Skip to main content

పార్ట్ 4

తాత వెంకటేశ్వేరరావు అంటాడు ఈ ఆస్తి నేను నిన్న్నురాగంపేట వీరయ్య పంతులుకు పెంపకాని కిస్తే నీకు ఆస్తి వచ్చింది !లేకపోతే అర్నకొండలో ఆరో భాగానికి ఉండేవాడివి నీవు! మా బాపు అంటాడు కదా --నిజమే ఆస్తి వచ్చింది నీది కాదు ఆది వీరయ్య పంతులుది --అయన ఇవ్వాలి నీకు తమ్ములకు నేను ఇవ్వలేను ! ఎందుకంటే ఇది రేవెల్లి వాళ్ళ ఆస్తి మీరు చల్ల్లూరు వాళ్ళు ఈ ఆస్తిని నా చేతిలో పెట్టింది వంశాన్ని ఉద్ద రించమని ఆస్తిని కాపాడమని నా తమ్ములకు పంచి ఇవ్వదానికేనా నీవు ఆస్తి పై కన్ను వేశావు నీవే ఈఆస్తిని పంచు !నేను పంచలేను ఆ వీరయ్య పంతులే ఉంటె ఇలా నీవు చేసే వాడివా !అడిగే వాళ్ళు లేరని ఆయనకు అయన ఉప్పు తింటూ అధర్మం చేస్తామా !ధార పోసింది నన్నోక్కన్నే నా తమ్ముళ్ళను కాదు కదా ! అయన ఆస్తిని పంచి ఆయనకు ద్రోహం నేను చేయలేను నీవే ఈ ఆస్తిని పంచుకో -----అని
ఇది ధర్మ సందేహం ఆ నాడు కురు సభ లో ద్రౌపదికే వచ్చింది ! ఇపుడు మా అమ్మకే వచ్చింది !తండ్రీ కొడుకుల తగాదాల మధ్య తను నలిగిపోయింది పిల్లలు యాతన పడ్డారు వెంకటమ్మ అమ్మను చాల కష్టపెట్టింది తిండి పెట్టక మాడ్చింది సీనన్న పుట్టినపుడు అమ్మకు పాలు లేక పోతే పాల కోసం బాగా ఏడ్చాడట ఇల్లంతా ద్వనిన్చేదట అయినాఆ
కథినురాలి మనసు కరుగ లేదట రోజు రామ కోటి రాసే ఆ పెద్ద మనిషికి వేంకటేశ్వరస్వామీ అయన కల్లోకొచ్చి ఒక్క చెంప దెబ్బ వేశాడట రామకోటి రాస్తున్నావు పసి పిల్లాడి ఏడుపు విని పించాడంలేదా !అందుకే నీకు అజీర్ణ రోగం రోజు వాడికి పాలివ్వు !నీకు నయమవు తుంది ! అని కల వచ్చిందట ! ఆ రోజునుండి భార్యకు తెలియకుండా రోజు పాలు పితికే మనిషి ఎర్రయ్య తో చెప్పి సీనన్నకు పాలు ఇప్పించే వాడట పిల్లాడి ఏడుపు బందు అయ్యింది వెంకటమ్మ కు అనుమానం వచ్చింది ఎర్రయ్య పాలు పోయడం కాపు కాసి కానీ పెట్టింది అంతటి పెనుగొండ రాక్షసి ఆమె రోజు ఆరు బర్ల పాలు తాగే వారు ఇంట్లో కాని బాపు కుటుంబం ఆకలితో అల్లది పోయేది
మంచి నీళ్ళ బావి కాడ చాటుగా కిష్టయ్య గారి తల్లి అన్నం పెట్టె దట కమలక్కకు కట్టుకోడానికి దొడ్డు బట్టలు ఇచ్చేడట చుట్టూ ప్రక్కల బ్రాహ్మణులూ పాపం అనే వారు అమ్మను !పెరుగు పాలు నెయ్యి ఎన్నో రకాల పలహారాలు తన గదిలో పెట్టుకొని తొక్కు పులుసు అన్నం పెట్టేదట
దొడ్డికి బయటకు వచ్చేది కాదట విస్తర్లో పోతే అనంతమ్మ బయట పారేసేది అంతగా అత్తరికం చేసింది వెంకటమ్మ దాని ఫలితమే మా అమ్మకు కుష్టు వ్యాధి రావడం
పెద్దింటి బిడ్డ అయినా తినడానికి తిండి కట్టు కోడానికి బట్టా కనీసం ఉండడానికి ఇల్లు కూడా నోచుకోలేదు అమ్మ పుస్తెతో బాటు కస్తాలనుకుడా మెడకు కట్టుకుంది
ఇక తల్లి గారింట్లో ----------బాపు పోయాడు పెద్ద కొడుకు దాయాదుల పంచలో వారి దయా దాక్షిణ్యాలక్రింద పడి ఉన్నాడు ఏమి తింటున్న డో ఎలా ఉన్నదో తెలీదు
నేను సీనన్న చిన్న వాళ్ళం మనోవ్యాది తో అనాధల్లా గడుపు తుండగానేఅమకు రెండుకాల్లలో పుండ్లు మొదలయ్యాయి నడవ లేక పొయ్యేది భాద భరించలేక ఏడ్చేది ఎవరో చెప్పారు అడవిలో దొరికే విష్ ముష్టి కాయల తో వైద్యం చేయాలని అప్పుడు ఒక సంచి కాయలు తెస్తే ౨౫రుపయ lu
అయ్యేవి ఎవరివ్వాలి ఎవరు తేవాలి అయినా నలుగు సార్లు తెప్పించారు అవి దంచి ఆ ముద్హలో రెండు కాళ్ళు పెట్టి రెండు గంటలు ఉంచితే పుండుల్లోంచి౧౦ ౧౫ పురుగులు
పడేవి ఈ దృశ్యం చూసి వాసన భరించ లేక దగ్గరికి రాక దూరంగా ఉండేవాళ్ళు అంతా దాదాపుగా వెలి వేసినట్టుగా ఉండేది ఇది భరించ లేక గంగలో పడదామని చాల సార్లు గంగ తోవ వెళ్ళింది అన్నం నూరుకొని తినే యత్నం చేసింది కాని మేము దిక్కులేని వాళ్ళం అవుతామని అన్నీ భరించింది దిక్కులేనివారికి దేవుడే దిక్కని రోగాలు నయం చేయగల సమర్థుడు సుందిళ్ళ స్వామిని ఆశ్రయించింది నన్ను సీనన్నాను తీసు కొని వెళ్ళింది
తడిబట్టలతో ఉదయం సాయంత్రం ప్రదక్షిణాలు స్వయం పాకం కరెంటు లేదు జోరుగా గాలి వాన కట్టెలు మందేవి గావు ఇప్పుడున్న వసతి అప్పుడు లేదు జనాలు ఇద్దరు ముగ్గురికంటే ఎక్కువ వచ్చే వారుకాదు అందరు ఉంది అన్నీ ఉంది ఎవరికీ ఏమీకాని పరిస్తితి ఇలా రెండేండ్లు కష్ట కాలం బ్రతుకు ఈడ్చింది ఆ ఉరివాళ్ళు పాపం అనేవాళ్ళు అమ్మను అడుకోనేవాళ్ళు భజనలు చేసేవాళ్ళు గుడి చుట్టూ పొలాలు దూరంగా చెలిమే ఉండేది గుడి బండల్లో కప్పలు పాములు తిరిగేవి దైవం పై భారం వేసి ఎన్నో రాత్రులు ఒంటరిగా ఆ బండలపై కొంగు పరచుకునీ పడుకునేది సీనయ్య దొర అని తాత అమ్మకు ధైర్యం చెప్పే వాడు పూజారి నర్సయ్య గారు మంచివాడు తిండి తిప్పలు చూసే వాడు అమ్మ బాధ చూడ లేక అమ్మవారు

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...