి దొడ్డు బట్ట కోసం బ్రాహ్మలు ఇచ్చారట -- వెంకటమ్మ తన అసలు రూపం తన తడాఖ చూపింది --అక్కా పై ఈ అల్లరి చాయలు కొద్దిగా పడ్డాయి దీనికి ప్రతిగా బాపుకు బాపన్నను దూరంచేశారు చిన్నాయనలు బాపు లేవ లేకుంటే బాపన్నను మాయ మాటలు చెప్పి అతన్ని మొతెకు పంపించే వారు వారు నెలల కొద్దీ అక్కడనే ఉంచేవారు -
వాటా వరణం చల్లబడింది ఇంత వరకు వేడిగా ఉండేది --బాపులేకున్నా ఆస్తి వ్యవసాయం కాపాడుతూ ఉన్నది రామ చందర్ రావు ఎల్లయ్యలు మాత్రమె ఎవరికీ భయపడకుండా చూశారు
నాకు తెలిసి మా బాపు చేత అయినా పెళ్ళిళ్ళు అక్కడి మంగమ్మడి బుచ్చంమది మరయు దుర్గత్త ది ---యలబాక నరసింగ రావు చెప్తుంటాడు మీ బాపు పూను కుంటేనే ఈ పెళ్లి అయిందని --సాంబన్న మమ యలబాకకు బాపుతో వెళ్లి పెళ్లి చూపులు చూశాడని పిల్లను అందరు మేచ్చారని అయతే ముహర్తం పెట్టుకునే సమయానికి నరహరి రావు తాత పోయారని ఇది మంచి శకునం కాదని -ఈ సంబంధం వద్దని పెదమామ అంతే బాపు నిలబడి ఒక సంవత్సరం లటు అయినా సరే ఇదే అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవాలని చెప్పాడట తనే ఈ వివాహం జరిపించాడని ---కాక అన్నాడు పెద మామకు మా బాపు అంటే ఆయన మాట అంటే అంత గురి విశ్వాసం ఉండేది ఆస్తిగురిచి చర్చ రానప్పుడు ఈ ఆరుగురు అన్న దమ్ములు చక్క్కగా కలిసి ఉండేవారట అమ్మకు ౮ ఏళ్లకే పెళ్ళైతే తనకంటే చిన్న అయినా మరదుల ఆలనా --పోషణ చుసేదట లొల్లి పుట్టక ముందు
బ్రాహ్మనపల్ల్య్లో కూడా ఇదే తరహా పోరాటం సాగింది కాని ఆది తల్లి కొడుకుల మధ్య ఆది అంతర్యుద్దమే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా --అని అదికూడా తీవ్రరూపం దాల్చింది అక్క్కడ కూడా కొడుకు రత్నం మీది కోపంతో రత్నం బావ తల్లి మధురమ్మ అక్కమీద కూడా కారాలు మిరియాలు నురేదట--రాజా జగన్నాథ రావు --బావ తండ్రి మహా చందా శాసనుదట -అతన్ని ఆ ఊరి వాళ్ళే పగ బట్టి ఒక రాత్రి చంపెశారట --తెల్లారేసరికి చచ్చి పడి ఉన్నాడు --అంతకు ముందే కొడుకు మీద ఉన్న కసి కక్ష్య కోపంతో --తన మొగుణ్ణి తన కొడుకే నిలబడి హత్య చేయించాడని నేరం ఆరోపించింది -నిజానికి అక్కా కాపురానికి కొత్తగా వెళ్తూనే గంటె పట్టాల్సి వచ్చింది మధురమ్మ అంతకు ముందే వేరు కాపరం పెట్టించింది తల్లి దండ్రి ఉళ్ళో స్వంత ఇంట్లో ఉంటె కొడుకు కోడలు ఊరి చివర కొట్టంలో కాపురం ఉన్నారు వివాదం అంత కంటకు ముదిరింది భర్త పోయిన ఆమె కొడుకుతో రాజీ పడలేదు --జాలిగామ జిద్దు --ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనేలా పెరిగింది -ఇది కూడా ఇతరులు కల్పించుకుని చెప్పేదికాడు --ఆది బిడ్డకు అదివరకే పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళడం భర్త మంచి వాడు కావడం --ఆమె సుకృతమే --అయితే అత్తకు తన సేవ గాని --తనకు ఆశీర్వచన కర్త అత్త గారి నీడన మంచిగా మెదిలే అవకాశం అక్కకు లేక పోయింది
బాపు లక్షెట్టిపేట కు అస్వస్త త తో చేరుకునే సమయానికి రాజన్న పుట్టలేదు

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...