Skip to main content

పార్ట్ 7

కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్తమో సత్యమో ! తలపన్నేరక యున్న దాననో యశోదా దేవినే గానో ! బాలకున్దేంట యాతని హ్రుదయాస్తాలంబై అజాన్డంబున్డుట కేమి హేతువో -----
భక్తి అంటే చాలా నిర్వచనాలున్నాయి అందులో ఒకటి దేహాభిమానం లేకపోవడం ఆకలి దప్పి రుచి నా వారు పదార్టాలపై ఆసక్తి లేకపోవడం బందు ప్రేమ వ్యామోహం నేనిది తినాలి నాకిది కావాలి నాకి చీర నగలు అవసరం --ఇలాంటివన్నీ అమ్మ త్యజించింది మనసా వాచా భగవంతునికి దగ్గరైనది అందరు సమానులే ఎవరు శెత్రువులు కాదు ఇలాంటి వైరాగ్య భావన ఒంట బట్టింది కోరిక తీరక చాలా మంది దేవుణ్ణి మరచి పోతారు కాని మా అమ్మ అలాకాదు చివరి శ్వాస వరకు దేవుణ్ణి మరవలేదు ఇంకా వారానికి పరమ పదానికి పోతుందని డాక్టర్ చెప్పాడు చేతులు ఎత్తేశాడు మనికన్త్త దవాఖానా నుండి విముక్తి కలిగింది బయటకు వెళ్లి వస్తుండగా అమ్మ నా చేతలో చేయి కలిపింది ఖర్చు పెట్టకు స్వయంగా కష్ట పడకు భాద పడకు భయ పడకు రా ! అని నాకు ధైర్యం చెప్పింది .
నీకేం కావాలమ్మా ? అంటే ఏమీ వద్దు రా ! కాశ్మీర్ గడ్డలో మన ఇంట్లో తులసి చెట్టు ముందు వెనక రూంలో నన్ను ఉంచు ! చాలు ! నీకు చాతనైతే రోజు భాగవతంలో ఒక అధ్యాయం చదువు ! అని కోరింది అయినా ఆశ చావక నేను గ్లూకోజ్ ఎక్కించాలని ప్రయత్నం చేశాను నాకు దండం పెట్టింది ఇక చాలురా అంటూ ! అయినా బేల కాలేదు ఆమె పుణ్యం ఆమెను కాపాడింది ఆమెకు ప్రాణ ప్రద మైన కొడుకు బాపన్న నమకం చమకం తో శివాభి షేకం చేస్తుండగా వింటూ చూస్తూ బాపన్న చేతిలో ప్రాణాలు విడిచింది మా బాపన్నకు తండ్రి సేవకు చివరి చూపుకు నోచుకోకున్నా తల్లి సేవలో తరించాడు తల్లికి ఆ తల్లి కిష్టమైన కొడుకు సీనన్న కి కర్మ కాండలుస్వయంగా చేసి మాత్రు ఋణం తీర్చు కున్నాడు అటు తండ్రికి చేయలేని కర్మ కాండ సీనన్నకు జరిపి భ్రాత్రు ఋణం తీర్చుకున్నాడు మా కుటుంబ సభ్యుల్లో అందరి కన్న ధన్యుడు మా బాపన్ననే ! తను కష్ట పడుతూ మమ్మ్మ్మల్ని సుఖ పెట్టాడు --బాపన్న గురించి చెప్పాలంటే నా జీవితం చాలదు !
అమ్మ జీవితం లో ఎ రోజు భగవన్నామ స్మరణ మానలేదు మారవ లేదు . అదీ కాని లక్షెట్టిపేట కాని కరీం నగర్ కాని హైదరా బాద్ కాని ఎక్కడ వున్నా ఎవరే మనుకున్నా దైవాన్ని పూజించడం భజించడం క్రమం తప్ప్పకుండా కొనసాగించిది ప్రతిదినము సుప్రభాత సమయంలోనే మా బాపు రామ నామ సంకీర్తనలో లీనమై తన్మయం తో పాడుకున్నట్టుగానే అమ్మ కూడా తన భర్త అడుగు జాడల్లో నడచు కొంది . దాదాపు తెల్లారే సరికి రామా మేలుకో హరీ మేలుకో ! అంటూ పదహారు కీర్తనలు పడుకునేది
అందులో భాగవతంలోని పద్యాలు రుక్మిణి కల్యాణం అమ్బరీశో పాఖ్యానం గజేంద్ర మోక్షం నిత్యం ఆలపించేది
ప్రక్కన పడుకున్న వారికి ఇది వారి గాడ నిద్రకు భంగంగా అనిపించేది ! ఇక చాలదా అమ్మా నోరు నోస్త లేదా మళ్లీ చదువుకో వచ్చుగదా ఇంకెంతసేపు చాడువుతావే ! అబ్బబ్బా ! నిద్ర పోనిస్తలేవే! అంటూ గోనిగిన రోజులు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి ! ఒకసారి సాంబన్న మామ మా అమ్మ పద్యాలు పాడడంలో పోటీ పడ్డారు నేనే లెక్క పెట్టాను ఎవరెన్ని పద్యాలు పాడారో ౩౫ వరకు మామ పాడాడు అమ్మ చదువు కుంటూ నే పోయింది నూరు దాటాయి నేను లెక్క పెట్టడం మానేశాను నోరు నొప్ప్పి పెట్టడానే అమ్మా ! అంటే దానికి పద్యం లోనే జవాబు చెప్పింది ---నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని ---దయయు సత్యంబు లోనుగా దలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు ! అని ...
ఉపవాసాలు ఏకాదశి వినాయక్క చవితి బతుకమ్మ ప్పండుగా నరసింహ జయంతి దీపావళి అట్లా తదియ శ్రీ కృష్ణాష్టమి తులసి పూజ క్కార్తిక మాసంలో ఉదయం లేవడం స్నానం పూజలు నాగుల చవితికి పుట్ట చుట్టూ చేక్కించడం అలికించడం ముగ్గు పెట్టడం పుట్టలో పాలు పోయడానికి వచ్చే వారికి సౌకర్యాలు కలిగించడం తను దీక్షగా ఆ రోజు ఉపవాసం చేయడం మార్గశిర మాసం లో చక్కర పొంగలి పాయసం నైవేద్యం పెట్టడం ఇలా ఎ ఒక్క పండుగ నైన శ్రద్దగా చేస్తూ అందులో పరమాత్మసందర్శనం చేసుకునేది
కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్తమో సత్యమో ! తలపన్నేరక యున్న దాననో యశోదా దేవినే గానో ! బాలకున్దేంట యాతని హ్రుదయాస్తాలంబై అజాన్డంబున్డుట కేమి హేతువో -----ఈదశమ స్కందంలోని పద్యాలు చదువుతూ కళ్ళు మూసుకొని బాహ్య ప్రపంచాన్ని మరచి చదువుతుంటే ఇంత పారవశ్యాన్ని అంతా గమనించే వాళ్ళం
అనితర సాద్యం ఆ తాదాత్మ్యం !

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...