Skip to main content

Part - 43


బాపన్న పెళ్లి వైభవం గా జరిగింది -వెలిచాల గోపాల రావుగారు మంచి పేరుమోసిన ఆస్తిపరుడు  -పైగా ఏడుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు -అందుచేత బాపన్న గర్వంగాను  గౌరవంగాను బ్రతికాడు -పైగా సంతానం చక్కగా అయింది -అయన పురుడు ఖర్చు పెట్టుకోలేదు -రాగం పేట నుండి సమస్త సామాను పోయేది -మొత్తానికి అయన పెట్టినా  -పెట్టకున్నా బాపన్నకు ఒక ధైర్యం  బలం వచ్చింది -చిన్నాయనల  సహకారం లేకున్నా -కుటుంబం నిలపుకోదానికి ఆధారం దొరికింది పైగా పట్వారిగిరి పై వచ్చే ఆదాయం చేతికి వచ్చేది -ఒకరకంగా  తన చిన్నప్పటి కస్టాలు మరపించే సౌఖ్యం  లభించింది -దండి అత్తగారు  బలగం -పిల్లలు -సంఘంలో ఒక  హోదా వచ్చింది -
దీనికి భిన్నగా సీనన్న జీవితం -సాదా సీదాగా అయన కన్న తండ్రి గుణాలు పుణికి పుచ్చుకున్నాడు -ఉద్యోగం హోదా వతన్ దారీ -ఏదీ లేదు -పైగా వ్యవసాయంలో వచ్చే ఆదాయం లో  చాలా నష్టాలే -!నిజానికి సంతానం అయితే మాత్రం ఎలా గడిచేదో భగవంతునికే తెలియాలి --!తండ్రిలాగే ఓపిక -మా  అమ్మకు కోపం వచ్చేది అప్పుడప్పుడు ---కాని సీనన్నకు మాత్రం అరవై ఏళ్ళ జీవితంలో కోపం రాలేదు --వాస్తవంగా  అలుగుటయే  ఎరుంగని  అజాత శత్రుడు అతడు వండ ఏళ్ళ క్రింద ఒక మునిలా పుట్టవలసిన వాడు -ఎన్ని బాధలైనా సహించే వాడు --భూదేవి అంత సహనం -నాకు తెలిసిన వ్యక్తుల్లో అంత దీరున్ని చూడలేదు -ఒక్క రోహాన్  బుజ్జన్నలు తప్ప --వీరిఇకి కోపం రావడం నేను చూడ లేదు -
దురదృష్టం ఏమంటే సీనన్నకు -బాపన్నకు పడేది కాదు -కోపంలో బాపన్న  మేనమామ  వెంకట రామారావు పొలక వండ శాతం వచ్చాయి -ఆయన ఎంత మందినో తిట్టినా తిట్లు బాపన్న ఒక్క సీనాన్న ను మాత్రమె తిట్టాడు -కాని సీనన్న పల్లెత్తు మాట ఎదురు అనలేదు -ఎక్కడ -ఎవరికీ చెప్పుకో లేదు -ఇలా తిట్టడం అటు నాకు ఇటు అమ్మకు -అందరికి బాధగానే ఉండేది -అయినా ఆయన తన తిట్ల దండకం ఆపడం మానుంచి కాలేదు -పట్వారిగిరి పొయ్యి -కరీం నగరంలో స్తిర పడేవరకు ఇలానే జరిగింది -తిండి ముందు -పది మందిలో నోటికి వచ్చి నట్లు అనే వాడు బాపన్న --ఈ  ఒక్క విషయంలో మాత్రం అయన క్షమించరాని  పొరపాటు చేశాడు -! మెతకగా ఉన్న వాళ్ళను చూస్తే  ఎదుటి వానికి మొత్త బుద్ది  అవుతుందేమో -బహుశా ఇదే లోకం తీరు కావచ్చు ! ---ఈ తప్పును బాపన్న తమ్ముడు సీనడు చని పోయాకగాని  గుర్తించ లేదు -అప్పటికే చేయి దాటి పోయింది -కాలం అలా గడిచింది -అలా బాధ పదాలని సీనన్నకు రాసి ఉందేమో -ఈ జన్మలో -బాపన్న అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడు -!నిజానికి ఇలా చేయడంలో బాపన్నకు వచ్చిన లాభం ఏమి లేదు -
మరొక బాధాకర మైన విషయం -ఆలస్యంగా సంతానం కావడం -పెళ్ళైన ఇరవై ఏళ్ళకి - వయసు మళ్ళాక -పాపం  అంత వరకు ఆయన పడ్డ మాటలు ఇంకా గింగురు మంటున్నాయి -వాడెం  చేసుకుంటాడు -భూమి  పైసలు -గోడ్దోనికి ఎందుకు ఆదాయం ? అని బాపన్న మాటలు జారడం అతడు పడ్డాడు -కాని ఆ  స్తానంలో మరెవ్వరు పడరు -! ఇక చిన్న వదిన  సంగతి  సరే సరి -! మూడు పూటలా  వండటం -మంచి నీళ్ళు తేవడం -పుట్టెడు ఇంటి చాకిరి చేయడం --మాటలు పాడటం -పిల్లలు పుట్టనందుకు మాటలు -అవమానం - నలుగురిలో తిరగ లేక పోవడం - వడ్ల తో చాపలా భర్తతో పాటు ఆమె కూడా భరించాల్సి వచ్చింది = వెయ్యి దేవుళ్ళకు మొక్కింది -వ్రతాలు చేసింది -తది బట్టల్లతో ఆంజనేయ ప్రదక్షణాలు చేసింది -పడరాని కస్టాలు  అగచాట్లు పడ్డాది -
దీనికి  తగినట్లుగానే ఆమె కు తల్లిగారి బలం  దిక్కు  లేక పోవడం -తండ్రి బ్రతికి ఉండగా ఇచ్చిన ఆరు తులాల బంగారం సీనన్న వ్యవసాయంలో  పెట్టు బడి పెట్టాడు -ఇక  అల్లున్ని నమ్మక  ఆ  మామ మరో  ఆరు తులాల బంగారం చిన్న వదిన మేన మామ ఉప్పుల  హరి హర రావు వద్ద దాచాడు -ఇస్తే  సీనన్న ఇదీ  కూడా అమ్మేస్తాడని  ఆయన  భయం  మరి !
అయన పోయిన  తర్వాత ఆ మేన మామ ఇంట్లో దొంగలు పడ్డారట -ఈ దాచిన బంగారం దోచుకుని పోయారట -అని తర్వాత తెలిసింది -చిన్నవదినకు తల్లి  అన్న --పెళ్ళికి ముందే చనిపోయారు  -ఇక ఆమె చిన్నాయన  కటికేన పల్లి పురుషోత్తం రావు గారిచే  కన్యా దానం చేయించారు --అటు ఆమె చిన్నాయన --ఇటు సీనన్నకు సాంబన్న మామ  అత్త లు పెళ్లి పీటల పై కూర్చున్నారు -ఆ  సమయంలో పెద్ద వదిన పురుడుపోసుకోడానికి -తల్లి గారింట్లో చాత గాకుండా ఉంది 
-ఇలా దేవుడు చిన్న చూపు చూసినా - ఆయనకు గొప్ప  మనస్సును ఇచ్చాడు -దైవ భక్తీ  నిండుగా నిలిపాడు -అతనికి  ఈ  విషయంలో అమ్మ తోడుగా  నిలిచింది -తన ఆఖరు శ్వాస వరకు సీనన్నను  కంటికి రెప్పలా కనిపెట్టింది --కాపాడింది అతనిపై ఈగ  వాళ నివ్వలేదు --శ్రీనివాసా ! అని రోజుకు వందసార్లు పిలిచేది -అనారోగ్యంతో సీనన్న  భాద పడుతుంటే ఎన్నో దండ కాలు  నారాయణ కవచం  ఆపదోద్దారక  స్తోత్రం -అహర్నిశలు  తను పస్తులుండి -కొడుకును కడుపులో పెట్టుకుంది
నాకు బాపన్న గురించి గాని -నీగురిచిగాని  రంది లేదురా -సీనన్న కోసం -నా  బాధంతా -! అనేది  వానికి  నోట్లో నాలుక లేదు -అన్నెం  పున్నెం తెలియదు -సంసారి వాక కాదు -అత్తగారి బలగం లేదు - పెళ్లామన్న తెలివి గల్లది కాదు -ఎ ఆసరా లేదు -బంగారం లేదు భాగ్యం లేదు - ఇటువంటి వాణ్ని ఎవరూ పాపం అంటారురా ? అని వాపోయ్యేది
-అన్నటుగానే అమ్మ తన కు దగ్గు  ముదిరినా క్షయ వ్యాది తో  వైద్యం లేక రాగం పేట లో బాధ పడినా కూడా సీనన్నను విడిచి రాలేదు - రాగంపేట తన ఇల్లు -ఆది విడిచి నేను ఎక్కడ ఉండను అని చిన్న వదిన  మొండి పట్టు  -ఆమె మంకుపట్టుతో సీనన్న అక్కడే  ఉండటం --సీనన్నకోసం ఎంత  కష్టమైనా భరిస్తూ అమ్మ రాగంపేటలో ఉండాల్సి  రావడం --ఇలా చేయడంతో  అటు  సీనన్నకు  ఇటు  అమ్మకు అనారోగ్యం చాలా దెబ్బ తిన్న్నాయి -కోలుకోలేని పరిస్తితి దాపురించింది -బండ లాంటి దేహ దారుద్యంగల సీనన్న సుగరు బీ పీ పక్ష వాటం అన్నీ ఆయన పై దాడి చేశాయి -అదృష్టం ఏమంటే -సీనన్న కంటే ముందే అమ్మ దాటి పోయింది -తన కళ్ళ ముందు ఆమె సంతానం చల్లగా ఉండటం -సంతృప్తి గా చూసి  సంతోషంతో వెళ్లి పోయిది ఆమె  జీవాత్మ -! అమ్మ సీనన్న అను బంధం ఎంత గొప్ప దంటే - అమ్మకు సీనని మీడానే ప్రేమరా -మా మీద లేదు -అని చాలా సార్లు బాపన్న అన్నాడు ---చివరకు చిన్న వదిన  కూడా వీళ్ళల ప్రేమ  మిడుకా !గింత ఉంట ద !తను పోయేది  పోకుండా -తన వెంట కొడుకును కూడా తీసుకుని పోతదా ! ఇంత పాపం ఉంటదా !అని నిష్టురం పలికింది --

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...