సీనన్న అనేవాడు -మీ అందరికన్నా మేము రాగంపేటలో తృప్తిగా ఉంటున్నాం తింటున్నాం మీకు ఆ హాయి తెలీదు -రాదు కూడా అని !ఏమున్నా లేకున్నా -అమ్మ తో బాటు సీనన్న కష్ట పడ్డారు అక్కడ అయినా వారు దేనికి వెలితి పడలేదు -ఇదీ కావాలని ఎవరిని అడగలేదు -ఎవరి ముందు చేయి చాచ లేదు -అదీ వారి గొప్ప ధనం -! సీనన్న పెళ్లి వరకు అటు బాపన్నకు అర డజను పిల్లలు ఇటు అక్కకు సంతానం - అర డజనే - కాని శ్యామల రాపల్లి నరసింహారావు తో వర నిశ్చయం అయ్యాక -అకస్మాతు గా పరమ పదించింది-
అయితే వీరి బాల్యం చిన్నతనం చదువులు - సెలవుల్లో రాగం పేట కు రావడం అమ్మ సీనన్న బాపన్న ఇద్దరు వదినలు -అప్పుడే నాకు రాగంపేటకు బదిలీ కావడం -అందరం ఒకే చోట ఉండటం - లచ్చి చేతుల మీదుగా ఈ పిల్లల స్నానాలు ఇంటి చాకిరి - వల్ల అమ్మకు చాలా శ్రమ కావడం -ఇదంతా చూసి నేను సీనన్న --గుమాస్తా కాస లక్ష్మిరాజమ్ కలిసి వేరు పడటానికి భూముల కొలత ప్రారంభం చేశాం -ఇదీ నేను బదిలీ అయ్యి రాగంపేట కు వచ్చిన నెల రోజులోనే జరిగింది -దానికీ కారణం చాలావున్నాయి
--పొత్తుల సంసారానికి ముఖ్యంగా అమ్మకు చాలా శ్రమ అయ్యేది -కాలి పండ్లతో వంటా -ఇటు పిల్లలకు అటు మడి వంటకు -ఇలా నానా యాతన పడేది ---బాపన్న వ్యవహారంలో ఇంటి విషయాలు పట్టించు కునే వాడు కాదు -ఇక సీనన్న శ్రమ పడటమే కాని ఉన్నది లేనిది చూసేంత శ్రద్ధ చూపడం లేదు -ఇందులో వచ్చే పోయే వారితో అమ్మకు చేతి క్రింద ఇద్దరు కోడళ్ళు వున్నా తీరికే లేకపోయేది -పైగా వ్యవసాయం లో అటు బాపన్న ఇటు సీనన్న తన అత్తగారిచ్చిన ఆరు తులాల బంగారం -పైగా నేను నా జీతం డబ్బులు -ఎన్ని చేసినా -పూత గడవడం కష్ట మయ్యేది ---సీనన్నకు బాపన్నకు పడేది కాదు -ఎప్పుడు వారి కి చిట పట -లాడుతూ ఉండే వారు బాపన్నకు పత్వారిగిరిలో తహసీల్ కట్టడం బహు కష్టంగా ఉండేది -మామిల్ల చెలక ఎకరం అప్పుడు అమ్మ చూపారు -నేను వద్దని ఆ డబ్బు ఎదురు కట్టి ఆది విడి పించాను -ఎ ఖర్చు లేదు కాని అన్నీ అప్పులే - ఇంకా రాయలేనివి -అనుభవించ లేనివి -చాలా కారణాలు - ఉన్న ఇంట్లోనే మగ్గురం ఉండటం --ఉన్న బాలలు గిన్నెలు కంచాలు అన్నీ మూడు పాళ్ళు చేశాం --ఎవరినీ అడుగలేదు - పిలవలేదు -అంతే-ఒక బస్తా బియ్యం తెప్పించి వేరు గా వండుకున్నం - ఆ రోజు నుండి ఎవరి ఖర్చులు వారివే - టిడీ తిప్పలు వారివే - భూములు అన్నింటినీ మూడు పాళ్ళు చేశాం -పంచడం లేదు -మంచిగానీ చెడైనా అంతా సమానమే -అమ్మకు మాత్రం ఇప్పుడున్న పొలం ఒక చేను -ఒక చేలకా వేరుగా ఉంచాం -వేరు అయితే పడ్డం కాని ఫలితం దక్క లేదు -అమ్మ కష్టం అలాగే ఉంది పోయింది -పెద్ద వదిన కు ఆరు కాన్పులు వెలిచాల లోనే జరిగాయి -దాదాపుగా ఎక్కువ శాతం అక్కడ పిల్లల కోసం ఉండ వలసి రావడం -చిన్న వదిన కు పెళ్ళైన ఇరవై ఏళ్లకు సంతానం కావడం -అంత వరకు ప్రతి పని -మాట అమ్మ చిన్న వదిన ల పై భారం పడింది -అక్కా పిల్లలు రాజన్న రామన్న శ్యామల కృష్ణా ప్రసాద్ జయ ప్రద శైలజ -ఇలా సెలవులలూను -రాగంపేట లో చదువుకోసం -అక్కా బావ యాత్రలకు పోవడానికి -ఇల్లా ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో -పాపలతో కళ కళ లాడుతూ ఉండేది --వేరు పడిన ముఖ్య ఉద్దేశం కూడా ఇదే -ఖర్చులకోసం ఎవరికీ భాద్యత లేక పోయినా పాపం అమ్మకు తప్పేది కాదు -అమ్మ పొలం వడ్లు చెలక పంటా అంతా అమ్మ అటు కమలక్క పిల్లల కోసం -ఇటు బాపన్న పిల్లల కు ఇటు సీనన్న కు -బ్రాహ్మలు ముత్తైద -పండుగలు పబ్బాలు -తన కాలి పుండు వైద్యానికి -స్వంతంగా ఖర్చు చేసే -స్తోమత అమ్మకు వచ్చింది -తనకంటూ కొంత డబ్బు -ఆదాయం ఏర్పాటుకే -నేను ఈ వేరు ఏర్పాటు చేశాను --ఇదీ చివరి ఘడియ వరకు అక్కరకు వచ్చింది -తన అంత్య క్రియలకు తన పేరున గల అరవై వేళ బ్యాంకు డబ్బుతో చక్కగా -ఎ కొడుకు మోతాదు లేకుండా ఒడ్డేక్కింది- దాని పెద్దరికం నిలిచింది -హుందాగా కాలం గడిపింది -నలుగురికి దానం చేసుకున్నది -సుందిళ్ళ లక్ష్మి నరసింహ స్వామికి మొక్కు మూడు తులాల బంగారం -అర్పించుకున్నది -అక్కా పిల్ల లకు -దీపావళి -దసరా -బిడ్డా అల్లుళ్ళకు కట్నాలు పెట్టుకుంది -ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అమ్మకు న్యాయం చేశాను -అనిపించింది -తన పేరున గల చేను అమ్మి అమ్మ పేరున బ్యాంకు లో FIXED DEPOSIT చేశాను ఆది చాలా అమ్మకు ఉపయోగ పడింది -దానిలై వచ్చే మిత్తి డబ్బులు తనే ఖర్చు చేసేది -
Comments