మా తండ్రి చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ధృడ కాయుడు ఆజానుబాహువు చక్కని రూప సంపన్నుడు పెదమామ అనేవాడు లచ్చన్న బావ ఎం తెలివిరా ! ఇంతింత రెట్టలు
మాంచి కండలు ప్రక్కన నడుస్తుంటే నేనే అయన నడకకు అందలేదు మిత భాషి అవసరం మేరకే మాట ఆ తెలివీ ఆ గంభీరం బావ తో మాట్లాడా లంటే నాకే భయ మయ్యేది రా! నిజంగా అటువంటి తండ్రిని పోగొట్టుకున్న మీరు ఎంతో దుర ద్రుష్ట వంతులుర ! అనేవాడు పెదమామ తో శెభాష్ అనిపించుకున్న ఒకే ఒక వ్యక్తి మా బాపు అందుకే అంతా రిస్కు తీసుకున్నాడు కష్టకాలంలో ఆదరించాడు మందులు ఇప్పించాడు ఒక ఇంగ్లీష్ డాక్టర్తో రాగయ్య పంతులు వచ్చి ఆ డాక్టర్ను కలిసి లంచం ఇచ్చి పాయిసన్ ఇన్జెక్తిఒన్ ఇప్పించాడని అందుకే చివరి మాట లేకుండా పోయిందని పెదమామ డాక్టర్ మీద కోపంతో తుపాకి తీసుకుని వెళ్ళాడని ఆ పాటికే అతడు ఉడాయించాడని మళ్లీ తిరిగి రాలేదని అన్నారు . బాపు పోయాక రాగంపేట కు మాత లబు చేశారు కాని ఎవరు రాలేదు బాపన్ననుఇటు పంపక విషయం చెప్పకుండా మోతేకు పంపించారట
మా బాపు పోయాక ౧౫ రోజులవరకు బాపన్న రాలేదు పెద్ద కొడుకు ఉండగా సీనన్న తోనే మాబాపు అంత్య క్రియలు చేయించారు
మా అమ్మ కష్టాలు ఇక్కడినుండి తీవ్ర తరం అయ్యాయి మా తాత చేడిది చేయించాడని అన్నాడు పెదమామ . అందుకే అంతా ఆరోగ్య వంతునికి ఇంత రోగం రావడం మనో వ్యాధితో మంచం పట్టడం ఇంత కష్టం శ్రమ ఖ్ఖర్చు దండుగ అయ్యాయని వాపోయ్యాడు పాపం ! త్తాను కూడా అనారోగ్యం పాలయ్యాడు మా అమ్మ తో బాటు సుందిళ్ళ గుళ్ళో పెదమామ కూడా ౬ మాసాలపాటు ఇల్లు విడిచి ఉన్నాడు ఆ అనారోగ్యం చివరి క్షణం వరకు అతన్ని భాదించింది సత్తెన్న మామ తల్లి అతని రెండవ భార్యా జనగామ తల్లిగారు ౯ మంది అక్కాచెల్లె ళ్లు సతీ సావిత్రి vasuku కు 8 ఏండ్ల ప్పుడే ఆమె గతించింది ఎ అనారోగ్యం లేకుండానే ౪౦ లోనే పోయింది ఆమె అంటే ఆయనకు చాల ప్రేమ ఉండేది
పిల్లలు చిన్నతనం లోనే తల్లి లేని వారయ్యారు దాంతో ఆయనకు మేమంటే రోశిపోయ్యాడు అసహ్యం కోపం బాధ ఆవేదనా కట్టలు తెన్చుకున్నాయి ఆయనంటే సింహం చెల్లెళ్ళు తమ్ముళ్ళు తల్లి పాలేర్లు గుమాస్తాలు గడ గడ వణకేవారు అతను ఇంట్లో ఉంటె అంతా నిశ్శబ్దం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ !
ఈ విధంగా తల్లి గారింట్లో అమ్మకు స్తానంలేకుండా పోయింది నిర్మోహ మాటంగా చెప్పాడు మీ దారి మీరు చుసుకొండని మా తాతనే బాపుకు చేసినట్టుగా తనకు కూడా
చేడిది చేశాడని అతని అనుమానం ఈ రోజుల్లో చేడిది అంటే నమ్మం కానీ అప్పుడంతగా నమ్మేవాళ్ళు
ఇదేమాట రాగంపేట లో శివయ్య వైద్యుడు అన్నాడు బాపు మంచాన పడితే వైద్యం చేశాడు కొన్నాళ్ళు కానీ తర్వాత వచ్చి చెప్పాడు బాపుకు మీ తండ్రి నన్ను నీకు వైద్యం చేయవద్దని అంటున్నాడు నన్ను ఊల్లొనుండి వెల్ల కో డతా దట అని
ఇప్పుడున్న డాక్టర్ శివయ్య కు తాత అప్పుడు కబురు చేస్తే వచ్చాడు పెదమామ మా తాతను ఎదిరించే సాహసం ఎవరికీ
Comments