Skip to main content

Part - 45


మా కథ రాయ డానికి కారణం  ఆ  నలుగురు -అమ్మ -బాపు  బాపన్న  సీనన్న -వీరంతా కలిసిన  భావాలే నేను -నాలో వీరు నిరంతరం కదలాడుతారు -వారి గురించి రాయడం  నా జన్మకు చరితార్తం గా  భావిస్తాను -
మాబాపు ధర్మం -తల్లి దండ్రులను గౌరవించు -వారు ఎంత అన్యాయం చేసినా సరే -
అమ్మ అనేది --ఎవరి తోడూ  వాళ్లకు  ఉండాలిరా  అని -ఎన్ని  ఉన్నా తోడూ లేని -నీడ లేని ఆధారం లేని బ్రతుకు శత్రువుకైనా  రావద్దు -అని -మన వెంట  వచ్చేది హరినామామే - అంది -మనం తిన్నదే  మనకు మిగిలేది -అంటూ కడుపు నిండా  తనే స్వయంగా  తన చేతితో కలిపి తిని పించేది -నీవు తిన్నది  లెక్కలకు  రాదురా -మన వెంట వచ్చేది ఒకరికి మన చేతులతో పెట్టేదే ! వెంట వచ్చేది -ఇలా మాకు మా ముగ్గురికి మదటి గురువు దైవం మా  అమ్మ - !
బాపన్న  మాటల్లో చెప్పాలంటే  ---అమ్మ పెంపకంలో మనం పెరిగాం -!ఆదిమున్డలం  అయ్యాం-ఆ  లం ----కొడుకులకు భయపడి -చేతగాని దద్దమ్మలం  అయ్యాం  -బాపు ఉంటె ఆది వేరే తీరుగా ఉండేది -తండ్రికోసం  తండ్రి పోషణ  కరువైన  మా ముగ్గురం అమ్మ ఉన్న  అనాధ లం -బాపన్న మా  ముగ్గురికి రక్షకుడు -తిండి -బట్టా ఆశ్రయం కల్పించి నేనున్నానని అభయం ధైర్యం  ఇచ్చిన దైవం -
సీనన్న -SIMPLE LIVING  HIGH THINKING _మీకు తృప్తి లేదు  కాని మాకు ఆది ఉంది కారం అన్నం తింటున్నా -ఉపవాసం ఉంటున్నా --అంత నిశ్చలం అంత  నిబ్బరం అతని మనసు  -ఎ కలతలకు చెక్కు చెదరని  ఆడారని బెదరని మనో ధైర్యం - అందుకే  ఈ  నలుగురు నాకు రాముడు  కృష్ణుడా -శంకరుడు -భవాని మాత -పంపిన ప్రత్యక్ష దైవాలు-
నా మనుగడకు మనో వికాసానికి వారే -మూలం -వారే  నా  ఆశయం -ఉపిరి కూడా - అందుకే వారంటే గౌరవం  ప్రాణం -మాకథలో వారే నాయకులు -నాయికలు -
అయితే వారు మానవులే -రాగద్వేషాలకు అతీతులెం కాదు -అసాధారణ ప్రజన కలవారేం కాదు -సామాన్యులు -దేవుఫు చేసిన  మట్టి బొమ్మలు -అందులో మనం మంచినే తీసు కుంటాం -అలాగే బాపన్న కు  ఉన్న  బలహీనత -బీడీ లు తాగడం అదే అతన్ని బలహీనున్ని చేసింది -కాలేయం తూట్లు పడ్డది -దగ్గు తో కడుపు నొప్పితో అడ్డమైన గోలీలు మింగి చాలా బాధ పడ్డాడు -చివరకు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు -అమ్మ మొత్తుకున్నది నా మీద ఒట్టే ! బాపు -!బీడీలు బందు చేయరా ! అని వినలేదు - రోజుకు డజన్ చొప్పున  -రాత్రి పగలు తాగే వాడు   --
అతనికి నాయకత్వ లక్షణాలు తక్కువ -గ్రూప్ తయారు చేయడం -పెత్తనం చేయడం -పేరు సంపాదిన్చుకోడం పట్ల ఆసక్తి లేదు -డబ్బుపై మక్కువతో -చేసిన  చాలా పనులు బెడిసి కొట్టాయి -అందుకే మంచి పేరు కంటే పని చేయడు--అన్న పేరుతొ రాణించలేక పోయాడు - కారణం తనకు వెనుక సప్పోర్ట్ ఎవరూ లేక పోవడమే -పిల్లనిచ్చిన మామ ఎన్నడు ఇటు తొక్కి చూడలేదు -ఎప్పుడు కూతురు అల్లుడు పిల్లలు వేలిచాలకు పోవడమే -ఇక మేనమామ లు రాకపోకలు తక్కువే- చిన్నాయనలు ఇతన్ని  ఎప్పుడు తీపి మాటలతో అణగ దోక్కేవారే -!  డానికి తోడుగా మాలీ పటేల్ రామ్ నరసింహా రెడ్డి -బాపన్నకు పక్కలో బల్లెం లా -ప్రతి పనిలో జోక్యం చేసుకుని -ఇరకాటంలో నే ట్టే వాడు - చిట్యాల పల్లి  సంజీవ రావు -భద్రయ్య పంతులు ఎలా చెపితే  అలా చేసే వాడు -కాని బాపన్న అసల్దార్ అయినా -ఖాద రు చేసే వాడు కాదు  -గ్రామం పెద్దది -పైగా నాలుగు ఉళ్ళ  వతన్ లు -రాగంపేట -చిత్యాలపల్లి  -రేవెల్లి బీరం రాజయ్య పల్లి -దేశాయ్ పేట -కుర్మా పల్లి - ఎప్పుడు తాసీల్ భూములు అమ్మి -లేదా అప్పు  తెచ్చి - కట్టడం చేసే వాడు -అతనికి పని తెలుసు రాయడం తెలుసు -ఎలా చేయాలో తెలుసు కాని చేయించడం మెప్పించడం -ఒప్పించడం --తప్పించుకోడం అంతగా  తెలీదు -అందుకే చివరన బద్నాం అయ్యాడు -ఉళ్ళో అడుగు పెట్టడానికి -పట్టు చిక్కలేదు -ఆకారం పొట్టిగా -బక్కగా ఉన్నా -ప్రజ్న  ఉన్నా దైవం సహక రించలేదు -పదవి విరమనవరకు పెద్దగా కూడా బెట్ట లేకున్నా -పిల్లలు అంత పెద్ద వాళ్ళు అయ్యారు -తండ్రి నుండి ఏమీ  ఆశించకుండా తమ కాళ్ళపై తాము నిలబడే స్వయం శక్తిని కూడా గట్టు కున్నారు -అదే అతని సంపద -శక్తి -సగర్వంగా చెప్పుకునే స్తాయి కి ఎదిగారు -మేము -బాపన్న చేసుకున్న పుణ్యం -గ్రామంలో మంచి పేరు తండ్రికి తెచ్చారు -ఇదే మా అపురూప సంపద -కోట్ల సంపాదన
నాగరాణి ముమ్మూర్తులా తండ్రి పోలికే అవడం  మా అదృష్టం -మా పూర్వజన్మ పుణ్యం -మాకు తండ్రికి తల్లికి -మంచి పేరు తెచ్చి పెట్టింది  అదే వినయ సంపద -మాట అనడం -మాట పోగొట్టు కొడం చేయని అమాయకం  సీనన్న కు తగిన కూతురు అనిపించు కున్నది -అందుకే సీనన్న బ్రతికి ఉండగా అతనికి చేయలేని సేవ సీనన్న బిడ్డకు చేసే -సంకల్పం కలిగింది -అందుకు ద్య్వాబలం అనుకూలించింది -పెళ్ళికి చేసిన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలించాయి -సీనన్న ఉన్నపుడు చేసిన విశ్వప్రయత్నాలు వ్యర్దం అయినాయి -కూతురి పెళ్లి చేసే భాగ్యం లేదేమో -కాని అతనికి రెండు కోరికలు -కూతురి పెళ్లి చేయడం -బాగా చదివించి జాబ్ చేయడం -
నేను సీనన్న మెచ్చిన సంబంధం -నాగరానికి నచ్చ లేదు -నాకు దూరంగా పారి పోయింది బలవంతాన మెడకు కదతాదేమో అని -తను  నో! చెబితే బాబాయికి గుండె నొప్పి రాదు కదా  అనుకుంది -కాబోలు ! అప్పుడు సీనన్న అన్న మాటలు నాకింకా జ్ఞాపకం -!నీకెందుకురా అంత బాధ -!కందకు లేని దురద కత్తి కెందుకురా ? పెళ్లి నాకు చెయ్యి అన్నప్పుడే చేద్దాం -డానికి లేని తొందర మనకెందుకు  చెప్పు ! అన్నాడు -బిడ్డ మీద అంత మమకారం ఆయనకు   !

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...