Skip to main content

Part - 40

నా PUC చదువు మళ్ళీ కరీంనగర్ లో ప్రారంభం -మంగమ్మ ఇంట్లో ఉనికి -అప్పటికి బాపన్నకు స్వయం శక్తి -కలుగ లేదు -ఇంకా చిన్నాయనల నిర్ణయం పైనే నడుస్తున్నది అతని పట్వారిగిరి వ్యవహారం -వారికి చెప్ప కుండ ఎ పని జరిగేది కాదు -ఇప్పుడు నా విషయంలో కూడా అంతే -
సీనన్న వ్యవసాయానికి అంకితం అయ్యాడు -ఇలా నాకోసం వాళ్ళు ఇద్దరి త్యాగంవల్లనే నేను చదువు కోన గలిగాను -నేను మంచి మార్కులతో పాస్ అయితే వారికి ఆనందం కన్న తండ్రి వలె నన్ను ప్రేమగా చూశారు -ఎన్నడు నన్ను పల్లెత్తు మాట అనలేదు నేను చక్కగా చదువు కొడం వారిని ఆనంద పరచింది
ఎంత కస్తానికైనా ఒర్చుకున్నారు -ఇప్పటికి నాకు అదే బాధ -నేను చదువు -ఉద్యోగం అని నాలుగు డబ్బులు సంపాదిన్చుకోడం వాళ్ళు గ్రామంలో రైతుల్లా మామూలు జీవితం గడపడం -వాళ్ళు దోతి కట్టుకుని తెల్ల అంగీల్లో ఉంటె నేను ఖరీద్ అయినా షర్టు పాన్తుల్లో దర్జాగా ఉండటం -వాళ్ళ త్యాగం తో నేను వారికి దూరంగా సుఖంగా ఉండటం -వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకో లేక పోవడం -వారిని ఎంత ఆడుకోవాలో అంతగా చూసుకో లేక పోవడం ఇప్పటికి బాధ గానే ఉంటోంది -ఏమైనా నాకంటే చాలా ఎక్కువ కష్టపడ్డారు అమ్మతో సహా -నా జీతము జీవితమూ స్వంతంగా ఇల్లు కట్టు కొదానికే సరిపోయింది -ప్రతి పైసా కూడా బెట్టి చిట్టీలు కట్టి కరీంనగర్ లో ఒక స్వంత ఇల్లు ఉండాలనే తాపత్రయంలో అన్నలను ఆడరించాలనే ఇంగిత జ్ఞానం లేక పోయింది -ఇప్పుదనుకుంటే ఎమ్ లాభం -నాకోసం వారు ఎంత చేసారో అందులో నేను వారికి కొంత అయినా చేయలేక పోయాను -భగవంతుడు నన్ను ఈ విషయంలో తప్పక క్షమించాలని వేడుకుంటున్నాను
మంగమ్మ ఇంటిలో నాలుగు సంవత్సారాలు ఉన్నాను ఆమెదే ఉప్పు పప్పు తిన్నాను -నాతోబాటు హేమన్న -తను కూడా MULTIPURPOSE చదువు తను B A నేను BSC ఇలా ఒకే ఇంటిలో ఉంటూ ఎ కొట్లాటలు లేకుండా కలిసి మెలిసి ఉన్నాం -తనకు తండ్రి లేదు నాకు అంతే మంగమ్మ కస్టాలు పడ్డది అందుకే కష్టంలో ఉన్న నన్ను ఆదరించింది -ప్రేమగా చూసింది -మధ్యలో చిన్నయనల బాధ పడ్డాను -PUC తర్వాత ఇంజనీరింగ్ చదువాలని ఆశ పడ్డాను కాని అప్పుడు అసలే ఇంగ్లీష్ మీడియం చదువు -అందులో MPC దానితో పాటు SOCIAL STUDIES సబ్జెక్ట్ చాలా కష్ట పెట్టింది -పుస్తకాలు నోట్ బుక్స్ లేవు మంకమ్మ తోట నుండి బాల క్రిష్ణ టాకీస్ వరకు నడిచి పోవాలి రావాలి సైకిల్ కూడా లేదు -ఉదయం ఏమి తినకుండా వెళ్ళే వాణ్ని -SSC వరకు తెలుగు లోను వెంటనే ఇంగ్లీష్లో చదవడం ఎ వసతి లేకుండా చాలా ఇబ్బంది అయ్యింది -అయినా బట్టీ పట్టి FIRST CLASS లో పాస్ అయ్యాను
అయినా లాభం లేక పోయింది -అప్పుడు మెరిట్ పై సీట్లు దొరికేవి -నిరాశ పడక డిగ్రీ చేశాను ఆ సమయంలో డిగ్రీ నుండి ఇంజనీరింగ్ వెళ్ళే అవకాశం ఉండేది -కాని నేను డిగ్రీ ఫైనల్ వచ్చే వరకు ఆ చానల్ తీసేశారు -అప్పుడు నిజంగా చాలా బాధ పడ్డాను -అందుకే టీచర్ జాబు చేస్తూ కూడా డబ్బు కూడా బెట్టుకుని ప్రైవేటుగా అప్లై చేసి MSC చేశాను -ఎలాగైనా university మెట్లు ఎక్కాలని P G COURSE చేయాలని ఆశ బలీయంగా ఉండేది -దేవుని దయ వల్ల ఇంజనీరింగ్ కాకున్నా పీ జీ చేయగలిగాను అప్పుడున్న పరిస్తితి వేరు -హైదర బాద్ వెళ్ళాలంటే డబ్బులు దొరికేవి కాదు -పైగా భయం ఏది ఎక్కడ ఉందొ తెలీదు -ఒక రాత్రి అక్కడ ఎక్కడ గడపాలో చెప్పే దిక్కు లేదు -దారి చూపే వాడు GUIDE నేనున్నా నాని ధైర్యం చెప్పే నాధుడు కరువయ్యాడు ఆ రోజుల్లో -అంతెందుకు -రాగం పేటకు పైసలు లేక నడిచి వెళ్ళిన రోజులున్నాయ్ -డిగ్రీ లో నా ఫీజులకు మంగమ్మ బాబ్బులు ఇచ్చింది -
అందుకే వేరే దారి లేక టీచర్ జాబులో -డిగ్రీ కాగానే నేరుగా చేరిపోయాను -
FIRST APPOINTMENT నుస్తులాపూర్ హైస్కూలులో -౧౯౬౭ జూన్ మాసంలో -అప్పుడే రాజన్న నాతొ బాటే నుస్తులాపూర్ లో ఉన్నాడు ఆరవతరగతి చదవదానికోసం -బావగారు వాణ్ని నాకు తోడూ చేశారు ౧౯౭౧ మే నెల -లో నాకు పెళ్లి అయ్యేవరకు అని కాదు వాని సశక్_inter చదువు పూర్తీ అయ్యేవరకు వాడు నాతొ పాటే ఉన్నాడు ఎలిగేడు -గుండి రాగంపేట హైదర బాద్ లో వరుసగా ఆరు సంవత్సరాలు నేను వండుకోడం వాణ్ని ఒక తమ్మునిలా సాడుకోడం -జరిగింది -అయితే తగినంత చదువు వానికి అబ్బలేదు కాని నాచేత బాధ పడ్డాడు దెబ్బలు తిన్నాడు -కారణం వానికి చదువులో తగినంత ఆసక్తి లేకపోడం నన్ను ఇబ్బంది పెట్టింది వాణ్ని కష్టపెట్టింది -అందుకే బంగారు కొండ వద్ద వున్నా ప్రాప్తం ఉన్నంటే దొరుకుతుంది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...