Skip to main content

Part - 39

చెప్పుడు మాటలు - అనుభవం లేని తనం -చిన్నాయనల ఆజమాయిషీ అటు వాళ్ళు ఇటు మేము - రెండు వైపులా చూసు కోడానికి బాపన్నకు వయసు చాలడం లేదు -పత్వారిగిరీ అంటే మాటలు కాదు -భద్రయ్య బాపుకు తెలవకుండా ఎ పనీ జరగదు - అప్పుడు ఆయన పెద్ద లీడర్ - పైరవీకారు -వతన్దారీ సంఘానికి ప్రెసి డెంటు -తహసీల్దారును డైరెక్ట్ గా కలిసి తన పైరవీ పనులు -ఇతర పటారీ లా పనులు చేసి మాట తోనే చేసి పెట్టేవాడు పట్వారీ లలో మాలీ పటేల్ లలో పోలీసు పటేల్లలో అందరు అతన్ని కలిసే వాళ్ళు ఇబ్బందులు చెప్పేవాళ్ళు -ఇలా అతనికి ఊరిలోనే కాదు జిల్లా లో మంచి పేరు సంపాదించాడు -పైరవీ చేయడంలో దిట్ట అనీ --హైదరా బాడు కెళ్ళి కూడా పనులు చేసుకోస్తాదన్న పేరు పొందాడు
ఇంతపేరు బలము ఉన్న మనిషికి బాపన్న అణకువగా ఉండటం మామూలే కదా -!
కాని ఆయన అండ చూసుకొని తాత మిగతా చిన్నాయనలు మా బాపు పేరు మీద ఉన్న 500 ఎకరాల ఆస్తి కౌలు దార్ల పేరు చేశాడు -కొంత అమ్మించాడు కొంత తమ పేరు మీద మార్చు కున్నాడు -ఇప్పుడు మాకున్న ఆస్తి కేవలం 5 ౦ ఎకరాలు మాత్రమె -
ఒక సంఘటన మాత్రం పరమ దారుణం గా నా కళ్ళ ముందే జరిగింది - భద్రయ్య బాపు రాయించిన కౌలు దారు లలో బీరం రాజయ్య పల్లె లోని పల్లె కిష్టయ్య అనే వాడు --ఆయన చెంచా గాడు- చాలా మొరటు మనిషి బాపన్నను తలపై కట్టే తో కొట్టాడు -వాళ్ళు భద్రయ్య అండ చూసుకొని చేను ఐదు నాగళ్ళతో దున్నుతుంటే బాపన్న ఆవేశంగా అడ్డం వెళ్ళాడు -నేను నీకు అమ్మ లేదు -పట్టా మా పేరు ఉంది -నీకేం అధికారం ఈ చేను పై అని కోపం గా వాళ్ళ నాగాల్లకు అడ్డం - దున్న నీయకుండా నిల బడ్డాడు - అంటే వాడు వచ్చి కర్రతో కొట్టాడు -నెత్తురు చిమ్మింది బాపన్న తల ఆ దెబ్బతో --కింద పడి పోయాడు స్పృహ తప్పాడు కూడా --అప్పుడు రామచందర్ రావు కూడా ఉన్నాడు --మా బాపు లక్షెట్టిపేట లో వ్యాధి తో ఉన్నపుడే బాపు పేర మీద ఉన్న భూములన్నీ కౌలుదార్ల పట్టా చేయించాడు భద్రయ్య పంతులు -బాపు మీది కక్ష్యతో -
మీ బాపునే వాళ్ళు కట్టేసి కొట్టిండ్రు --మీరు పిల్లగాండ్లు -వాళ్ళ దుర్మార్గం కింద మీరెంత - నర రూప రాక్షసులు వాళ్ళు చంపించినా చంపుతారు ఆస్తికోసం -వాళ్ళ జోలికి పోకుండ్రి--!అన్నాడు రామచందర్ రావు మా హితం కోరి -
అమ్మ కూడా చాలా భయపడ్డది --ఆ రోజినుడి బాపన్న చేతులు కట్టేసింది -మీరు చల్లంగా ఉండాలిరా -వాళ్ళు బాపును హర హర గోస పుచ్చు కున్నారు -ఎంత కైనా తెగిస్తారు జాయి దాడు కోసం వాళ్ళు ఎంత భూమి కావాలంటే అంత కాల పెట్టు వాళ్ళ మొకాల మీద అంది
అన్నట్టుగానే - ఉన్నాస్తిలో సగం భద్రయ్య కు -మిగిలిన సగం మాకు పంచాడు -ముసలి తాతగారు -పండి వాగు పక్కన చకని దోఫస్లా పొలం అతనికి పోయింది -అతని అల్లుడు గంగాధర్ అప్పుడు ఆరు లక్షలకు అమ్ముకున్నాడు -మా కళ్ళముందు -ఆ పాటి విలువ కాదు మా ఆస్తి అంతా కలిపితే --
ఇలా తాత గారికి మనవలమైన మాకు ఆస్తి పంచి సంధి కుదుర్చుకున్నాం -మమ్మల్ని వాళ్ళు ఎమన్నాఆ చేస్తారన్న భయంతో -ఇదే రాయబారం లేదా సంధి వాళ్ళతో మా బాపు కుదుర్చుకుంటే అతని ప్రాణం దక్కేదేమో !పాపం మాకు ఆస్తి ఉంచాలని తను ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
ఆస్తి దక్కలేదు -ప్రాణము పోయింది -వీరయ్య పంతులు కు -తనను పెంపకం తీసుకున్న ముల్యంగా తన కుటుంబాన్ని బజారు పాలు చేసుకున్నాడు -మాటకోసం నిజాయితీగా -అల్లా కోరి కష్టాల పాలయ్యాడు -తను కష్ట పడ్డాడు తన భార్యా పిల్లాలను కష్టాల పాలు చేసాడు -తను దిక్కు లేని వానిగా అత్తారింట్లో తనువూ చాలించాడు -- ఇదంతా దేనికోసం ? ఎవరికోసం ? ఏమి సాధించినట్టు ? ఈ కథ సారాంశం ఏమిటి?
ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చేది ఎవరూ? అలనాడు కౌరవ సభలో ద్రౌపది --నన్ను ఫణంగా ఒడ్డడానికి ధర్మజునికి ఒక్కనికే ఏమి అధికారం ఉంది ?- ఈ రెండు భారతాలలో అప్పుడు ద్రౌపది -ఇప్పుడు మా అమ్మ ! బాపన్నకు వచ్చినట్టే ఆవేశం కట్టలు తెంచుకుని వస్తుంది -భీమ అర్జునులకు వచ్చినట్లే - రక్తం ఉడికి పోతుంది త్జరిగిన పరాభవం తలచుకుంటే -ఒకటే తేడా అప్పుడు యుద్ధం జరిగింది ఇప్పుడు జరగా లేదు
అప్పుడు ధర్మానికి అండగా శ్రీ కృష్ణుడు నిలిచాడు -కాని ఇక్కడ అండగా ఉన్న రామచందర్ రావును పుటిగా తొలగించారు --బాపన్న నిస్సహాయు డయ్యాడు- చెప్పుకోను దిక్కు గాని ఆదరించే నాథుడు కాని లేరు -అందరు -రాగం పేట ఉరివాళ్ళు కూడా వారి దుర్మార్గానికి భయపడి నోరెత్తలేదు అందులో మాసాంబయ్య పుల్లయ్య మెట్త్రామయ్య కిస్టన్న లచ్చన గార్లు కూడా ఉన్నారు -పేరుకు పట్వారి బాపన్ననే కాని పెత్తనం అంతా భద్రయ్య దే ! బాపన్నకు రాగంపేట ఊరిలో తహసీలు డబ్బు వాసులు అయ్యేదికాదు --తన జేబులోంచి లేదా భూమి అమ్మి బాకీ తెచ్చి కట్టే వాడు -ఈ విధంగా లాభాలు కాక చాలా నస్తాపోయ్యాడు ఆర్థికంగా బాపన్న
సీనన్నకు నెలకు !00 రూపాయలు అసల్దారు పేరు మీద సీనన్నకు ఇచ్చేవాడు చిట్యాల పల్లి గుమాస్తా సంజీవరావు -ఇలా ఆరు నెలలు గడిచాక 3000RUPAAYALu అప్పుగా భద్రయ్య బాపన్నకు ఇప్పించాడు రాగంపేట తాసీలు కట్టలేదని --సీనన్న్కు వచ్చే డబ్బుకు ఇలా గండి కొట్టడం దానికి సీనన్న ఏమి స్పందించక పోవడం చూసి నేనే అడిగాను ఇదేమి అన్యాయం అని ?వాడు ఇచ్చిండు వీడు తీసుకున్నాడు నడుమ నాదేమున్నది -ఒక మాట తప్ప అని తప్పించు కున్నాడు ఆయన --ఇలా కయ్యాలు పెట్టె జిత్తుల మారి అతని నైజం-
బాపన్న పెళ్ళికి పీటల మీద ఇంద్రమ్మ భద్రయ్య కూర్చున్నారు -పెళ్లి పెద్దలు వాళ్ళే -మేనమామలు రాలేదు - సంబంధం మాట్లాడింది వాళ్ళే అక్కడినుండి వారిదే పెత్తనం - మర్యాదలు వారికే మాటా ముచ్చటా వారి ఇంటి లోనే - అప్పుడు అమ్మ కూడా వారికి భయపడింది -ఏమి ఎదురు మాట్లాడ లేదు వారిది ఆడింది ఆట పాడింది పాటా గా అట్టహాసంగా జరిగింది -బాపన్నను చెప్పు చేతుల్లో పెట్టుకుని వ్యవహారం జరిపించారు -ఫలితంగా బాపన్నకు చదువు అంటలేదు డబ్బు దక్కలేదు భూమీ నష్టం వ్యవసాయం కూచి అయింది అప్పుడు వానలు కురవకా పంటలు నస్తాపద్దాం తిండికి కష్టపడ్డం-బావులు తవ్వడం LMB లో అప్పు తెచ్చి బాకీ కట్టలేక భూమి అమ్మడం భూమిపై తాకట్టు పెట్టి అప్పు తేవడం -జరిగింది -
ఇదే సమయంలో బాపన్నకు ఇద్దరు పిల్లలు కావడం - సీనన్నకు సంబంధం రావడం కటికేనపెల్లి పురుషోత్తం రావు అన్న వెన్నం పల్లి వెంకటేశ్వర్ రావు బిడ్డ ఖాయం కావడం -జరిగింది అయితే ఈ సారి మాత్రం సీనన్న పెళ్ళికి పీటల పై సాంబన్న మామ దుర్గత్త దంపతులు కూర్చుండ పెట్టింది అమ్మ - ఇప్పటినుండీ కస్టాలు నష్టాలు మొదలైనాయి -పీల్లిలో సీనన్నకు వచ్చిన ఏడు తులాల బంగారం బావులు తవ్వించడానికి వ్యవసాయంలో సీనన్న ఖర్చు చేశాడు -అదేమి కరువో కాని ఇంట్లో అన్నం లేక గటక తిని పడుకున్న రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి
అంతెందుకు నా పెళ్ళిలో వచ్చిన డబ్బు 3000 రూపాయలు కళ్ళెం వెంకటరెడ్డి కి బాకీ కింద కట్టిన విషయం నాకు గుర్తుంది -ఇలా మా కష్టాలు నష్టాలు చూసి సీనన్న మామ గారు సీనన్నకు ఇవ్వాల్సిన బంగారం ఇవ్వకుండా --ఇస్తే అమ్ము కుంటా రనీ -పడి తులాల బంగారం ఆయన బావ మరిది హరి హర రావు వద్ద దాచాడు ఆయన కొడుకులే శివాజీ శ్రీకాంత్ --నాగరానికి మేనబావలు-అయతే దొంగలు ఇంటిలో పడి ఆ బంగారం దోచుకున్నారని -ఆది పోయిందన్నారు ఆది వేరే విషయం - మొత్తానికి మా సంసారం పీకలదాకా నష్టాలతో అప్పుల్లో కురుకు పోయింది
నా పెళ్లి సమయానికి -ఆర్థికంగా చితికి పోయాం -పత్వ్వరిగిరిలో కష్టం వ్యవసాయంలో నష్టం -మేత లేక పశువులను అమ్ముకోడం పాదిలేక పాలు కొనడం -లాంటి దుస్తితి దాపురించింది -
సీనన్న పెళ్లి నాటికి నా చదువు కరీంనగర్ కి వచ్చింది -మంగమ్మ ఇల్లే దిక్కు -అవే కస్టాలు అదే అగచాటు -అవే అవమానాలు -ఇలా PUC DEGREE చదువులు ఆమె ఇంట్లోనే పూర్తీ అయినాయి -చిన్నయనల బాధనే కాని -ఆమె వల్ల నాకు బాధ కలగ లేదు ఆమె నన్ను ఆదరించింది అన్నం పెట్టింది -ఆమె అలా నన్ను ప్రేమగా చూడక పొతే బహుశా నా చదువు అర్ధాంతరంగా ఆగి పోయేదేమో - దేవుని దయ తల్లి దండ్రుల దీవన వల్ల నాలుగు సంవత్స రాలు చక్కగా గడిచాయి -అంటే ఇబ్బందులు లేక కాదు చదువు మధ్యలో ఆగలేదు -అంతే అదే ఇప్పుడు అన్నం పెట్టింది
లక్షేట్టిపెటలో ౧౦తరగతి వరకే ఉంది - సెకండ్ క్లాస్స్ లో పాసయ్యాను -చదువు లక్షేట్టిపెటలో కాని సెంటర్ మాత్రం కరీంనగర్ లో -నన్ను పెద్ద మామతో సహా టీచర్లు కూడా నా తీరు చూసి సంతోష పడ్డారు -అప్పుడు ఫస్టు క్లాస్స్ రావడం చాలా అరుదు -
అంత వరకు నాది తెలుగు మీడియం -ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం PUC CHADUVU లో ప్రారంభం అయ్యింది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...