Skip to main content

పార్ట్ 12

నర హరి రావు తాత చని పోయే సమయానికి కమ లాకర్ రావు మామ సుర్యబాయి అమ్మామ్మ కడుపు లో ఉన్నాడు! ఇంకా పుట్టలేదు- అతనికి తండ్రి తెలియదు మా అమ్మకు వెంకన్నకు ఏడాదిన్నర తేడా ! అన్ని గ్రామాల వతన్లు చేయలేక అమ్మితే బాణిలో పోసుకొని వచ్చాడట రూపాయి నాణేలు ---పెద మామ .
మా బాపు కమలక్కకు 8 ఎండ్లకే --మా తాత మా అమ్మకు అదే 8 ఎండ్లకే పెళ్లి చేసి పోయారట .మధ్య వయస్సులోనే
పాపయ్య కొడుకులు 1 వెంకట్ రామయ్య ( భార్య కిస్ట బాయి ) 2 కిషన్రావు( కు సంతానం లేదు )
పాపయ్య తమ్ముడు సీతయ్య సంతానం లేదు
వెంకట్రామయ్య కొడుకులు
1 రాజేశ్వేర్ రావు( భార్య రత్తమ్మ ) 2 హనమంతరావు( లక్ష్మిబాయి)
1 నరహరి రావు ౩ బిడ్డలు 3 కొడుకులు సంతానం లేదు
2 మురలిదర్ రావు ౧ బిడ్డ చందన పురం భార్య రత్తమ్మ
౩ సీతమ్మ జనగామ ఆనందమ్మ చిన్నాయి అత్త
4 అహల్యమ్మ ముత్తునూరు సీనన్నకు తల్లి
బైనమ్మ బిడ్డను మురళి తాతకు ఇచ్చారట వారి కూతురు రాజా రత్నం కమాన్ పుర
నాకు తెలిసిన పెద గూడూరు వారి వంశ క్రమం రాశాను చేర్పులు మార్పులు ఉండొచ్చు సత్యంకు చాలా పట్టు ఉంది దీనిపై వానికి ఆసక్తి పెద్ద లంటే గౌరవం అభిమానం ఉన్నాయి కాబట్టి మరచి పోకుండా తను చేసే శుభా కార్యాలకు జ్ఞాపకం ఉంచుకొని పిలుస్తుంటాడు వాని ఓపిక ను మెచ్చుకోవాల్సిందే
వంశ చరిత్ర మనకు ఉంది రేవెల్లి వంశం ఈ పరగణా లో లేదట తాత ముత్తాతలు ఆంద్ర ప్రాంతంలోని రేపల్లె గ్రామం నుండి వలస వచ్చారట అప్పుడు సంతానం లేక ఎక్కడినుండో తెచ్చుకుని దత్తత పెంపకం పెట్టుకునే వారు వందల ఎకరాల భూ స్వాములు ఆంద్ర మద్రాస్ నుండి ఆడ పిల్లలను మగ పిల్లలను తెచ్చుకుని పెళ్లి చేసుకునేవారట ఆస్తి పోనీకుండా అగచాట్లు పడేవారట
కమలయ్య పంతులు మన రేపల్లె వంశ స్తాపకుడు అయన కొడుకులు వీరయ్య సేటయ్య లు
సీతయ్య పంతులుకు సంతానం లేదు కాని అన్న మీద చాలా ప్రేమ
రాగంపేట కు పొలిమేర లోని ఆర్నకొండ వెంకటేశ్వేర్ రావు ను ఆశ్రయించాడు అప్పటికే ఆయనకు వెంకటమ్మ ధర్మం వల్ల 4 కొడుకులు పెద్దవాన్ని పెంపకానికి ఇమ్మని అడిగిన తత్క్షణమే ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు మా బాపుకు 5 ఏండ్లు
ఆస్తి వతన్లు అంతా వీరయ్య పంతులు లక్ష్మి నర సింహ రావు పేర చేశాడు 1000 ఎకరం ఆస్తి 5 గ్రామాల వతన్లు ఎవరూ మాత్రం పోగొట్టుకుంటారు ?అయితే 500 ఎకరం వీరయ్య్ది అయితే సీతయ్యకు 500 ఎకరాలు తను వేరే పెంపకం పెట్టుకోక అన్న కొడుకే తన కొడుకని భావించుకుని తన పేర గల ఆస్తిని వతన్లను మా బాపు పేర చేసే శాడు సీతయ్య పంతులు
పాపం ఈ చల్లూరు వెంకటేశ్వేర్ రావు మేక వన్నె పులి అని తెలీదు ఆయనను గుడ్డిగా నమ్మి అంతా సమర్పించి దాసోహం
అన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు అంటే కాక మా బాపు పెళ్లి చూడక ముంద్ద్దె ఇద్దరు కన్ను మూశారు --
కమలయ్య పంతులు భార్య సత్తెమ్మ వీరయ్య పంతులు భార్య రత్తమ్మ కాని సీతయ్య పంతులు భార్య పరు గుర్తు లేదు కాని మా బాపును తండ్రి ఇంట్లోంచి తన్ని బయటికి గెంతేస్తే ఆమె ఇంట్లోనే తల దాచుకున్నాడు మా బాపు భార్యతో
ఆమె ఆస్తి మింగి ఆమె వంశో ద్దరకున్ని అలా గేన్తుతున్నపుడు ఆమెకు అయన ఎంత దుర్మార్గుడో తెలిసింది ఆమెను లక్ష్య పెట్ట లేదు వెంకటేశ్వేర్రావు భయంకర మైన తన 6 తలల విశ్వా రూపం చూపించాడు

Comments

Anonymous said…
this article is the autobiography of Manenna and biograpahy of his relatives who included me. It reflects the contemporary tradition, lifestyle and the attitude of all of us and others too.
Laxmi Narsimha Rao
hyderabad

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...