Skip to main content

పార్ట్ 11

1 బాపన్న మాకు దూరం గా ఉండటం --
2 మాకు శెత్రు వులైన చిన్నాయనల పంచ ఉండటం
3 తండ్రి పై పిచ్చివాడని తహసీల్లో ఆఫ్ఫీసులో దరఖాస్తూ ఇచ్చి తన పేరా వతందారి మంజూరీ కై చిన్నాయనల ప్రాబల్యం తో పిరవి చేయడం
4 బాపు వ్యాదితో ఇక్కడ కొడుకు మీద బెంగతో క్రుంగి కృశించి పోతుంటే బాపన్న కోసం అమ్మ బాపుల కోసం కలవరించి కలవరించి ఏడాదంతా బాధ పడి చని పొతే రాలేదు రానీయలేదు
౫ రెక్కలు విరిగిన పక్షిలా నీటినుండి వేరైన చేపల మరణ అవస్తలో బాపన్న కోసం బాపు విలపిస్తూ ఆవేదనతో పోవడం
6 కనీసం తండ్రికి తల కొరివి పెట్టడానికైనా లేక పోవడం పడి మందిలో ఈ విషయం తెలిసి ఇంత విరోధమా తండ్రీ కొడుకులకు అన్న చిన్నతనం
7 తన శ్రమంతా బూడిద లో పోసిన పన్నీరైందనీ గుర్తింపు లేక !
8 ఇదంతా తమ తల్లి దండ్రులకోసమే కదా ఇంత బద్నాం అయ్యింది నీకెందుకయ్యా ఈ పీడా గాలి కి పోయే కంప మెడ కెందుకు తగిలించుకున్తావు అంటున్నా వినకుండాలచ్చన్న బావ మీద ఉన్న గురుత్వం తో తన మీద రాగం పేట వాళ్ళంతా కత్తి కట్టినా వినకుండా వాళ్ళ బాగు కోసమే కదా
9 పులిలాంటి తండ్రినే లెక్క చేయని వాడు అనాధలైన తల్లిని పిల్లలను దయతో చూస్తారా ! అన్న అనుమానం
10 వాస్తవం గా బాపన్న వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయినా మాట పచ్చినిజం ! వారిని కాదని వాడు బాపన్న ఏమి చేయలేదని అందరికి తెలుసు
ఇప్పుడున్న పరిస్తితిలో తను కూడా ఏమి చేయ లేదు బావ అనే బలం పోయింది బాపన్న తనకు చిక్కడు దొరకదు
11 ఎదురుగా గోదారి అడవి తారక్క బ్రతుకు అగమ్య గోచరం! ఎన్నాళ్ళు తారక్కను తన ఇంట్లో ఉంచుకోడం పైగా ఈ భయంకర మైన కుటు వ్యాదితో
పెదమామ ఎం చేయాలి రక్షణ లేని లంకకు రాక్షసుల వలయంలోకి ఈ సీతమ్మను పసి పిల్లలను ఎలా పంపడం
ఎన్నో కారణాలు ఆయనను భాదించాయి
వాటితోబాటు ---ఇదిగో మేము పిల్లల ఆటతో తెచ్చే పోరాటంలో అయన విసిగి పోయాడు
ఇప్పుడే తన తమ్ముళ్ళు ఎదగడం చదువుఐనా ఉద్యోగాలు లేక పోవడం వాళ్లకి పెళ్ళిళ్ళు కావడం కుటుంబం పెద్దది కావడం అంతా జాయింటు ఫామిలీ ఇదంతా తానూ భరించడం తలకు మించిన భారం అయింది
మాకు లాగే పెదమామకు కూడా చిన్న తనం లోనే తండ్రి నరహరి రావు తాత చని పోయాడు అప్పుబు బాపన్నకు లాగానే 14 ఎనల వయసు తనకు ౨౦౦౦ ఎకరం పట్టాదారు 10 గ్రామాల వతన్ లు ఇంటి నిండా గుమాస్తాలు పటేల్లు రైతులు ౨౦ నాగళ్ల వ్యవసాయం కొత్తూరు మోదెల దౌడ పల్లి చందనా పురం గూడెం ఇలా ఇంకెన్నో ఉళ్లు --- ఇటు గంపెడంత సంసారం బోలెడంత వ్యవసాయం ఇంటినిండా మంది అపుడు చాలా వరకు విజయమ్మ ఉదయమ్మా సురన్నా ఇలా గరిష కుర్తి జనగామ కుటుంబం భారం కూడా తనే మోశాడు తన పెళ్లి ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి తమ్ముళ్ళ పెళ్లి చేశాడు
ఆ రోజుల్లో ఇంటికి పెద్దవాడై పుట్టడం చాలా దురదృష్టమే ! ఇంత భారం మొయ్యాలి
ఇంతే కాదు లక్షెట్టిపేట లో ఉంది చదుకోడానికి వీళ్ళందరితో బాటు విశ్శయ్య రామేష్ కాక లే కాక వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు నెలల తర బడి తింటూ ఉండే వాళ్ళు అమ్మో తలచుకుంటే భయమేస్తుంది వంటకు బ్రహ్మనమ్మ లేని రోజు లేదు ౩౦ మంది తిండికి ఉందని రోజు లేదు
అప్పుడు ఈ కరెంటు లేదు బస్సులు లేవు సైకిళ్ళు లేవు రెదిఒ లేదు గొప్ప కుటుంబా లైతే గ్రామ ఫోనుండేది ఆది తెచ్చాడు రికార్డులతో ఆనతి పాట సినిమా పాటలు పద్యాలు వినేవాళ్ళం ఎటు వెళ్ళ లన్నా కాలి నడక లేదా బండెడ్లు మాత్రమె దారి
గంగ నదిపై ఇప్పు దున్న వంతెన ఉంది కాని వెలటూరు వాగు పై వంతెన లేదు
కరీం నగర్ నుండి ఉదయం ౫ సాయంత్రం ౫ గంటలకు వెలగటూరు వరకు మాత్రమె బస్సులున్దేవి గంగా ప్రవాహం లేక మనిషి నడచే వీలు ఉంటె మొక్కట్ రావు పేట కోటి లింగాల మీదుగా నడిచి రావొచ్చు అలా కాక పొతే 16 కిలో మీటర్లు నడవాల్సిందే

చాలా పెద్ద సంసారం పెద్ద మామది చాలా కష్ట పడ్డాడు ఆస్తిని కాపాడు కోడానికి -- తన కాళ్ళ పై తానూ నిల త్రొక్కు కోడానికి తానంటే పాడనీ వాళ్ళ ను ఎదిరిచ దానికి తమ్ముళ్ళను మంటని లో ఉంచి చది వించాడు డిగ్రీకి వరంగల్లో ఉంచాడు బాపన్న లాగే పెదమామ కష్టపడ్డాడు చైనా తనంలోనే తండ్రిని పోగొట్టుకొని తలకు మించిన భారం నెత్తిన వేసుకొని .--అందుకే మాబాపు పెదమామపై దయ చూపే వాడు తరుచు వచ్చేవాడు పత్వారిగిరిలో మెళకువలు నేర్పాడు అప్పుడు పుష్కలంగా ధాన్యం పండేది ఇంటినిడా గుమ్ముల్లో వడ్లు ఉంటున్దేవి కాని పైసలు దొరక్క పోయేవి ఎర్ర కాని ఎలా ఉంటుందో చూడలేక పోయేవాల్లం --
అప్పటి రూపాయకి 16 అణాలు ఒక అణాకి 6 పైసలు అంటే ఒక రూపాయకు 96 పైసలు --ఎకాన దోవ్వాన తీనాన చారానా పంచాన చేయ్యాన సత్తాన అట్టాన నవ్వాన దస్సాన గ్యారాన బారాన తెరాన చౌదానా పంద్రాన సొలాన అంటే రూపాయ అన్నమాట --ఒక పైసా అంటే అప్పుడు రాగి చిల్లి పైసా అన్నమాట --
నిజంగారా ! ఒక్క చిల్లి పైసా కూడా లేదురా ! అనే మాట అప్పటిదే ....--!సుందిళ్ళ దేవుని ఆజ్ఞా తీసుకుని లక్షెట్టి పేటకు వచ్చాక బాపన్న ఒకటి రెండు సార్లు వచ్చాడని మమ్మల్ని చూసి వెళ్ళాడని పెద మామ కంట పడకుండా పోయే వాడని చెప్పాను కదా ! అప్పుడు నాకు బయట తను నాకు ఆ చిల్లి పైసా ఇచ్చి వెళ్లి పోయే వాడు
చాలా చిత్రమైన విషయం ఏమిటంటే నాకు సీనన్నకు యితడు అన్న మాకోసం వస్తున్నాడు అన్న జ్ఞానం లేక పోయేది అదంతా అమాయకమో అజ్ఞానమో నాకు తెలీడం లేదు ఇప్పటికి --

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...