Skip to main content

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు -
సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం
వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -!
ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు -
--రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక చదువుకునే వసతి లేక పట్వారి గిరి -దిక్కు అయింది -ఇద్దరు మామలతో హాయిగా ఆనందంగా గడిపాడు బాల్యం లోని ఆనందం అందం అప్పుడే అనుభవించాడు -ఇది మా చిన్నాయనలు భరించ లేక పోయారు =వెనక్కి పిలిపించారు -అంతటితో చదువు బంద్-బాపు పోయాక అమ్మను చూడటానికి మాత్రమె వెళ్ళాడు
ఇక సీనన్న -నేను చోప్పదండిలో తను నేను 5 చదివాం -కొట్టంలో ఉండగా -- ఉల్లోకి వచ్చాక -మా బాపన్న తాత చిన్నాయనల -ప్రోద్బలం తో
మంగమ్మ ఇంట్లో కరీంనగర్ లో -చదువు కోసం -ఉంచాడు .అదే సీనన్న-నా చదువుల్లో గొప్ప మార్పు తెచ్చింది -
వెంకటేశ్వర్ రావు తాతకు ఇద్దరు తమ్ముళ్ళు -రంగా రావు -రామారావు పోలంపల్లి మల్లాపురం ఊర్లలో ఉండేవారు -రామారావుకు సంతానం లేదు కాని బోలెడు ఆస్తి - రంగ రావుకు కూడా సంతానం లేక -ఇదే భద్రయ్య బాపును పెంపకం -పెట్టు కున్నాడు -ఆ తర్వాత ఈయన ఆస్తిని అమ్మి డబ్బు చేసుకున్నాడు -దానికోసం -పెద్దగా పైరవీ కూడా చేశాడు -ఆస్తి సొమ్ముకోసం వాళ్ళు ఏమైనా చేస్తారనడానికి ఇదే సాక్ష్యం
సీనన్నకు నాకు కస్టాలు ప్రారంభం -ఆది మొదలు- సీనన్న మకాం రామా రావు ఇంటికి కమాన్ దగ్గరకు మార్చారు -సీనన్న అక్కడ నేను ఇక్కడ మంగమ్మ ఇంట్లో ఉండటం -కరీంనగర్ లో ఉంటున్నాం --కాని వేరు వేరు ఇండ్లలో -మేము ఒకరు మరొకరం చూసుకోవద్దు--రావద్దు -ఇలా మాకు బాపన్న చెప్పాడు వాళ్ళు కూడా --
ఒకసారి నాకు పెన్నులో ఇంకు అయిపొయింది -నడుచుకొంటూ వెళ్ళా సీనన్న ఉంటున్న ఇంటికి - కలిశాడు -భయం భయంగా తిరిగి వచ్చాను బాపన్నకు తెలిసింది -నన్ను కోప్పడ్డాడు -భద్రయ్య బెదిరించాడు -నాకు దుఃఖం వచ్చింది -ఏడ్చాను - నన్ను ఇంటిక్కి రాగంపేటకు తీసుకెళ్ళాడు బాపన్న -అప్పుడు తెలిసింది అమ్మకు అసలు విషయం - సీనన్నను పోలంపల్లి రామారావుకు పెంపకానికి అయన ఇంట్లో నాకు దూరంగా ఉంచిన సంగతి -ఇంకేం అమ్మ కోపం తారస్తాయికి చేరింది -వాళ్ళ మాటలు విని జాయిదాదు కోసం నా కొడుకును పెంపకం ఉంచుతావా!
నా బొందిలో ప్రాణం ఉండగా ఒప్పుకోను --ఈ పెంపకాల వల్లనే ఇంత కొమ్పాలన్తుకున్నాయి -బాపు ప్రాణం పోయింది -దిక్కులేని వాళ్ళం అయినం
ఎవడన్న నా కొడుకు ను పెంపకం ఇమ్మని వస్తే దుమ్ము పోస్త వాని మొహం మీద -- మీ కొడుకులను బిడ్డలను ఇల్లింతం --పెమ్పకాలకు ఇచ్చుకొండ్రి--!ఈ మాటలు భద్రయ్య బాపు వినేటట్టు గట్టిగా అంది - అంటే ! మళ్ళీ సీనన్న జోలికి ఎవరూ పోలేదు - ఆ క్షణం నుండి అమ్మ సీనన్నకు శ్రీ రామ రక్షగా నిలిచింది -కాని అమ్మ అన్నట్టుగానే బిడ్డలను కూడా ఆస్తికోసం పెంపకానికి ఇచ్చుకున్నారు వాళ్ళు
రమణి ని రామయ్య పంతులుకు -శారదను భద్రయ్య పంతులుకు అన్నయ్య ఇచ్చేశాడు ఆయనకు ౫ గురు ఆడపిల్లలే మరి !
ఇంతటితో సీనన్న చదువు ఖతం !చదువుకు నీళ్ళు వచ్చాయి --ఇక నా చదువు --నాకు మంగమ్మ ఇంట్లో ఒక్కన్నే ఉంది చదువు కోవడం
అసలే ఇష్టం లేదు -పైగా భయం అసహ్యం --వాళ్ళని చూస్తుంటే -నాకు ఎంగిలి కుడు --చల్లారిన అన్నం -పెట్టేవాళ్ళు కట్టెలు కొట్టడం నీళ్ళు తేవడం కాయగూరలు తేవడం -ఇలా నరకం అనుభవించాను -ఇదంతా అమ్మ తో చెప్పాను -అక్కడ ఉండవద్దు అంది -వేరే ఉండు -అంది - కాని తాత వాళ్లకు భయపడి బాపన్న ఎ ఒక్కపని చేసేవాడు కాదు - అతనికి ౧౬--సీనన్నకు ౧౧ నాకు ౯ ఏండ్ల వయసు మాత్రమె --పిల్లలను ఏమన్నా చేస్తారేమో అని అమ్మ భయ పడేది -స్వంత నిర్ణయం తీసుకునే శక్తి ఎవరికీ ఉండేది కాదు -మా ఇద్దరినీ కలిపి చదువు కోసం వేరే ఉంచే ధైర్యం బాపన్నకు లేదు -ఎమ్ చేయాలి -నేను !నాకేమో చదువంటే వల్లమాలిన పిచ్చి
-అప్పటినుండి -కరీం నగర్ లో నేను INSPECTION బంగాళా ముందు ఉన్న్న స్కూలు లో చదివే వాణ్నిఏడవ తరగతి -సీనన్న అదే స్కూలులో 9 చదివేవాడు -అప్పుడు మాకు G R NARSAIAH HEAD మాస్టర్ --ALEXANDER _PET గా ఉండే వారు --ఆయన్ని చూస్తే చాలా భయమయ్యేది -బెత్తం పట్టుకుని స్కూల్ ముందు నిలబడితే గజ గజ వణికే వాళ్ళం -టైం కు రాకపోతే -లేటు అయితే బాదే వాడు ఇప్పటికి జ్ఞాపకం -!కాని తర్వాత ఆయన కూతురు కాథరిన్ కాల్లేజీ లో చదువు కుంటుండగా లింగాద్రి అనే స్టూడెంట్ ఆమెను కాలేజి ముందే ముద్దు పెట్టుకున్నాడు -అతడికి దానికి తగిన శిక్ష పడింది -ఆది వేరే సంగతి.
--అప్పుడు లక్షెట్టిపేట జ్ఞాపకం వచ్చింది --కాని అమ్మ ఒప్పుకోదు! -ఎందుకంటే పెద్ద మామ మా పై విసిగి వేసారి కోపం తో -ఉన్నాడు -!అయినా సరే మంగమ్మ ఇంట్లో కస్టాలు -తలచుకుంటే కరీంనగర్ లో ఉండటానికి భయం వేసింది ! పైగా సీనన్న లేకుండా ఉండటానికి మనసు ఒప్పదం లేదు -ఈ మాటా బాపన్నకు చెప్పినా లాభం లేదు -అయన తన పట్వారి గిరి పనుల్లో మా విషయం ఇంతటితో మరిచి పోయాడు కూడా --తెల్లారి లేస్తే చీలు తాత వాళ్ళింట్లోనే ఉండే వాడు - ఎప్పుడో కాని తిండికి వచ్చేవాడుకాడు --నాకు రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు.

ఆఖరికి మొండి ధైర్యం తెచ్చుకున్నాను --1958 ఆగస్ట్ లో తేది గుర్తు లేదు కాని ఒక రోజు -ఉదయం 4 గంటలకి లేచాను -అమ్మ బాపక్న్న సీనన్న -రాజి కుక్క --ఇంటిముందు పాలేర్లు కుటికెల ఎల్లయ్య పెద్ద పాలేరు మాకు చాల విశ్వాసం -కలవాడు -అంతా నిద్రలో ఉన్నారు -దొంగలా బయటపడ్డాను తలుపు తీసుకుని --జేబులో 80 పైసలు మాత్రమె ఉన్నాయి ! చేతిలో ఒక సంచీ దానిలో ఒక అంగీ లాగు -అంతే అర్నకొండ దారి పట్టాను ఇంకా చీకటి -దారి చూస్తూ భయపడుతూనే -ఉదయం 5 వరకు ఆర్నకొండ బస్ స్టాప్ చేరాను --బస్సు వచ్చింది -ఎక్కేశాను -అది నా జీవితంలోని మరపు రాని మలుపు - ! వెలగటూరు లాస్ట్ బస్ స్టాప్ -లో దిగాను -అప్పుడు వెలగటూరు బ్రిడ్జ్ నిర్మాణం లో ఉంది -ఇంకా పూర్తీ కాలేదు అప్పుడు సమయం 7 గంటలు -ఇక నడక ప్రారంభించాను -గూడెం పూలు దాటాను -అప్పుడు అదంతా అడవి -ఒంటరిగా ఎలా నడిచానో నాకే తెలీదు -మధ్యాహ్నం 2 గంటలకి లక్షెట్టి పేట లో పెద్ద మామ ఇంటికి చేరాను .

- అంతే ఇంతవరకు ఉన్న్న ధైర్యం ఒక్కసారిగా సన్నగిల్లింది -నేను వచ్చిన సంగతి పెద్ద మామకు తెలిసి రుద్రుడయ్యాడు -పోయిందనుకున్న పీడా మళ్ళీ దాపురించింది -ఆశన ఘాతకులు మోపయ్యారు -అంటూ శాపనార్ధాలు పెట్టాడు - ఇవన్నీ నేను ఉహించినవే -అక్కడ రాగంపెతలో అమ్మ నాకోసం కంగారు పడి కుటికేక ఎల్లయ్యను వెంటనే ఇక్కడికి పంపించింది నాకు ధైర్యం వచ్చింది నాకు T C పంపమని చెప్పాను -నేను అంతే అతడికి ప్రాణం నన్ను చిన్న పంతులు అని గారాబం చేసేవాడు - ఇక్కడ చేరాను ఇప్పుడు ఎలా --అమ్మమ్మ పాపం నన్ను అమ్మలా చూసింది --పెద్దమామకు భయపడి ఎవరు నన్ను పాపం అనే వాళ్ళు కాదు -సాంబన్న మామ కమలాకర్ మామలు కూడా -నన్ను చూసీ చూడనట్టు గా దూరం వెళ్లి పోయే వారు

-జనగామ రామేష్ కాక -ఇందారం విశ్వ నాదం -సూరన్న ఇప్పుడు నేను చదువు కోసం ఆయన్ను ఆశ్ర యించాం -తప్పదు -అప్పుడు హైస్కూల్ తాలుక లోనే ఉండేది -ఒక్క ఏడుపు తప్ప నన్ను దరికి తీసింది మరెవరు లేరు -ఏడ్చీ ఏడ్చీ నిద్ర పోఎవాన్ని -నాకు కావాల్సింది స్కూల్ లో చేరడం -నన్ను చేర్పించే ధైర్యం చొరవా ఎవరికీ ఉంది - పైగా దానికి TRANFER సర్టిఫికేట్ కావాలి అప్పుడు పోస్ట్ కార్డ్స్ ద్వారానే విషయాలు తెలిసేవి -సీనన్న కు రాశాను కరీం నగర్కి వెళ్లి మన స్కూల్ నుండి T C తీసుకుని నాకు పంపించమని --అలాగే చాలా కస్త పడి తనే స్వయంగా కరీంనగర్ నుండి లక్షెట్టి పేట వరకు సైకిల్ పై వచ్చి ఇచ్చాడు -తన చదువును ఫణంగా పెట్టి నా చదువు లోసం నా కోసం శ్రమించాడు .

-అయినా నా కు దారి దొరకలేదు స్కూల్కి అప్పుడు కనీసం 1 ౦ రూపాయల డొనేషన్ ఉండేది దౌడపల్లి రాజిరెడ్డి దానికి ఇంచార్జే -నన్ను అడ్మిట్ చేసే వాళ్ళు దొరక లేదు -ఇద్దరు మామలు కూడా నన్ను పట్టించుకోలేదు -అప్పుడు వాళ్ళు డిగ్రీలు పూర్తీ చేసి ఇంట్లో నే ఉన్నారు నౌకరీ ల ప్రయత్నంలో -! ఇక నాకు దిక్కెవ్వరు --మళ్ళీ ఏడవడం -ఇలా మూడు నెలలు గడచింది -దేవుడు కరుణించాడు ! ఇందారం విస్సన్ననన్ను ఒకరోజున తీసు కెళ్ళాడు -రాజి రెడ్డి సారూ వద్దకి! ఈ పిల్లాడు - అనాధ -చిన్నతనాన్నే తండ్రి పోయాడు దిక్కు లేక మేనమామల పంచన చేరాడు చదువు కోసం -తల్లి కుష్టు వ్యాధి తో భాద పడుతోంది -అని నన్ను అతని కాళ్ళమీద పడేశాడు -ఆయనకీ దయ కలిగింది నా మీద నా పరిస్తితి మీద -!స్కూలులో అలా ఆ విధంగా జాయినయ్యాను -అమ్మకు అన్నలకు ఆత్మీయులకు దూరంగా ఉంటూ --ఇదంతా ఎల్లా జరిగిందో -ఇప్పుడు తలచుకుంటే వణకు పుడుతుంది -ఎంతటి దయనీయమైన స్థితి -నా పరిస్తితి -బహుశా ఒకటి రావాలంటే మరొకటి పోవాలేమో -సృష్టిలో దేవుని సంకల్పమో సమతుల్యమో ప్రారబ్ధమో -!

నన్ను 8 వ తరగతిలో చేర్చుకున్నారు -నిక్కరు నేను తప్ప పుస్తకాలు కాపీలు పెన్ను సంచీ ఏవీ లేవు --కేవలం భోజనం తప్ప మరేమీ ఆ ఇంట్లో నాకు దొరకలేదు -కనీసం 5 ౦ పైసలు నెల ఫీజు కట్టే వీలు లేదు --నా పరిస్తితి పై జాలి పడి ఎవరికీ తెలీకుండా ఆ డబ్బులు ఇచ్చి నన్ను గడ్డు పరిస్తితి నుండి ఒద్దేక్కించింది మా పెద్దత్త ! ఆమె ఎక్కడుందో కాని ఆమె చేతి కాణీ అన్నం భిక్షనే నన్ను ఇంత వాణ్ని చేసింది -దయా మూర్తీ కాపాడింది అజ్ఞాతంగా --అలా లక్షేట్టిపెటలో నా చదువుకు అంకురార్పణం జరిగింది -

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...