మా కథ నడిపించడానికి -మా భారతంలో ధర్మరాజు బాపన్న -సీనన్న భీముడు -ఒకతే తేడ ! బాపన్నకు కోపం ఎక్కువ సీనన్నకు కోపమే రాదు లేదు -అంతే-! కుంతీ మాత కస్టాలు పడ్డది అమ్మ -అన్నీ పోయాయి -ధర్మం న్యాయం జయించాయి ! భారత యుద్ధం ప్రశాంతంగా జరిగింది -అక్కడ యుద్ధం లో పోయారు ప్రతి పక్షయోదులు -ఇక్కడ తర్వాత పోయారు -వెంకటేశ్వర్ రావు తాత ముందుగా పోయారు సివిల్ హాస్పిటల్ లో -పిదప వెంకటమ్మ నాయనమ్మ నాలుగేళ్ళ కు --ఆ తర్వాత భద్రా రావు -రామ్ నరసింహా రావు నారాయణ్ రావు రాఘవ రావు లు క్రమంగా నిష్కర మించారు --ఆస్తి తరిగి పోయింది -పంతాలు సమసి పొయ్యాయి -గ్రామంలో క్రమంగా పంతులు గార్ల పట్టు తగ్గి పోయింది ఎన్నో మార్పులు రాజకీయాలు -దొరలూ పట్వారీల చేతుల్లోంచి -జారి పోయింది -సర్పంచ్ గా దేశాయ్ గారు -వెంకట కిషన్ రావు -అతని కుమారుడు దామోదర్ రావు వరుసగా రాగంపేట రాజులుగా చలామణి అయ్యారు -వారు పొయ్యారు -షాహు కార్లు కరీం నగర్కు వలస వెళ్ళారు --పెద్ద మనుషులు మంచి చెడ్డా చెప్పే వ్యవస్థ లేదు ఈనాడు --ఆ రోజుల్లో పంతులు గారు -లేదా దొర గారు ఎంత చెపితే అంత -ఊరంతా హడల్ -తల వంచుకుని వెళ్ళే వాళ్ళు ఆనాడు -వీళ్ళ ముందు గౌరవ భావంతో లేదా భయంతో
--!ఇప్పుడో పరిస్తితి తారు మారు అయ్యింది --భయం భక్తీ కను మరుగు అయ్యింది -ఆది ఒక బంగారు కల -! రాగంపేట జాతకాన్ని తిరుగ రాసింది కృష్ణా శాస్రిగారు -తన పురాణ శ్రవణంతో -ఉరు పేరును జిల్లా అంతటా తెల్క్య జేశారు -సాంబయ్య గారు -తమ్ముడు మేట రామయ్య గారు పుల్లయ్య గారు వీరు తనుగుల వంశం వారు -ఇక గోవిన్డవరం లచ్చయ్య గారు కృష్ణా శాస్త్రి గారు మరొక వైపు -ఇక ధర్మాత్ములైన కోమటి వారు -నేను ఇక్కడ పన్నెండు ఏళ్ళు టీ చేర్ గా పని చేశాను -
Comments