Skip to main content

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు-

ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్లీష్ --అన్ని పరీక్షల్లో నాకే చక్కని గుర్తింపు వచ్చింది --ప్రతి రోజు నేను వచ్చి వందే మాతరం --జనగణమన --పాడితేనే ఆ రోజు ప్రార్తన సాగేది ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సాహం రావడం - నాకు స్కూల్లో ఉపాద్యాయుల్లో - తోటి విధ్యార్తుల్లో -చక్కని గౌరవం లభించింది --దాంతో ఎక్కడలేని ఉత్సాహం -శక్తీ --వచ్చేసి తిండీ తిప్పలు మరచిపోయే వాణ్ని -!

అప్పుడు నేను ఒంటరివాన్ని అనే విషయం మరిచి--స్కూల్ లో -మంచి విద్యార్థిగా పేరు పొందాను వరుసగా ఎనిమిది --తొమ్మిది -పడి తరగతుల్లో నాకు స్కాలర్ షిప్ వచ్చాయి అప్పుడు 2 5 రూపాయలు మాత్రమె పారితోషికం ఉండేది --ఆది చూసి పెదమామ పొంగి పోయాడు -ఎంతో మంది ఇక్కడ -ఏదో చదివారు --నా తమ్ముళ్ళు కూడా -అత్తెసరు చదువులే -కాని స్కూల్ ఫస్ట్ వచ్చే చదువులు -నేను చూడలేదురా --పాపం మీ బాపు లచ్చన్న బావ ఉంటె ఎంత సంతోష పదేవాడురా-- ఆయనకు బాకి లేక పాయె -- అంటూ నన్ను దగ్గరకు తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు -నిజంగా ఆ క్షణంలో నాకు కన్నీరు ఆగలేదు తండ్రి ప్రేమకు నోచుకోక కన్న తండ్రిని చూడలేక -ఎవరైనా బాపు --అంటే ఎంత బాధగా గుడిలో కలుక్కు మంతుందో -సుఖంలో బ్రతికే కొడుకు కంటే కష్టపడే కొడుకులకు -చాలా తెలుసు --ఈ బాధ నాకే కాదు చిన్నతనంలో తండ్రిని పోగొట్టు కున్న పిల్లలకు అందరికి అనుభవైక వేద్యమే-

నేను -చదువుల్లోనే కాదు పాటల పోటీల్లో వ్యాస రచనల్లో -బొమ్మలు గీయడంలో -చక్కని రాత రాయడంలో -చక్కని పేరు ఉండేది -నా కాపీల్లో రాత చూసి మెచ్చుకునేవారు --న-అప్పుడు కూడా ట్యూశను లు ఉండేవి -లెక్కల్లో జగన్నాథ రావు సారు నాకు ఉచితంగా చెప్పేవాడు -ఆయనంటే హడల్ -పిల్లలందరికీ -ఆ రోజుల్లో OPTIONAL సబ్జక్ట్స్--HISTORY OR MATHEMATICS ఉండేవి --మొదట్లో నేను హిస్టరీ తీసుకున్నాను --తర్వాత ఉపాధ్యాయులంతా కలిసి నన్ను mathematics కట్టబెట్టారు -తెలివి గల వాళ్ళు ఈ సబ్జెక్టు లో రాణిస్తారని అంటూ -

నిజానికి చదుకోడానికి పుస్తకాలు రాసుకోడానికి కాపీలు సరిపోయేవి కాదు -ఈ టీచర్ నన్ను ఏమి అనే వారు కాదు --ఒకసారి చాలాసార్లు నా తెలుగు పరీక్షల్లో ప్రతీ ప్రశ్నకు జవాబు పద్యాలలోనే రాసే వాణ్ని --చాలాసార్లు తరగతి గదుల్లో నాచే పద్యాలు పాటలు చదివిన్చేవాళ్ళు --
లక్షేట్టిపెటలో ఆ రోజుల్లో ఒకే ఒక radeo బస్సు స్టాండ్ వద్ద ఒక హోటల్ లో ఉండేది ఆ పాటల కోసం రాత్రి 8 గంటలకి అమీన్ సాయాని వినిపించే బినాకా గీత మాల వినడానికి తన్చంగా ఒక్కన్నే వచ్చి వినే వాణ్ని ఇలా తెలుగు హిందీ పాటలు ఎక్కడ వినిపిస్తే కాళ్ళు బ్రేఅక్ పడ్డట్టుగా ఆగిపొయేవి-

ఆదివారమొస్తే చాలు గంగా స్నానానికి -జట్లు జట్లుగా పరుగులు తీసే వాళ్ళం 8 గంటలకు వెళ్తే తిరిగి 1 2 గంటలకు గాని ఇంటికి వచ్చేవాళ్ళం కాదు సత్రం రామన్న -కొత్తపల్లి నాగేందర్ -శేషేన్దర్ -నాగయ్య పురుషోత్తం - తానిమడుగు రామన్న రఘోత్తం బాల కిషన్ వెంకయ్య బావ లచ్చన్న సూరన్న రమేష్ కాక -ఇలా ఆ వాడలోని వాళ్ళతో ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నాం-మత్తడి లో ఈతలు --ఇంటివెనుక పెరడులోని పెద బావిలో మధ్యాహ్నం ఈతలు చేద బావిలో స్నానం --పెదమామ ఇంట్లోంచి -బయటకు వెళ్తే చాలు ఎన్నో ఆటలు కేరింతలు తిండి నిద్ర మరచేవాళ్ళం -చేనుల్లో గిల్లీ దండా ఖచ్చితంగా రోజు పొలం మడ్లల్లో ఆడుకునే వాళ్ళం - హోలీ పండుగునాడు రంగులతోబాటు బురదకుడా చల్లడం -అదో మజా -

ఒకనాడు నేను విసిరినా రాయి శేషేన్దేర్కు తలిగింది -తప్పు నాదే నేను రాయి వేసే సమయంలో చూసుకోకుండా అతడు అటుగా అనుకోకుండా వచ్చాడు నుడుకు దెబ్బ తగిలి బోట బొటా అనేట్టురు కారింది --నేను భయపడ్డాను అంతా కంగారుగా పెద్దాల్లకు చెప్పారు కాని తనదే పొరపాటనీ మనోహర్ ది తప్పు లేదనీ చెప్పాడు -లేకపోతె ఎంత గొడవ అయ్యేదో --అల్లా నాకున్న మంచి పేరు నన్ను కాపాడింది

రాగంపేట నుండి బాపన్న వచ్చిచుసి నాకు ఎకాన -లేదా చారాన చేతిలో పెట్టి వెళ్లి పోయేవాడు -బాపంనపై పెదమామకు అంత మంచి అభిప్రాయం అప్పుడు లేదు కన్న తండ్రి పై తహసీల్ దార్ వద్ద -తండ్రి పిచ్చివాడు అని బాపన్న చేత భద్రయ్య ఇప్పించిన దరఖాస్తు మామకు క్కోపం తెప్పించింది - తండ్రి చచ్చిపోతే కనీసం కొరివి పెట్టడానికైనా రాణి బాపన్న కూడా వాని చిన్నాయనల చంక నాకే వాడు -అనుకునే వాడు

-ఇక సీనన్న తరుచుగా వస్తు -వెళ్ళేవాడు - అయితే వెలగటూర్ వరకే బస్సులు వచ్చేవి కనక అక్కడివరకు నడవడం గూడెం ద్వారా చాలా కష్టమయ్యేది -ఇక గంగ దాటి కోటిలింగాల ద్వార వెలగటూర్ వెళ్ళడానికి -ఎండాకాలం మాత్రమె వీలయ్యేది -ఎంతో కష్టపడితేనే రాగంపేట నుండి ఇక్కడికి రావడం జరిగేది-అమ్మ వస్తే మాత్రం బండి ఎడ్లు కట్టుకుని వచ్చేది

నాకు వచ్చిన స్కాలర్ షిప్ పైసలతో అమ్మకు ఒకసారి విశ్వరూపం ఫోటో నగదు ఇచ్చి దండం పెట్టాను -నేను ఇలా చదువులో మునిగి పొతే సీనన్న వ్యవసాయంలో బాపన్న వ్యవహారంలో కూరుకొని పోయారు -

ఇంటి నిండా పాడి పంట గుమ్ములు మక్కలు వడ్లు ఉరవతల కొట్టంలో పశువులు ఎడ్లు ఆవులు బార్లు చిన్న చిన్న లేగలు నలుగురు పాలేర్లు - నీరది పోచమల్లు గజ్జెల మల్లయ్య హరిజ నా దుర్గయ్య కుటికెల ఎల్లయ్య ఇంట్లో పనికోసం లచ్చి భూమయ్య రామయ్య నల్ల దయ్యం లాంటి రాజి కుక్క - యముని వాహనం లాంటి మహిషం భయంకరమైన దున్నప్పోతు ఒక బర్రె -చల్లని సంతానం తో ఇంట్లో పాల కొరత లేకుండా -దానికి పుట్టిన 9 గేదెలు కూడా చిక్కని చక్కని పాలు సమృద్దిగా ఇచ్చేవి --మొదటి నుండి లచయ్య పంతులు అంటే రాగంపేట లో మంచి పేరు ఉంది ధర్మాత్ముడు -తండ్రి దుర్మార్గానికి బలి అయ్యాడు - అని ! ఆది అమ్మను కాపాడింది -తాత అనబడే త్రాచుపాము పాడగా నీడ మా మీద పడకుండా మా కుటుంబాన్ని కాపాడింది

-దానికి తోడూ -మా అమ్మ కున్న దైవ భక్తి -దాతృత్వం దాన గుణం దయప్రేమ మాకు శ్రీరామ రక్షా అయ్యింది -ఏదైనా -ఎంతైనా - దేని గురించిన చెప్పవచ్చు కాని తండ్రీ తల్లి రెండు తానయ్ ఉన్నంతలో దేనికీ లోటు రాకుండా చేసిన మా అమ్మ మనసు చాలా గొప్పది -కుస్తురోగం దేహాన్ని క్రుంగ దీస్తోంది -తగ్గిందనుకున్న వ్యాది ప్రభలమైంది- ఎన్ని ఇబ్బందులున్నా తులసి పూజ బ్రాహ్మణ గౌరవం సత్కారం ఉపవాసాలు ఆహారనియంత్రణ మాత్రం మానలేదు
ఇప్పుడే బాపన్నకు సంబందాలు వచ్చాయి -వెలిచాల గోపాలరావు గారి మూడవ అమ్మాయి తో పెళ్లి జరిగింది తాత చిన్నాయనల ఆద్వార్యంలోనే ---

Comments

Popular posts from this blog

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...