Skip to main content

Part - 44


  1. అమ్మ చేసున్న పుణ్యమో  సీనన్న సత్య మో -చిన్నవాడిన నోముల ఫలమో -  అందరి కన్నుల పండుగ చేయడానికి నాగరాణి పుట్టింది -పెళ్లి అయ్యిన ఇరవై ఏళ్ళకి --అయితే అంతకు ముందే నేను FAMILY PLANNING  OPERATION  చేసుకున్నాను ఆది వేసేక్టమి -అమ్మకు కోపం వచ్చింది -నేను అన్నాను  ముగ్గురు చాలు కాదే అని ! నీకు సరే సీనన్నకు ఎట్లరా  ! నలుగురు పుడితే  దాంట్లో ఒకన్ని -వానికి పెంపకానికి ఇవ్వచ్చు కదరా ! అంది
  2. బాపన్నకు ఆ నలుగురు ఉన్నారు కదా  తను  ఇవ్వచ్చు కదా ! అని నేను అంటే  వాళ్ళు ఇవ్వ్రరట రా ! నువ్వేమో  నాకు చెప్పకుండా ఆపరేషన్ చేసుకొంటివి  -! ఇప్పుడు   వాని గతి ఎట్లరా ! అని బాధ పడింది - వెంటనే నేను సీనన్నను అడిగి నాకు ఇద్దరు బిడ్డలు కదా -న్నీకు ఎవరూ కావాలి -నేను ఇప్పుడే నీ  బిడ్డగా బడిలో పేరు మార్పిస్తాను అన్నాను -చిన్నవాడిన సీనన్న పావని అయితే  చిన్న పిల్ల అమ్మ నాన్న అని  మమ్ములను పిలుస్టది-!అన్నారు వెంటనే నేను స్కూల్ admission  రిజిస్టర్ లో PAVANI  DAUGHTER  OF  SREENIVAS RAO అని మార్పించి అమ్మకు చెప్పాను -అందరికి సంతోషమే ----అయితే ఆది నాలుగు నెలల తర్వాత చిన్నవదిన  గర్భ వతి  అని తెలిసింది -ఈ సంతోషంలో  అందరు పావని విషయం మర్చి పోయారు -నాకు మాత్రం ఇంత కంటే  కావాల్సింది ఏముంటుంది ?మల్లీ  తిరిగి స్కూల్ ADMISSION  REGISTER లో PAVANI  DAUGHTER OF  MANOHAR RAO అని తిరిగి మార్పించి రాయించాను -నేను టీచర్నే -అక్కడ పని చేస్తున్న వాన్నే కనుక ఈ  చేర్పులు మార్పులు ఎవరికీ తెలీకుండా జరిగాయి -   దీనికి పావని తల్లి పద్మ సహకారం ఎంతైనా ఉంది కాని మా  ఈ త్యాగాన్ని నాగరాణి పుట్టిన సంబరంలో -కనీసం మాట వరస కైనా -పావని ని  మాకు మీరు ఇవ్వడం వల్లనో - మీ మంచి గుణం  వల్లనో -మాకు సంతానం కలిగింది -అని ఒక్క మాట కూడాకృతజ్ఞత పూర్వ కంగా వాళ్ళు చిన్న వదిన కాని సీనన్న కానీ అన లేదు ఆది కొంత మా ఇద్దరికీ బాధ అనిపించింది -ఎందుకంటే దీని ఫలితంగా ఒక పెద్ద గండం  ప్రమాదం తప్పింది -పావనికి
  3. అయిదేళ్ళ పిల్ల పావని కి ROAD  ACCIDENT అయ్యింది  -నాగరాణి పుట్టాక    -అదే రోజున  ఈ సంఘటన కరీం నగర్ లో సివిల్ హాస్పిటల్ ముందు  మెయిన్ రోడ్ పై ఒక స్కూటర్ వాలా  వచ్చ్చి డ్డీ  కొట్టాడు -నుదురు పగిలి నెత్తురు ధారగా కారింది -అంతా  రక్తమే -!బిడ్డ తెలివి తప్పింది -వెంటనే అదే సివిల్ హాస్పిటల్ లో కుట్లు పడ్డాయి -వారం రోజులకు గాని ఆది కోలుకోలేదు -స్కూటర్ వాడు  తప్పు  తనదే అని ఒప్పేసుకుని ఎంతైనా డబ్బులు ఇస్తానని అన్నాడు -!అతని మంచి  తనం చూసి వద్దన్నాం -- వరంగల్ లో వెంకట రమణ అనే పండితుడు చెప్పాడు -ఇలా పెంపకం  ఇవ్వడం  తిరిగి వాపస్ తీసుకోవడం -చాలా  దోషం -పెద్ద గండం తప్పింది -ఎవరికైతే  ఈ  పిల్లను ఇచ్చారో వాళ్ళ మీది పీడా -ఈ పాప మీది నుండి  పోయింది --మీ  అదృష్టం -! కొంచెంలో  పెద్ద ప్రమాదం తప్పి పోయింది - ఆమె  మీది  పీడ ఇలా  పోయి ఇప్పుడు ఆమెకు సంతానం కలిగింది -  మీ సంతానం తో  వాళ్లకు ఫలితం కలిగింది -ఈ పాప వల్లనే వాళ్లకు ఆ భాగ్యం వచ్చింది -అని కొన్ని చెప్పాడు చిట్కాలు దోషం పోడానికి -అవి చేశాం --మంచి కోరుకున్న వాళ్లకి దేవుడు మంచే  చేస్తాడు --!ఈ తృప్తి చాలు  ఈ  జన్మకి !
  4. --సీనన్న నిరాడంబరి -! సాదు  స్వభావి ! ఎవరినీ ఎదీ అడిగే వాడు కాదు -మిత భాషి -దొడ్డు అన్నం  -దొడ్డు బట్ట -తో తృప్తి పడ్డాడు -రూపంలో నేను మా  బాపును పోలి ఉన్నా గుణంలో  మాత్రం సీనన్న మా తండ్రిని తలపించాడు -అతని జన్మ నిజంగా ధన్యం! ఎందుకంటే  కన్న తండ్రికి  తల కొరివి పెట్టె భాగ్యం పెద్ద కొడుక్కి దక్కాలి వాస్తవంగా -! కాని బాపన్న అందుబాటులో లేకనో -అతనికి బాకీ లేకనో -సీనన్న అదృష్టమో -సీనన్న పదేళ్ళు ఉండవచ్చు ఆ సమయంలో -పెద్ద మామ సీనన్న తో చేయించాడు బాపు చనిపోయినపుడు  -!
  5. తదుపరి బాపన్న చాలా మారాడు -పశ్చా త్తాప హృదయంతో   -అయ్యో ! వాణ్ని అనరాని మాటలని పాపం చేశాను -తల్లి సేవ చేసుకుని తరించాడు - తండ్రిఋణం తీర్చుకున్నాడు -అని ఏడ్చాడు కూడా ౧ వాణ్ని  నేను బాధ పెట్టానురా -కన్న తండ్రికి అగ్గి పెట్టి వాడు ఋణం తీర్చు కుంటే వానికీ అగ్గి పెట్టి నేను వాని ఋణం  తీర్చు కుంటారా --!అని చితికి నిప్పు అంటించాడు  అంతే  కాదు  సీనన్నగురించిన అన్ని  నెల మాసికాలకి తనే చాత కాకున్నా  ఎక్కడ వున్నా -వచ్చి మాసికం ఒద్దేక్కించాడు -చివరకు  సంవత్స రీకం కూడా జరిపించాడు -
  6. ఇలా  వాస్తవం రాయడానికి బాధగానే ఉంది -ఇదీ చదివితే అయినా వాళ్లకి ఇంకా బాధ అనిపిస్తుంది -ఎమ్ చేయను -నా లోని వ్యధను ఇలా వ్యక్తం చేయడంలో ఎవరీకైనా మనసు నొప్పిస్తే నన్ను మనసారా క్షమించాలి -ఈ  జీవన చదరంగంలో మనం పావులం -ఆ పై వాడు  మనల్ని ఎలా ఆడిస్తాడో -ఎవరితో ఎమ్ చేయిస్తాడో  వానికే తెలుసు ! ఆడక తప్పదు ! కర్మ ఫలం అనుభ వించక  తప్పదు -
  7. ఎన్ని ఇబ్బందులున్న  ఏది ఏమైనా భగవన్నామం విడవని వారు అమ్మ సీనన్న అని ఘంటా పతంగా  చెప్ప వచ్చు !బాపన్న  చాలా మారాడు -అమ్మ సీనన్న లేనితనం  అతనిలో భయాన్ని  బాధను కలిగించింది -వార్ బాటలోనే తను పయనించాడు -నిరంతరం హరినామం  భ్హజించాడు -దేవుని పూజ మరవలేదు రెండు పూతల సంద్యా వందనం నిష్టగా చేశాడు - ఆయనా  ధన్యుడే -ఎందుకంటే చివరి క్షణాల్లో ఆఖరు శ్వాసతో  నారాయణా -అంటూ హరి నామం జపించాడు -అంత బాధలో కూడా దైవ చింతన విడవ లేదు -అమ్మ అంతిమ ఘడియలో గాని సీనన్న తుది శ్వాస సమయంలో గాని నేను లేను -కాని బాపన్న చివరి చూపు  చివరి పలుకు ఆఖరకు అతనికి చివరి సారిగా -అతనికి ఎంతో ప్రీతి కరమైన చాయ్ -టీ  ని నా చేతుల మీదుగా బాపన్నకు తాగించే పరమ భాగ్యం నాకు దేవుడు కలిగించాడు  -!చాలు-! అదే  నాకు పది వేలు !శ్రీ కృష్ణుడు భగవద్ గీత లో స్వయంగా పలికిన వాక్యం -ఎవరైతే చివరి ఘడియల్లో నన్ను స్మరిస్తారో -అట్టి వారు  నన్ను చేరుకుంటారు ! అని -బాపన్న విషయంలో అదే  జరిగింది
  8. ఒకే తలి దండ్రుల సంతానం -నలుగురం అయినా  ఎవరి కర్మ వారిదే కలిసి జీవనం గడపడంలో -ఒకరి ప్రవర్తన మరొకరికి ఇబ్బంది కలిగించ వచ్చు ! లేదా  సంతోషాన్ని  ఇవ్వవచ్చు ! ఆది వాళ్ళ భాగ్యం -అనే చెప్పాలి -ఆది సీనన్న అయినా - మా కన్న తండ్రి అయినా  విధి చేతిలో కీలు బొమ్మలే !-కాక పొతే ఆరుగురు అన్నదమ్ములలో అతడే  అంతగా చివరి ఘడియల్లో అత్త గారిట్లో తోబుట్టువులు -సోదరులు  తల్లి దండ్రి  కన్న కొడుకు  ఆస్తి ఐశ్వర్యం -ఎన్ని ఉన్నా ఎంత భక్తీ పరుడైనా - బాధతో -వ్యధతో తపించాడు

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...