Skip to main content

పార్ట్ 5

శ్రీలక్ష్మి అడిగింది స్వామిని చూడండి ఆమెను కరుణించండి ఇకనైనా దయ కలగడం లేదా ఆ దీను రాలిపై !భర్తను పోగొట్టుకుంది దాయాదులు తరిమేశారు తల్లిగారింటి వారికి భారమైంది ఈ కుష్టు రోగంతో ఎవరికీ మొహం చూపలేక మన దరికి చేరింది కటిన మైన దీక్షతో సేవిస్తుంది పెద్ద కొడుకు దూరం గా పాలివాళ్ళ పంచలో వారి దయా దాక్షిణ్యాల పై ఆధార పడి దూరం గా ఉన్నాడు వీరేమో చిన్న పిల్లల్లు అజ్ఞానం ఆమె బేలగా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది నా అనే వారు కరువై !పాపం !భయంకర మైన కుష్టువ్యాది తో భాద పడుతోంది ఎ వైద్యము లేక నిన్నే ఆశ్ర యించిది ! అనాధశర ణ్యా !ఈ అనాధ ను కరునించమని వేడుకొంది
అప్పుడే మా అమ్మకు ఆ అమ్మ ఈ పాట చెప్ప్పింది కలలో . ఇది అమ్మ హృదయంలో నిలిచి పోయింది తన జీవితాంతం మరిచి పోకుండా మనసార నిత్యమూ పాడుకుంది .తనను స్వామికి అర్పించుకుంది మనసా వాచా కర్మణా శ్రీ లక్ష్మీ నారసింహుని స్మరించుకుంటూ తనను తానూ మై మరచి పోయింది
మాములుగా అయితే కలను ఆధ్రుశ్యాన్ని మరచి పోతాం కాని ఆ మహాలక్ష్మి మరువలేని మరపురాని విదంగా కమనీయంగా కళ్ళకు కట్టినట్లుగా కనుల విందుగా కమ్మగా చెప్పింది అయితే అమ్మ కు ఆ స్వామీ సన్నిదిలో ఊరివారి భక్తుల భజనలు ఎక్కాహాలు ప్రతి ఆదివారం ఇరవై నలుగు గంటలు కీర్తనల్లు పాడేవారు అమ్మ సుకృతం ఏమంటే సుందిళ్ళ గ్రామంలో చక్కని భజనలు చేసే వారుండటమే! అందు వాళ్ళ భక్తీ పాటలు మేలుకొలుపులు నిత్య జీవిత మైనాయి నిజమైన భక్తురా లైంది !
అందు చేత ఆ అమ్మ వారు చెప్పింది చెప్పినట్టుగా అమ్మకు జ్ఞాపకం ఉండిపోయింది
అమ్మ జీవితంలో మైలురాయి కలికి తురాయి యోగినిగా భక్తురాలిగా మార్చిన మలచిన నేత్ర పర్వంగా వినిపించిన కమ్మనైన అమ్మపాట ఇదిగో మనము పాడు కుందాము--
అమ్మ చూడవే ! అన్డలమ్మా అమ్భోది శయనునడ దిగో చూడూ!
అమ్భు జాత పత్రనేత్రున్దదిగో చూడూ ! !! అమ్మ!!
నంద నందన సుందరి రావే ! నవ నీత చోరున్డదిగో చూడూ !
సిగ్గుపడి తల వంచకే అమ్మా
చిరు నవ్వులు చిందులు ఒలికే శ్రీ రంగ నాథు డదిగో చూడూ !
శంఖ చక్ర పీతాంభర ధరుడే ! శరణాగత రక్షణ బిరుదులూ గలవే !
వక్షమున తులసి వన మాలలు గలవే
శ్రీ వత్స లాంచ నాంచిత చిహ్నము లవిగో చూడూ !
కలువ రేకుల కన్నులు గలవే ! కందర్పుని మించిన సొగసులు గలవే ! !అమ్మా !౧
తిరుమణి తిరు చూర్ణ మ్ములు గలవే
సిరులోలికెడు భ్రూ యుగములు గలవే !
కోటి సూర్యులా కాంతులు గలవే
కోమలాంగిరో చూడవే అమ్మా ! !! అమ్మా !!

నిజంగా అలాంటి పున్యాత్మురాలి కి ధర్మాత్ముడైన తండ్రికి కొడుకులుగా పుట్టినందుకు మేము గర్వ పడుతున్నాం చెట్టొక తైతే విత్తోకట? తల్లీ తండ్రి సత్వ గుణ సంపన్నులు కనుక మాలో కూడా ఆ తత్త్వం జీర్ణించుకు పోయింది -
మళ్లీ జన్మంటూ ఉంటె వారే తలి దండ్రులు కావాలని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటున్న మనసార !


"పోతన రామాయణం లో అసంపూర్ణ పద్యం శ్రీ రాముడు వ్రాసిన విషయం , కాళిదాసు కి ఆ సరస్వతి మాత జ్ఞానమిచ్చిన అద్భుతమైన ఘట్టం తెలుసు.
భక్తుల పైన భగవంతునికి వుండే దయ ప్రేమ లను మనం గ్రందాలల్లో చదివాం ఇలాంటివన్నీ. ఇపుడు మన అమ్మమ్మ పాట సజీవ మైన నిదర్శనం.

అమ్మమ్మ సంపాదించుకున్న అచిరకాలం ఆస్తి ఇది. ఈ పాట ని మనకు వీలైనంత వరకు ప్రాచుర్యం చేసి మన అమ్మమ్మని సజీవంగా ఉంచుదాం కలకాలం. ఆ అమ్మవారు అనుగ్రహం, ఆశయం అదే కాబోలు. కనపడిన ప్రతీ వారికీ అమ్మమ్మ ఈ పాట ని వినిపించేది. వ్రాసి ఇచ్చేది. ఇక ఈ పుణ్య కార్యం మా వంతు. మన వంతు. "

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...