Skip to main content

Part - 38

మా బాపన్న పెళ్లి నిరాడంబరంగా జరిగింది -తాత వాళ్ళ ఆధ్వర్యం కనుక పెద్ద మామ వాళ్ళు రాలేదు --సాంబన్న మామ ఒక్కడు వచ్చాడేమో -? అసలే వెలిచాల గోపాల్ రావు -చాలా పొడుపు మనిషి -ఈ ఒక్క విషయంలో మాత్రం అతనికి అతడే సాటి -పైగా ఆయనకు ఏడుగురు కూతుళ్ళు -అల్లా అని ఆయనేం ఆస్తి పాస్తులు ల్లేక పోలేదు -గరిష కుర్తి వెలిశాల -కలుపుకుని ఆయనంత శ్రీమంతుడు మన ఇళ్లల్లో ఎవరూ కనబడరు --ఈ పొదుపరి తనంతో -మంచి డాబు దర్పం ఠీవి -కన బరిఇచే వాడు.

ఒకసారి బాపన్న -ఈ గోపాలరావు మామ -అనుకోకుండా కరీంనగర్ లోని గీతా భవన్ హోటల్ లో ఒకరికొకరు -ఎదురెదురుగా -కుర్చీల్లో తారస పడ్డారు -ఇక టీ -తిఫ్ఫిన్లకు ఆర్డర్ చేశారు -అంతా అయ్యాక ఎవరి బిల్లు వారు ఇచ్చేశారు -పిల్లను ఇచ్చిన మామ -అల్లుని బిల్లు అల్లునిచేతనే కట్టించాడు --ఎక్కడైనా అల్లుడే కాని --హోటల్లో మాత్రం కాదు --అంత గొప్పగా పొడుపు నియమాన్ని పాటించే వారు -మరెవరు ఉండక పోవచ్చు -ఒక్క మన గోపాల్ రావు మామ తప్ప -! నిజానికి -ఇది వాళ్ళు ఎవరైనా చదివితే అపార్దం చేసుకోవచ్చు --కాని ఇంత పేరు సంపాదించింది -వారు ఈ ఒక్క విషయంలో అని మాత్రం చెప్పవచ్చు --ఆయన ఇంట్లో ఎన్ని తాళాలు ఉండేవో -ఎంత కట్టుబాటులో -తన కను సన్నల్లో భార్యా పిల్లాలు పాలేర్లు -అల్లుళ్ళు -తాను ఎలా అణకువగా ఓడిగేవారో --చాలా చిత్రం- అయితే వారు కరిమ్నాగార్లో గొప్ప ఆస్తులు సంపాదించారు -దానికి చాలా మెచ్చుకోవచ్చు -చివరకు తన అల్లుళ్ళ కందరికీ - ఉండటానికి ఇల్లు -ఇచ్చాడంటే -చాలా ముందు చూపు ఉన్న వాడని అర్థం కదా.

ఈ మామ , మా బాపన్న -ఒకటే తేడా -ఆయన తెల్ల్లటి బట్ట లు ధరిస్తే బాపన్న -ఏదో వేసుకుంటే చాలు -తెల్లగా ఉండే అక్కరలేదు -అనుకుని -కొత్త బట్ట లను అంతగా పట్టించు కునే వాడు కాదు --ఇది మాత్రం మా తాత చిన్నాయనల వద్ద నేర్చుకున్నదే -ఎప్పుడు -సింపుల్ గానే సామాన్యం గా ఉండే వాడు - అన్నయ్య బాపు బీడీలు కాల్చే వాడు -బాపన్నకు ఈ అలవాటు అబ్బింది అసలే బక్క పలుచని చిన్న ఆకారం -దీనికి తూడు గంట బీడీలు -రోజుకు ఒక కట్ట -కట్టలో కనీసం ఇరవయ్ నాలగు బీడీలు ఉండేవి -chain smoker గా మారాడు -ఎవరు ఎంత చెప్పినా వినలేదు -మా అమ్మ ఒక లక్ష సార్లు చెప్పింది --నీ దగ్గర బీడీల కంపు కొడుతున్నదిరా -బీడీలు తాగోద్దురా --నా మీద ఒట్టురా -అనేది --అయినా ఆటను వినిపించు కోలేదు --వ్యసనం ఎన్నట చెడ్డదో -ఎంత నస్తపరుస్తుందో- -బాపన్న చివరి దశలో -ఎంతగా నంజు దగ్గు -దమ్ము తో బాద పడ్డాడో అనుభవించే వారికే తెలుస్తుంది -అది ఒక్కటే మా బాపన్న బలహీనత -దానికి కారణం అన్నయ్య బాపు అని చెప్పక తప్పదు -ఇద్దరు కలిసి కుర్చుని గంటల తరబడి బాట ఖాని చేస్తూ బీడీలు కాల్చే వాళ్ళు -మధ్యలో అన్నయ్య బాపు మానేశాడు కాని బాపన్న మానలేదు - ఆయన మనవరాలు - స్వరూప కూతురు -బాపురావు -! బీడీలు బందు పెడతావా లేదా ! అంటే-అప్పటినుండీ బంన్డు పెట్టాడు కాని అప్పటికే వేల మించి పోయింది -అతని ఉపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి -చివరికి అకస్మాత్తుగా - ఆవ్యసనం.....! -విధి బలీయం అంటే అదేనేమో !దేనికైనా ఒక కారణం ఉండాలేమో --

బాపన్న పెళ్ళయ్యాక -బుజ్జన్న పుట్టాక మా అమ్మకు వ్యాధి ప్రభలి నొప్పి తీవ్ర మైనది -కాలు కింద పెట్టనీయక పోయేది -భరించ రాని నొప్పి -రాగంపెతలోని వైద్యులు వంజరి శివయ్య -అలిశెట్టి చంద్రం -చేశారు వైద్యం -లాభం లేక పోయింది -కరీం నగర్లో అప్పుడు ఈ కుష్టు వ్యాధికి చికిత్స హాస్పిటల్ లేదు -ఇక హైదరా బాదు కు అమ్మను బాపన్న తీసుకెళ్ళాడు మ్యాడారం మనోహర్ రావు సహాయంతో --ఎక్కడ చూపించినా లాభం లేదు మోకాలు వరకు కాలు తీసేయ్యాలి --లేదా -కాలంతా కుష్టు వ్యాధి సోకి -చివరికి ప్రాణం తీస్తుంది అన్నారు -ఉస్మానియా -అఫ్జల్ గంజ్ లాటి పెద దవాఖానాలో - నేను కూడా వారితో ఉన్నాను - మూడు రోజులు ఈ విధంగా నగరమంతా తిరిగాం అమ్మ ను తీసుకుని - అమ్మ మేము ఒకటే ఏడుపు -దేవుడా నీవు ఉన్నావా అంటూ !
ఆఖరికి చిరాగల్లీ లో -శాంతి నారాయణ్ మాథూర్ అని LEPRACY SPECIALIST DOCTOR ఒకరు దైవ వశాత్తు తారసిల్లాడు --అయన అమ్మ కాలు పుండు చూసి -భయ పడాల్సిన అవసరం లేదు -అని మందులు రాశాడు అభయం ఇచ్చాడు -ప్రతీ మూడు నెలలకొకసారి రమ్మన్నాడు మా అదృష్టం ఫలించి అమ్మ ఆరోగ్యం -బాగు పడింది -ఆ రోజు లగాయతు -అమ్మ అంత ఘోరంగా భాద పడిన క్షణాలు లేవు -తిండి కట్టు మందు లు విధిగా క్రమంగా మరచి పోకుండా వాడేది - వరుసగా అదే డాక్టర్ వద్దకు బాపన్న అమ్మను తీసుకెళ్ళాడు -

ఈ విధంగా అమ్మ ఆరోగ్యం బాగు పడటానికి బాపన్న చాలా శ్రమించాడు -బాపు పోయాక -అమ్మకు ఆశ్రయం కల్పించడమే కాక -తను కొండంత అండగా నిలబడి -ఉండటానికి ఇల్లు -- ధైర్యం బలం ఇప్పుడు ఆరోగ్యం -ఇంత కంటే అమ్మకు ఇంకేం కావాలి -అందుకే అమ్మకు బాపన్నా అంటే ఎంతో గురి -తను వండుకునే వంటల్లో శాకం పప్పు జల జల అన్నం నెయ్యి కండి పప్పు పెరుగు పలహారాలు -బాపన్నకు పెట్టందే తను తినేది కాదు -
ఇదే మాట బాపన్న చాలాసార్లు నవ్వుతు అనే వాడు -అరేయ్ -అమ్మ కష్ట పడ్డదీ అంటే -నేను లేనప్పుడు -! ఇప్పుడు అమ్మ సుఖపడుతున్నది అంటే నాతోని అమ్మ ఉన్నప్పుడు --అని అమ్మ ముందే అనే వాడు --చూడరా -అమ్మ ఎట్లా ముసి ముసి నవ్వు నవ్వుతున్నదో -దానికి తెలుసు -నేను ఏమి చేసిన్నో --! --వాస్తవమే -అమ్మకే కాదు మాకు కూడా ఆధారం ధైర్యం బలం ప్రాణం ఇచ్చింది మమ్మల్ని వ్యక్తులుగా శక్తిగా నిలబెట్టింది అతడే !

అమ్మకు బాపుకు అతడు చూపిన కృతజ్ఞత ఫలమే చక్కని సంతానం -అంద మైన ఆరోగ్యమైన గర్వకారణ మైన కొడుకులను కూతుళ్ళను ఇచ్చింది - మా రేవెల్లి వారి కుటుంబంలో మూల బలం -ముఖ్యమైన ఆభరణం -వెలలేని ధనం -మా అభిమాన ధనం - మా తండ్రి తల్లి అందించిన సంక్రమించిన తరగని ఆస్తి -ఈ సంస్కారం -సభ్యతా -మా కు అబ్బిన ఆత్మాభి మానమే -మాకు శ్రీ రామ రక్షా కవచం -భగవంతుడు ఆశీర్వ దించి ఇచ్చిన వరం --!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...