Skip to main content

Part - 41


భక్తి  అంటే ఏమిటో  మన రాగంపేట గత  వైభవాలు తిరిగేసి  చూస్తే  తెలుస్తుంది  --అమ్మ  మా బాపు -ఇంకా క్రిష్ణ శాస్త్రి గారు  చాలు భాగవతులు  అని చెప్ప డానికి  --మన ఇంట్లో శంకరాభరణం  శాస్త్రి ఇంట్లో ధ్వనించి నట్లుగా   ఇంకా నాకు మా  అమ్మ సుప్రభాత గీతాలు వినబడు తున్నాయి -బహుశ  ఇప్పుడు  నిశ్శబ్దం గా  ఉన్న ఆ  దేవాలయంలో అమ్మ  సీనన్న కలిసి ఆలపించే రామనామం -భగవద్ గీత శ్లోకాలు -అండాలు స్తోత్రం -అంబరీష -గజేంద్ర -రుక్మిణి -దశమ స్కంద  భాగవత పద్యాలు ఆ  నాల్గు  గోడల మధ్య మార్మోగుతున్నాయి --వినే చెవులే  ఉంటె ఇంకా వినపడు తూనే ఉంటాయి -
అలాగే మా బాపు -తొక్కుడు హార్మోనియం తో   హరే  రామా --కృష్ణా-అని గొంతెత్తి ఆ  ఇల్లు -వాడా వినిపించేలా భక్తితో -బ్రహ్మ ముహూర్తంలో  -పాడటం రాగంపేట గ్రామం చేసుకున్న పుణ్యం --అలాగే నూరు పైగా  పురాణాలు చెప్పి భక్తియుక్తంగా  క్రష్ణా  అంటూ  తన్మయత్వం తో -లీనేమై చెప్పిన  తీరు  నా కళ్ళతో చూశాను -అంత పరవశం చెందుతూ  భగవంతుని  గుణగణాలను వర్ణించి -పురాణాలను చెప్పిన వారు  చాలా  అరుదు --వారికి  వారే  సాటి -ఒకే  గ్రామంలో ఉంటూ  చక్కని అనుబంధాలను పెనవేసుకుని -పుణ్యాత్ములు అయ్యారు -వారిని గురించి  ఇలా  స్మరించుకోడం వల్ల  మన  జన్మ  ధాన్యం అవుతుంది -వారి అడుగు జాడల్లో కొంతైనా  నడువ గలమా -!!ఇది మనం  అనుకోడం  కాదు -మన  గ్రామస్తులకు అందరికి తెలుసు -సీనన్న  కూడా  ఒకరకంగా  అదృష్ట వంతుడే -అమ్మ తో ఉంటూ  అమ్మతో  పాడుతూ అమ్మ పాడే పాటలు  పద్యాలు వింటూ -తాను కూడా భక్తుడయ్యాడు -విష్ణు సహస్ర నామాలు నోటికి చెప్పే వాడు -రామా నామం నిత్యం అనేవాడు --భాగడ్ గీత  శ్లోకాలు కొన్ని అర్థం  భావం తో  సహా గుడిలో సత్సంగ్ చేస్తూ  అందరికి  ఆశువుగా  కంచు  కంటంతో పాడే వాడు - నిత్యం సంద్యా  వందనం -మడి  పూజా -ఏకాదశి  ఉపవాసాలు --ఒకటేమిటి ?అమ్మ  ఏమేమి చేస్తుందో తాను చక్కగా అనుసరించే వాడు  -అమ్మ  గురువు  తను  శిష్యుడు --అంటే !గోడల నిండా  దూలాల  పైనా -కాపీలు  పుస్తకాలూ  అన్నింటిలోను  పెన్నుతో  చాక్ పీసుతో -రాసే వాడు -చివరకు అమ్మ తోనే  వెళ్లి  పోయాడు -
ఉన్నన్నాళ్ళు బీదరికంలో  బ్రతుకుతూ మనసును మాత్రం  భగవంతుని పై ఉంచి --ఈ ఇహలోక కష్టాలకు సుఖాలకు తల వంచకుండా -వీటికి  అతీతంగా నిరంతరం  భగవంతుని  సన్నిధానంలో  అతని  సంకీర్తనంలో గడిపి తమ  జన్మ ను సార్థకం చేసుకున్న వారి జన్మ నిజంగా  ధాన్యం -దేనికైనా  నోచుకుని పుట్టాలి -ఆ  భాగ్యం  అందరిని  వరిస్తుందా!
బాపన్న  చాలా సార్లు అన్నాడు -సీనడు నిజంగా  అదృష్ట వంతుడురా -ఆహా !వాడు  తల్లి కడుపులకేల్లి  ఎట్లా  వచ్చిందో మళ్ళ అట్లనే తల్లి కడుపులకు పోయిండు  అని --అంటే -సరిగ్గా అమ్మ దహనం అయిన స్తలం లోనే  సీనన్న ఆక్రమించడం --మధ్యలో  ఎ ఇతర ము -లేకుండా ఉండటం పడి  రోజుల్లోనే తల్లి ని  అనుసరిస్తూ స్వర్గస్తు దవటం -అందరికి  విచిత్రం  అని పించింది -!అమ్మ  లేకుండా  నేను  ఉంటానా ?అని  సీనన్న  కమలక్కతో అన్న  మాటలు నాకు  ఇంకా  గుర్తు !ఏది  ఏమైనా మంచి పేరు తో బ్రతుకు ధాన్యం చేసుకున్నారు -పోయినోళ్ళు అందరు మంచోళ్ళు -కాని వారి  పుణ్యం  వల్ల మనకు మంచి జరుగుతుండ్ -అంటే  కాదు  చేదు  చేస్తే  చేదు  కూడా  వెనుక పడుతుంది -అన్న  మాట కూడా  సత్యమే
మా  బాపు ఒకతే కూతురు  అయినందుకు  కమలక్కను చక్కటి సంభందమే  చూసి  చేశాడు --అయితే రత్నాకర్ రావు బావకు తన పెళ్ళికి  ముందునుండే తల్లి దండ్రుల తో వైరం --కొట్లాటలు   తను  వేరే ఉండటం -వారికి దూరంగా  కొట్టంలో  ఉంటూ స్వయంగా  వంట  చేసుకుంటూ ఉండటం -మా  బాపుకు చక్కగా  తెలుసు -అయినా అతన్నే  ఇష్టపడ్డాడు -ఆస్తి ఉంది ఎర్రగా  బుర్రగా  ఉన్నాడు -పైగా  మంతనిలో హైస్కూలు లో సాంబన్న మామ  కమలాకర్ మామ  భయ్యాజి  రామగుండం మనోహర్ రావు ల తో  కలిసి వంట చేసుకుంటూ  చదువు కుంటున్నాడు --అందరు  అన్నారట పెళ్ళికి  ముందే గడుసుగా కన్నవాళ్ళ తో పంతం పెట్టుకున్నాడు -ఈ  పిల్ల  అతనితో ఎమ్ సుఖ పడుతుంది --!అని  కాని మా  బాపు చాలా ఈజీగా తీసేశాడు -నాకు మాత్రం  మా  అమ్మ బాపు లతో కొట్లాటలు లేవా  -ఇది  మామూలే -!తెలివి ధైర్యం ఉన్నాయి  చాలు -అని  సమా  దాన  పడ్డాడు
నిజానికి మా  బావకున్న  తెగింపు మొండితనం -అదే  ధైర్యం -మా  బాపుకు  లేవు -అని  మా  చరిత్ర  చెపుతోంది -బ్రహ్మ ముడి అలా వేశాడు ఆ  ఇద్దరికీ
--ఎనిమిది ఏళ్ళ పిల్లకే  పెళ్లి చేశారు --సరిగ్గా మా  అమ్మకు కూడా  ఇదే  వయసులో జరిగింది పెళ్లి -ఆది ఐదురోజుల పాటు  ఘనంగా -అతి  వైభవంగా ఎందుకంటే రాగంపేట వారి  ఆస్తి  కంటే  లక్షెట్టి పేట వారి  ఆస్తులు పెద్దవి -వారు  దొరలూ  వీరు -అంటే  మేము పంతుల్లం  మాత్రమె - అందుకే  మా  అమ్మ  కలవారి  కోడలు  అయినందుకే  నాయనమ్మ  వెంకటామ్మ సూర్యకాంతమ్మ అత్త   అయ్యి రాసి  రంపాన పెట్టింది అమ్మను -  ఆ  కష్టాల  ఫలితమే  మా  అమ్మ  కాలి  కుష్టు వ్యాధి పుండ్లు -అమ్మ అనేది కూటికి చంపిండురా  --మల  మల  మాడ్చిండ్రు -ఆకలికి అన్నమో  రామా చంద్రా  అనిపించిడ్రు -హర  హర  గోషా  పుచ్చు కున్నారు -కటిక  కులం -నర రూప రాక్షసులు -ఇన్ని  నీళ్ళకు  ఎదిపించిన్ద్రురా  నన్ను -మా  తల్లిగారి  ఐశ్వర్యం చూసి  ఓర్వలేక  నన్ను నానా  యాతనలు పెట్టిన్ద్రురా  -అందుకే  వారి మొకం చూడ బుద్ధి కాదు -అరవ  చాకిరి  చేయించుకుని  ఎ రోజు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేడురా  మా  అత్త వెంకటమ్మ -డానికి బిడ్డలు ఉన్నారు -అయినా  గింత  నెనరు  కనికరం -దయ లేదురా  --ఎట్లా  పుట్టిందో  తల్లి  కడుపున --అంటూ  అమ్మా  వాపోయేది-- అమ్మ  పడ్డ  కస్టాలు  వ్యధ  బాధ మాటల్లో రాయలేం - మనసు మూగ పోతుంది  ఇందులో పడితే  బయటికి  రాలేం -
ప్రస్తుతం నేనే ప్రత్యక్ష  సాక్షిని -గతంలో  జరిగిన  సంఘటనలకు - సమస్యలకు సమాధానం కూడా  నేనే -
అక్కా  పెళ్లి  అయ్యాకా -బాపు ఎన్నో  సార్లు  బ్రాహ్మణా పెళ్ళికి వెళ్ళాడు -కూతురు నీళ్ళు  పోసుకుందేమో  అని ఒకసారి  చాలా సంబరతో అట్టహాసంగా అన్నీ  తీసుకుని వెళ్ళాడు -కాని  అయన  బ్రతికి ఉండగా  ఆ  ముచ్చట  తీర లేదు -అయినా అక్కడి  పాలేర్లకు  పని  వాళ్లకు  ఆ  రోజుల్లో  పడేసి  రుపాయలిచ్చే వాడట -వాళ్ళు  తెగ  సంబర పడే వాళ్ళట-! అక్కా  అంటే  మా  బాపుకి  చాలా ప్రేమ - -కాని  మా  అక్కకి తను  మరీ  చిన్న పిల్ల  అయినందు వల్ల ఇవేమీ జ్ఞాపకం లేవు  బాపును గూర్చి సరిగ్గా అవగాహన  డానికి  లేదు -చిన్నతనంలోనే పెళ్లి  వెంటనే  అత్త గారింటికి   --ప్పెడ్డది కాకుండానే  కాపురం  -
అక్కకు  వంట  కూడా  రాదు -పనీ  వంటా  అంతా  బావనే  నేర్పించాదట -
తర్వాత మా  బాపు  తన  అన్నదమ్ములతో  తల్లి దండ్రులతో -వైరం పెట్టుకోడం  కొట్లాట  తీవ్ర తరం కావడం -ఇంట్లోంచి బయటకు  వెళ్లి  రావడం  మూలాన అక్కకు బాపు అమ్మ గురించిన  విషయాలు  తెలియవు -బాపును చూడటం కూడా తక్కువే -! వస్తే  బాపే రావాలి గాని తను వెళ్ళలేదు  రాగంపెటకి--
బాపు  అనారోగ్యంతో అత్తవారి  ఇల్లు చేరడం -విని ఒకసారి బాపును  చూడటానికి అక్కను  తీసుకుని  బావ లక్షెట్టి పేటకు  కచ్చలం బండిపై తీసుకుని వచ్చాడట -!ఇదంతా  అక్కా  చెప్పుతోంది -! ఆరు నెలలు  మంచాన  పడి అయినా వారికోసం ఆక్రోసించి దిగులుతో ఇంకా  శుష్కించి పోయాడు -వాల్లెవ్వరు ఇటు  తొక్కి  చూడలేదు కనీసం  బాపన్నను  పంపలేదు --
బావతో  మా  బాపు  అన్నాడట -తలిదండ్రులతో  మంచిగా  వుండు -వాళ్ళు  ఎమన్నా  ఓర్చుకో అని -!బావనేనా మాట ఒర్చుకునేది ? ఇది కేవలం తనకి మాత్రమె వర్తిస్తుంది -!ఎదిరించక  పోవడం - ఎదిరించడం -వారి  ఇద్దరి మధ్య ఉన్న  వ్యత్యాసం ! ఇదీ జీన్స్ లో ఉన్న మహత్తు -! చూస్తే  వచ్చేదా? నేర్చుకుంటే  అలవాడే  గుణమా ?
పాపం కూతురి ముద్దు  ముచ్చటా చూడ కుండానే పోయాడు -అప్పుడు కోటి లింగాలలో  తండ్రికి  కొరివి పెట్టలేకున్నాగాని పడవ రోజు కర్మ బాపన్న చేస్తుంటే అక్కా  బావ వచ్చారట -! తర్వాత  అమ్మ జబ్బు పాలవడం  -అమ్మను  ఎవరూ  భరించే  స్తితిలో లేక పోవడంతో  సుందిళ్ళ  లక్ష్మీ  నరసింహ  స్వామీ సన్నిధిలో చేరడం -ఇక్కడ అక్కా మొదటి కానుపు కోసం  అమ్మ  బాపు లేని లక్షెట్టి పేటకి  పురుడుకై  రావడం -మేనమామల ఇంట్లో అక్కా బేలగా పురుడు పోసుకోవడం -ఇదంతా  మా  అమ్మ  చూడ లేదు -అప్పుడు అమ్మ  పరిస్తితి అతి  దారుణంగా చావు  బ్రతుకుల మధ్య  కొట్టు మిట్టాడుతూ -ఎవరు దిక్కు ?అన్నట్లుగా  -ఇంకెవరు  -దేవుడే దిక్కు ?-అదే మా  భక్తి మార్గానికి  నాంది పలికింది   --కూతురు  అత్త వారింటిలో -నేను సీనన్న లక్షేట్టిపెటలో  --బాపన్న రాగంపెతలో -తను సున్దిల్లలో -తలా ఒకవైపు విధి చేత   నిర్దయగా  విసిరి వెయ బడ్డారు -అమ్మ  చేసుకున్న  పుణ్యమే ఇప్పుడు మమ్మల్ని ఒక  దారికి తెచ్చింది -బాపు కున్న విధేయత  ప్రేమ -అమ్మ కున్న దైవ భక్తీ -వారి  సంతానానికి  ఇంత భిక్ష  పట్టెడన్నం -పడి మందిలో గౌరవం -కీర్తి తెచ్చి పెట్టాయి
అక్కకు  పుట్టిన తోలి సంతానం కూతురు -శ్యామల -చాలా  అందమైన  -దివ్యమైన తేజస్సు గల బిడ్డ -ఇప్పుడున్న ఈ ఐదుగురి కన్న తెలివిగల  అమ్మాయి
--అయితే  ఈ  పాప  బారసాల కు  కూడా   అమ్మ తన ఆనందం పంచు కోలేక పోయింది --అక్కా   బారసాల అయ్యాక తిర్గి  బ్రాహ్మణా పెళ్ళికి వెళ్లి పోయింది
తర్వాత జరిగిన  కాన్పులన్నీ అక్కడే బూది- అనే ఆమె  ఆసరాతో  జరిగాయి -
ఇక్కడ రాగంపేట లో మన ఇంట్లో లచ్చి  ఎ విధంగా ఇంటి మనిషిగా మిళితం  అయ్యి పని చేసిందో --అలాగే  అక్కడ  బూది కూడా చేసింది -వాళ్ళ  ఋణం తీర్చుకోలేం  మనం -ఎ జన్మ  సంభందమో  మాకు  మా  పిల్లలకీ  అంతులేని సేవ చేశారు -బదరీ -గయ తీర్థాలలో వారిని మరవకుండా పిండ ప్రదానం చేశాను నేను -నిజానికి  మన మనుగడకు ఎందఱో చేయుట  ఇస్తున్నారు -మనకు సంతోషం -సౌకర్యం కలుగ చేస్తున్నారు -!కాని  మనం ఎంత మంది  ఆనందానికి సహకరిస్తున్నాం ? మానవ  జన్మ  సార్తకతకు మన  కృతజ్నతకు  కనీస  ధర్మం  తోటి వారి ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించడం
అంతర్ మధనం  ఇలాంటి సందర్భాలలో తప్పక అవసరం -ఏమి చేశాం ?  ఏమి  చేయాలి ? ఎమ్ చేస్తున్నాం? ఎంత సేపు స్వార్థం కోసం ఆలోచన చేయడమేనా ? ఇప్పుడైనా ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన రాదా ?-

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...