లవ కుశ సినిమాలో అన్ని అణిముత్యాలే పాటలు పద్యాలు కమనీయంగా హృద్యంగా ఉన్నాయి అలాంటి దృశ్య కావ్యం న భూతో న భవిష్యతి విధి విధానమును ఎవరు తప్పించగలరు ఎ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరు ---పాట
రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలూనే !...అంటూ విధీకి నెంచ అసాధ్యంబు విధికి గలదే ...!
నా చిన్నతనంలో 8 తరగతిలో బాలల బొమ్మల రామాయణం కొని చదివాను అందులో నన్ను కదిలించిన కన్నీళ్ళు తెప్పించిన
ఘట్టం భరతుడు తన తల్లిని దూషించిన తీరు ...!ఎన్నడైనా నేను నీతో నాకు రాజ్యం కావాలని కోరానా ..నా మనసు ఏమిటో నేనేమిటో నాకేం కావాలో అగ్రజునికి రామునికి తెలుసు వదిన సీతమ్మ తల్లికి తెలుసు కౌసల్య మాటకు తెలుసు కుల గురువు వసిస్తులవారికి తెలుసు నా కన్న తండ్రికి తెలుసు కాని నీకు మాత్రం కన్న కొడుకు మనసు తెలీదు ! నీవేం తల్లివమ్మా..!నేను చేయని తప్పుకు నన్ను బలి చేశావు నా చరిత్రకు కళంకం తెచ్చావు నా సోదరుల ముందు నా ప్రజల ముందు సేవకుల ముందు ప్రజల ముందు నన్ను తల దిన్చుకోనేలా చేశావే బయట ప్రపంచంలో నేనెలా తలెత్తు కొని తిరుగ గలను ..!
ఇంత హీనమైన ఆలోచన నా తమ్మునిదా అన్న రామన్న నన్ను తిరిగి ఆడరించేనా నేను బ్రతుకుట వ్యర్తము ఛీ చ్చీ
నీవు నాకు తల్లివి కావు ! నేను నీకు కొడుకుని కాదు ! ఈ జన్మలో నేను నీ ముఖము చూడను ! అంటూ బాధతో వెళ్ళిపోతాడు తాల్లి కైక వద్దనుండి .....---నా కు దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది నాకెందుకో ఇంత సున్నిత మనస్త త్వం దేవుడిచ్చాడు
అమ్మ ఇది గ్రహించిది ఇంత మెత్తని మనసు ౧చాల కష్టం రా ఈదటం ఈ కాలంలో ...అంది
ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తన కంటూ వ్యక్తిత్వాన్ని నిలబెట్టు కుంది మా అమ్మ --ఎవరికీ చేయి చాచ లేదు ఇది కావాలని అడగ లేదు ఆకలికి పైసలు లేకున్నా తన జీవి తాంతము అలానే ఉంది ఒకరికి ఇవ్వడమే కా ని అడిగింది లేదు తనకి ఉన్నదాన్లో తృప్తి పొందింది ఎపుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే దానిని దాచుకుని దేవునికో ముత్తిడువకో బ్రాహ్మనునికో ఇచ్చింది ఎన్ని ఉపవాసాలో తన కడుపు కట్టుకుని మమ్మల్ని సాదింది ఆమె ఒక సాద్వి కూటికోసం బట్టకోసం తనకు కావాలని ఎన్నడు ప్రాదేయపడలేదు ఆమె శీలం చాలా గొప్పది
-- విపరీతమైన అభిమానం అమ్మది ! ఒక్క మాట గూడా పాడేది కాదు గూడూరి దొరసాని ప్రాణం పోయినా కూటికి లేకున్నా మాట పడరు అని నవ్వుకుంటూ గమ్మత్తుగా అనేవాడు
ఎ ఇంటినుండి బయటకు భర్తతో సహా ఎ నాడు పిల్లలతో వెళ్లి వచ్చిందో మళ్లీ ఆ గడప త్రోక్కలేదు మాటంటే అంత పట్టింపు ఆమెకు ఏది ఏమైనా పాళీ వాళ్లకు తన మొహం చూపలేదు వాళ్ళను గత్యంతరం లేక దారిలో తారస పడితే మొహం తన కొంగుతో చాటు చేసుకునేది
వారికి తను బ్రతికి నన్నాల్లు మాట్లాడ లేదు వారి మొహం చూడలేదు తాత వెంకటమ్మ చిన్నాయనలు చిన్న్నాయిలు పోయినా దూరంగానే ఉంది అంత పట్టుదల గల మనీషి అమ్మ అన్నీ కష్టాలే ఆమె జీవితంలో మా అమ్మ పడిన కస్టాలు ఎవరూ పడలేదేమో రామాయణంలో సీతలా అరణ్యంలో వన వాసంలో ఉంది భారతంలోని ద్రౌపదిలా అవమానం పాలైంది ఆఖరు క్షణం వరకు ఆమెను త్రాచు పాములా వెంటాడిన కుష్టు వ్యాది ఆమెను కడుపు నిండా తిన నివ్వ లేదు త్రాగా నివ్వలేదు కంటి నిండా నిద్ర పోలేదు ! పాపం పెరుగు పప్పులు నేయి మామిడి పండ్లు టీ కాఫీ పాలు అన్నిటికీ దూరం గా ఉంటూ పులుసు తోక్కులతో శాకాలతో కడుపు నింపు కునేది
ముఖ్యంగా తను ఎవరినీ మాట అనేడికాదు భరించలేని బాధ కలిగితే తప్ప కోపాని కోచ్చేదికాడు
దేవుడు మందిచ్చాక సుందిళ్ళ నుండి తిరిగి లక్షెట్టి పేటకు వచ్చింది మా ఇద్దరినీ వెంట పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే అసలు కథ ప్రారంభ మైంది ఎంత కాలం చెడి పుట్టింట్లో ఉండటం ! ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళ గాథను భరించటం ..దేవుడిచ్చిన మందులో సగమే తాగింది కనుక వ్రణ శేషం చాలా బాధ పెట్టింది
లక్షెట్టిపేట కు గత్యంతరం లేక రానైతే వచ్చింది కాని అంతకు ముందు కంటే సమస్యలు ఎక్కువైనాయి ..పీడా పోయిందను కుంటే మళ్లీ దాపురించింది అనుకునే వాళే --యాష్ట పడనారంభించారు నీడ పదనివ్వడం లేదు కన పడితే చీత్కారం నిర్లక్ష్యం .--మనిషికి సమాజంలో విలువ హోదా డబ్బు బలగం పరపతిని బట్టే ఉంటుందికద ౧ ! నిలువ నీడ లేదు ఆదరించేవాడు లేడు
అప్పుడు ఇద్దరు మామలకు కొత్తగా పెండ్లి అయినాయి పైగా ఉద్యోగ అన్వేషణ లో ఉన్నారు పెద్దమామ అంటే గజ గజ వణకే వారు ఆయనకు కనపడే వారే కాదు వారి పరిస్తితి యె అలా ఉంటె మిగతా వారు నోరెత్త లేరు -అంత భయ పడే వారు ఆయనంటే
గజ్జెల చప్పుడు వినపదిందంటే చాలు ఎక్కడి దొంగలు అక్కడనే ! ..అమ్మ నేను మేము ఇంటి వెనకాల ఇప్పుడు శరత్ నీరజ ఉంటున్న ఇంటి అడుగున ఒక పందిరి ఉండేది దానికింద మా నిద్ర తిండి బస ! దొంగల్లా తింటూ ఎవరికీ కనబడ కుండా తిరిగే వాళ్ళం బడి లేదు గుడి లేదు అంగీ లాగు లు లేవు చాలా దయ నీయంగా ఉండేది మా బ్రతుకు ! అమ్మ కాలి పుండు సరే సరి ఆది అమ్మను ఇంకా అలాగే బాధ పెడుతూనే ఉంది అమ్మ ఎవరితో మాట కాని కన బడటం కాని లేదు వైద్యం అసలే లేదు పుండు చీముకు వస్తుందని ఏమి తినేది కాదు
Comments