Skip to main content

పార్ట్ 2

మన జీన్స్ లో వున్నాయి మా తండ్రికున్న లక్షణాలు అదే మర్యాద మంచితనం సహనం శాంతి ధర్మం ఎదురు మాట్లాడ క పోవడం ఓర్పు ఇలాంటి సాత్విక లక్షణాలతో అయన సంతానం మా సంతానం అవే పుణికి పుచుకున్నాము మా బాపన్నకు ఇదే కోపాన్ని తెప్పించేది ఇంత అన్యాయం జరిగిన ఏమి చేయలేని అనలేని నిస్సహాయత అమ్మమ్మపై కోపాన్ని చూపాడు నీ పెంపకంలో పెరిగాం కనక ఏమి చేయలేని వెధవలం అయ్యాము అని. (baapanna gurunchi koddiga: నాకు మాత్రం మా బాపు .
నాకు మా బాపు తెలియదు ఎలా ఉంటాడో ఏమేమి చేశాడో అమ్మమ్మ చెప్పగా అందరు అనుకోగా వినడమే !
కానీ మా బాపన్న మాకు మా బాపు లేని లోటు తీర్చాడు అన్నం పెట్టాడు ఆశ్రయం ఇచ్చాడు అభయం ఇచ్చాడు మాకు పెద్ద దిక్కయ్యాడు మా అమ్మకు వైద్యం
చేయించాడు పొగిడితే ఆ యు క్షీణం అని కోపించే వాడు అలాఅని నేనుగాని సీనన్నగాని బాపన్నకు ఏనాడైనా ఎదురు చెప్పామా? లేదు!
మాలో ఆ కృతజ్ఞత భావం ఉంది తన నలుగురి కొడుకుల కంటే మా పైననే ఎక్కువ శ్రద్ధ శ్రమ చూపాడు
ఒక్క మాటలో చెప్పాలంటే మా బాపు ఉంటె మా కోసం ఏమేమి చేసేవాడో మా bapanna adanthaa chesadu

naa jeevithamanthaa chadivithe anthataa pedabape vuntadu INbrief to say HE IS GOD GUIDE GAURD
AND EVERY THING to me

annaiah ante ala vundali)
ఆమె కథ జీవనం బాధమయం కన్నీటి గాధ !అలనాడు ద్రుపడి లా చాల భంగ పడింది . మా అమ్మను మరిది నారాయణ జుట్టుపట్టుకొని ఈడ్చి పట్టుకోటం అన్నారావు తన రెండు చేతులతో కొట్టడం మా బాపును ముగ్గురు కలిసి పట్టుకొని రామయ్య భద్రయ్య రాగయ్య కొట్టుకుంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం తల్లిదండ్రి చూస్తుండగా పట్ట పగలు రాగంపేట లోని బ్రాహ్మలు గ్రామస్తులు అయ్యో పాపం ! ఇదంతా నాకు గుర్తు !సేనన్న నేను మాత్రం వున్నాం . బాపన్న ఆ సమయంలో లేదు.
రొజూ ఎదురుగా శ్రీ రామకోటి రాసేవాడు తాత వెంకటేశ్వర్ రావు కానీ పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ ఆమె -గయ్యాళి సూర్యకాంతం వెంకటమ్మ మా నాయనమ్మ మా అమ్మను ఎంత హింస పెట్టిన ఏమీ అనే వాడుకాదు హింస లలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ చేసి చూపింది గొడ్డు కరం తో అన్న ము నీళ్ళ చల్ల మంచిల్ల బావి కెళ్ళి రొజూ ౨౦ బిందెల నీళ్ళు తేవడం మడి వంటలు చల్ల , చాయ చేయడం మరదులకు అన్నము తినిపించడం ఇలా విశ్రాంతి లేని శ్రమ తో వెంకటమ్మ సాధిమ్పులతో నానా యాతన పడింది అయితే ఈ భాద చెప్పుకునే దిక్కు లేదు భర్తకేమో తలి దండ్రులంటే అమిత భక్తి భయం ! అందరు యమ కిన్కరులే .ఆమె భాగ్య వంతుల బిడ్డ కావడం ఆమె నేరం !
మా అమ్మకు ఎనిమిదో ఏటనే పెండ్లి అయింది ౫రొజులు ఘనంగా చేశారు అప్పుడు మా పెదమామ ౫౦ ఊల్ల వతన్ దారు మంచి హోదా లో ఉన్నాడు పెండ్లి కాగానే ౨ ఏండ్లకు నరహరిరావు తాత పరమ పదిన్చాడు
అదొక దుర దృష్టం తల్లి గారింటిలో తన గోడు వినే వాడె లేదు మా బాపు అంటే పెదమామకు భయం భక్తీ .లచ్చన్న బావ అంటే విపరీతమైన గురి గౌరవ భావం ఎందుకంటే మా బాపు పట్వారి గిరి లో అందే వేసినచేయి .మహా మేధావి పేరు మోసిన
వాడు ఒకసారి వెంకట్ రామా రావును తహసిల్ కట్టలేదని లక్షెత్తిపెత జైలు లో నిర్బందిస్తే మా బాపు వెళ్లి అక్కడి తహసిల్దార్ తో మాట్లాడి బావమరిదిని విడిపించాడు ఒకే రోజులో రెండు చేతులతో నెంబర్ ఛార్ పైసల పట్టి పహానీ రాసీ తహసిల్ దార్కుసమర్పించాడట ౨౦౦౦ రూపాయలు అప్పట్లో నగదు చెల్లించాడట అప్పటినుండి అతనంటే మిక్కిలి అభిమానము గౌరవం గురి మర్యాద ! అందుకే మా బాపు అనారోగ్యం తో కన్నవారి ఆదరణకు నోచుకోక తన స్వంత ఇంట్లోంచి కట్టు బట్టలతో వెల్ల గొట్టబడి వైద్యం చేయించే వారులేక నా అనే దిక్కు కరవయ్ భార్యాబిడ్డలతో బజారున పడ్డ విపత్కర సమయంలో మా మమ్మల్ని లక్షెట్టిపేట కు తీసుకుని వచ్చాడు పేరు గల cడాక్టర్ తో వైద్యం చేయించాడు
అప్పట్లో మాకు అయన ఆపద్భందవు డయ్యాడు
కౌరవ పాండవుల పోట్లాటలో పాండవ పత్ని ఎంత పరాభవం పాలయ్యిందో అలాగే తాళికట్టించు కున్న నటి నుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అత్త వారింట్లో వేదన అధికం మంగమ్మ బుచ్చమ్మలు ఒర్చే వారుకారు.భర్త పోయి ఇక్కడే వుంది పోయింది మంగమ్మ మొగున్నే తన చుట్టూ తిప్పుకునే గడుసుది బుచ్చమ్మ .ఇద్దరు గారాల బిడ్డలే వెంకతమ్మకు ..అలపల దాపల బలంతో తను గీచిన గీత దాటనిమొగుని అండతో విజ్రుమ్భించింది కోడల్లపై పెత్తనమే ఆమె దినచర్య ఒక్క మా అమ్మ తప్ప మిగిలిన ఐదుగురు కోడళ్ళు తక్కువ స్థాయి వల్లే !తల్లి గారింటి నుండి వచ్చిన బంగారు నగలు మీద పడి గుంజు కునే వాళ్ళు పట్టు చీరలను ముక్కలుగా చిమ్పేసే వాళ్ళు ముక్కు పోగులు చెవుల కమ్మలు చేతిగాజులు కాలి పట్టాలు మాయం చేసే వాళ్ళు ఆడుబిడ్డలు ఈ విషయం తెలిసినా తెలియనట్టు మిన్నకుండేవాడు కట్టుకున్న భర్త ! ఏం cheyyali bharya!
ఇంకా ఉంది!

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...