Skip to main content

పార్ట్ 6

నిజానికి అమ్మ తను బ్రతికి బట్ట కడుతా ననుకోలేదు . రెండు కాళ్ళు పుండ్లు వానిలోంచి పడే పురుగులు ఇతరులకు కాదు తనకే అసహ్యం రోత వాసన ! ఎంత ఘోరమైన అవస్త భాద నరకం అనుభవించిందో ఆ భగవంతునికే తెలియాలి . ఇతరులకు కాదు తన బ్రతుకు తనకే భారమైన దుస్తితి మాన సికంగా శారీరకంగా చాలా క్రుంగి కృశించి పోయింది
బ్రతుకుపై విరక్తి తో చావాలనుకునే నిశ్చయించుకుంది అదీ స్వామీ సన్నిదిలో ! అన్యదా శరణం నాస్తి ! త్వమేవ శరణం మమ ! అంటూ భాగవతంలోని గజేంద్రుని వలె ఈఘోర మైన దుర్భర నరకాన్ని భరించలేకున్నాను !
లావొక్కింతయు లేదు! ధైర్యంబు విలోలంబయ్యె ప్రాణంబులున్ తావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప ఇత -పరంబెరుగా మన్నిం పన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర ! కావవే వరద ! సంరక్షింపు భద్రాత్మకా !----
అంటూ నోరార ఎలుగెత్తి పిలిచితే ఎందుకు దిగిరాడు ! అతడున్నది ఎందుకు ? ఆర్తులు ఆర్ద్రతతో పిలిచినప్పుడు --శరణాగత వత్సల రక్షణ బిరుదులు గల్లవాడదిగో చూడూ ! దిగివచ్చాడు జగజ్జనని తో సహా ! ఆ గుడిలో అర్ధ రాత్రి అమ్మ పడుకొని వింటోంది దివ్యమైన కాంతి గర్భ గుడిలోంచి రావడం చూస్తోంది ! అమ్మ పలుకులు స్వామీ అనునయ వాక్యాలు అమ్మకు విన బడుతున్నాయి -- ఇక దాని కస్టాలు గట్టేక్కినట్టే ననుకో ఆస్తి కొడుకు ఆప్తులు అందరు చేరువవు తారు ! ఈ కుస్టువ్యాది కి మందు ఇస్తున్నాను
క్రమంగా తగ్గుతుందిలే! ఇలా అస్పష్టంగా మెల్లిగా చెవిలో చెప్పినట్లుగా ఒక స్వప్నంలా తెల్లవారు ఝాములో వినపడింది
సంతోషంతో పూజారికి చెప్పింది నర్సయ్య గారన్నాడు తారక్కా !ఇక భయం లేదు నీకు దేవుడు మందు పోశాడు అభయం ఇచ్చాడు స్వామీ దర్శనం కూడా కలిగింది అమ్మ వారి పాటను విన్నావు .--నీయంత పున్యాత్మకుల్ గలరే ! నిజంగా నీవు ధన్యు రాలివైనావు ! నీ మొర అమ్మ అయ్యా ఇద్దరు విన్నారు ! ఇలా మనం మాట్లాడుకున్నట్లుగా స్వామీ
నీతో చెప్పడం ఇది కలా! నిజమా నాకు అర్థం కావటం లేదు అని ఉళ్ళోవారందరికీ చెప్పాడు అంతా సంతో షించారు దీక్ష ఫలించింది అన్నారు -
ఇదంతా సుందిళ్ళ గ్రామ భక్తుల గొప్పదనం రేపల్లెలో కృష్ణుడు వెలసినట్లుగా ఇక్కడ స్వామీ స్వయంభువుగా ఆవిర్భ వించాడు ఈ అమ్మనే కాదు స్వామీ సేవలో తరించిది
వారంతా ఇప్పుడు ధన వంతులయ్యారు ఉద్యోగాలోచ్చాయి ఎంత గా పంటలు వర్షాలు భూమికి ధరలు లేక నీటికి కూటికి అవస్త పడ్డారో ఇప్పుడు అంతా హాయిగా సుఖంగా ఉన్నారు కాని ఆనాడు ఈనాడు స్వామి సేవను మరవడం లేదు సెలవు రోజున క్రమం తప్పక రోజు వారిగా వంతుల ప్రకారంగా భజన చేస్తారు ! అన్న దానం ఊరేగింపు తమ సంపాదనలో కొంత స్వామికి అర్పించడం --అందరు ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని తమ పనులు ఉద్యోగాలకి వెళ్తారు
ఎంత విశ్వాసమో అంత ఫలితం మరి ! నా ఎరికలో సీనయ్య దొర అని మన కరనాలె! --కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చేతిలో చిరతలు పట్టుకొని ఒక పది మంది గ్రూపుగా
ఎగురుతూ గెంతుతూ గంట సేపు ఆగకుండా పాడేవాడు హార్మోనియం తబలా గజ్జెలు పెద్ద ఇతడి తాళాలు ఉండేవి గుడిలోనే
అమ్మలాగే ఎన్నో రకాల భాదలతో మానసిక శారీరక రుగ్మతలతో దూర గ్రామాలనుండి వచ్చి నెలల కొద్దీ వండుకుని తింటూ ఏకభుక్తం భూతల శయనం చన్నీళ్ళ స్నానం
ఉదయం సాయంత్రం ౧౦౮ ప్రదక్షిణాలు చేస్తూ బాగు పడ్డారు ఇప్పటికి మన ఉమాశంకరు ఏకాదశి రోజున జనగామ భక్తులతో వచ్చి సేవిన్చుకుంటాడు స్వామిని .--
సప్తాహం ఎక్కాహం భజనలతో అన్నదానం తో తరిస్తున్నాడు నాకంటే స్వామి మహత్తు తనకే బాగా తెలుసు ! వానికే కాదు అక్కడివారందరికి సుందిళ్ళ లక్ష్మి నారసింహ స్వామి ఇలవేలుపు అన్ని శుభాలకు స్వామిని ఆశ్రయిస్తారు సేవించుకుంటారు అలాగే స్వామి వారిని కరునిస్తాడు కుడా !
అమ్మ అక్కడ ఉంటున్న రోజుల్లో మా కమలక్క బావ వాళ్ళు కూడా బండ్లు కట్టుకుని వచ్చి వండుకుని తిని రాత్రి నిద్ర చేసి వెళ్లి పోయేవారు -- దగ్గరలోనే చందనాపురం గ్రామం అక్కడ ముగ్గురు మామలకు భుములున్దేవి వాటిని చూసుకోడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ! నర్సయ్య అని అక్కడి వాడు ఈ భూములు ఇల్లు చూసేవాడు అపుడపుడు అమ్మకు ఏమైనా తెచ్చేవాడు
ఇంకా ఉంది

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...